RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

1, డిసెంబర్ 2024, ఆదివారం

శ్రీమతి ఏమన్నా శ్రీవారు తందాన తాన | Srimathi Emanna | Song Lyrics | Akka Chellelu (1970)

శ్రీమతి ఏమన్నా శ్రీవారు తందాన తాన



చిత్రం: అక్కాచెల్లెలు (1970)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల


పల్లవి:


శ్రీమతి ఏమన్నా.. 

శ్రీవారు తందాన తాన

శ్రీవారేమనుకున్నా.. 

శ్రీమతి తానతందనానా


శ్రీమతి ఏమన్నా.. 

శ్రీవారు తందాన తాన

శ్రీవారేమనుకున్నా.. 

శ్రీమతి తానతందనానా

శ్రీమతి ఏమన్నా.. 

శ్రీవారు తందాన తాన


చరణం 1:


చెట్టా పట్టగ కాలంగీలం.. 

నెట్టుకునేరానా

చెట్టూ తీగలవలెనే నిన్నూ.. 

చుట్టుకు నేపోనా

చెట్టా పట్టగ కాలంగీలం.. 

నెట్టుకునేరానా

చెట్టూ తీగలవలెనే నిన్నూ... 

చుట్టుకు నేపోనా


గిలిలేని కౌగిలిలోన.. 

చలికి చెలికి చెర వేయనా

కలలూరే కన్నుల్లోన.. 

తొలి చూపుతో బందీ చేయనా


శ్రీవారేమనుకున్నా... 

శ్రీమతి తానతందనానా

శ్రీమతి ఏమన్నా..

శ్రీవారు తందాన తాన


చరణం 2:


పొద్దే తెలియని ముద్దూముచ్చట.. 

నీలో వింటున్నా

హాద్దే చూడని ఆవేశాలు... 

నీలో కంటున్నా

పొద్దే తెలియని ముద్దూముచ్చట.. 

నీలో వింటున్నా

హాద్దే చూడని ఆవేశాలు... 

నీలో కంటున్నా


వేగం ఉన్నది నాలోనా...

బిగువులు ఉన్నవి నీలోనా

ఒదిగి ఒదిగి నీ ఎదలోనా... 

నేనోడి పోదు నీ ఒడిలోన


శ్రీమతి ఏమన్నా.. 

శ్రీవారు తందాన తాన

శ్రీవారేమనుకున్నా.. 

శ్రీమతి తానతందనానా

శ్రీమతి ఏమన్నా.. 

శ్రీవారు తందాన తాన


చరణం 3:


పొంగే పొంగుకు కట్టలు వేసి.. 

నీకై చూస్తున్నా

పువ్వు తావి కవ్విస్తుంటే.. 

నేను ఊర్కున్నా

పొంగే పొంగుకు కట్టలు వేసి.. 

నీకై చూస్తున్నా

పువ్వు తావి కవ్విస్తుంటే.. 

నేను ఊర్కున్నా


మనసు కుదురుగా ఉంటున్నా... 

సొగసూరించెను పంతానా

పంతాలెందుకు మనలోనా... 

నీ సొంతం కానని అన్నానా


శ్రీవారేమనుకున్నా... 

శ్రీమతి తానతందనానా

శ్రీమతి ఏమన్నా.. 

శ్రీవారు తందాన తాన... 

శ్రీవారు తందాన తాన


ఊహూహు హుహుహుహు....


- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

సుందర సురనందన | Sundara Suranandana | Song Lyrics | Pooja Phalam (1964)

సుందర సురనందన చిత్రం : పూజాఫలం (1964) సంగీతం : ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత : సి.నారాయణరెడ్డి  నేపధ్య గానం : పి. సుశీల పల్లవి: సుందర సురనందన  ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు