చకచకలాడే పడుచుంది
చిత్రం : అక్కాచెల్లెలు (1970)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : సుశీల
పల్లవి :
చకచకలాడే పడుచుంది...
రెపరెపలాడే పొగరుంది
చాటుకిరా మాటుందీ..
చకచకలాడే పడుచుంది...
రెపరెపలాడే పొగరుంది
చాటుకిరా మాటుందీ..
చరణం 1 :
విచ్చీ విచ్చని పూవుంది...
వచ్చీరాని వయసుంది
విచ్చీ విచ్చని పూవుంది...
వచ్చీరాని వయసుంది
ముసిముసి నవ్వులా మోహముందీ...
ముసిముసి నవ్వులా మోహముందీ
మోజులు తీరే వేళుందీ...
చాటుకిరా మాటుందీ
చకచకలాడే పడుచుంది...
రెపరెపలాడే పొగరుంది
చాటుకిరా... మాటుందీ..
చరణం 2 :
సోగలు తీరిన సొగసుందీ...
సొగసుకు తగినా సోకుందీ
హాయ్..సోగలు తీరిన సొగసుందీ...
సొగసుకు తగినా సోకుందీ
పచ్చదనాల చనువుందీ...
పక్కకు వస్తే ఫలముందీ
చాటుకిరా... మాటుందీ
చకచకలాడే పడుచుంది...
రెపరెపలాడే పొగరుంది
చాటుకిరా... మాటుందీ..
చరణం 2 :
రేయీ ఇంకా సగముందీ...
హాయి నీకై నిలుచుంది
రేయీ ఇంకా సగముందీ...
హాయి నీకై నిలుచుంది
తీయని మోహం నీలో ఉంటే...
తీయని మోహం నీలో ఉంటే...
తీరని దాహం నాలో ఉందీ
చాటుకిరా... మాటుందీ
హోయ్..చకచకలాడే పడుచుంది..
రెపరెపలాడే పొగరుంది..
చాటుకిరా... మాటుందీ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి