ఓ పిల్లా పఠపఠ లాడిస్తా
చిత్రం : అక్కాచెల్లెలు (1970)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : కొసరాజు
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి :
ఓ పిల్లా పటపటలాడిస్తా
ఓహో.. ఓ పిల్లా... చకచకలాడిస్తా
ఓ పిల్లా... ఓ పిల్లా...
ఓ పిల్లా పిల్లపిల్లపిల్లా
ఓ పిల్లా పటపటలాడిస్తా
ఓహో.. ఓ పిల్లా... చకచకలాడిస్తా
తళుక్కుమని నువు మెరుస్తు వస్తే...
దాగుడుమూతలు ఆడిస్తా
తళుక్కుమని నువు మెరుస్తు వస్తే...
దాగుడుమూతలు ఆడిస్తా
ఓ పిల్లా.. ఓ పిల్లా..
ఓ పిల్లా పిల్లపిల్లపిల్లా
బుల్లోడా... చమచమలాడిస్తా
అహా... బుల్లోడా చిమచిమ వదిలిస్తా
అహా... బుల్లోడ బుల్లోడ
బుల్లిబుల్లి బుల్లోడా..
బుల్లోడా... చమచమలాడిస్తా
అహా... బుల్లోడా చిమచిమ వదిలిస్తా
చేతికందితే కదలనీయక
కాలికి నిన్ను కట్టేస్తా
చేతికందితే కదలనీయక
కాలికి నిన్ను కట్టేస్తా
అహా..బుల్లోడ బుల్లోడ...
బుల్లిబుల్లి బుల్లోడా..
బుల్లోడా... చమచమలాడిస్తా
అహా... బుల్లోడా చిమచిమ వదిలిస్తా
చరణం 1 :
చక్కనైన చుక్కవే...
చేతినిండ చిక్కావే
చక్కనైన చుక్కవే...
చేతినిండ చిక్కావే
రావాలి పిలవంగానె... రావాలి
నువు రావాలి రావాలి...
నా కులాస అప్పుడు చూడాలి
ఓ పిల్లా ఓ పిల్లా...
ఓ పిల్లా పిల్లపిల్లపిల్లా..ఆ
ఓ పిల్లా పటపటలాడిస్తా
అహా..బుల్లోడా చిమచిమ వదిలిస్తా
చరణం 2 :
వలచిందాక వెంట పడుదురు...
వలపు తీరితే పలకరు
పలుకరు పలుకరు పలుకరు పలుకరు...
పిలిచినా పలుకరు
వలచిందాక వెంటపడుదురు...
వలపు తీరితే పలకరు
అబ్బాయ్లంతా అంతేలే...
అబ్బాయ్లంతా అంతేలే...
అయ్య చూస్తే పెళ్ళౌతుందిలే
బుల్లోడ బుల్లోడ బుల్లిబుల్లి బుల్లోడా...
అయ్య చూస్తే పెళ్ళౌతుందిలే
ఎవడా దుష్టుడు చెప్పవే...
వాడికి తన్నులు తప్పవే
ఎవడా దుష్టుడు చెప్పవే...
వాడికి తన్నులు తప్పవే
ఇప్పుడు ఎదురుగా ఉన్నాడనుకో...
ఏమిటీ ఈ కథా అన్నాడనుకో..యాయ్
ఇప్పుడు ఎదురుగా ఉన్నాడనుకో...
ఏమిటీ ఈ కథా అన్నాడనుకో
హా... మీ అమ్మాయి లవ్ చేసిందయ్యా...
ప్రాణం తీస్తుందయ్యా
మీ అమ్మాయి లవ్ చేసిందయ్యా...
ప్రాణం తీస్తుందయ్యా
మీ అమ్మాయి లవ్ చేసిందయ్యా...
మావయ్యా నీ అల్లుణయ్యా
కళ్ళుపట్టుకొంటానయ్యో..
ఓ... ఓ..ఫటాఫట్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి