RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

14, డిసెంబర్ 2024, శనివారం

అలకలు తీరిన కన్నులు | Alakalu Teerina Kannulu | Song Lyrics | Maa Naanna Nirdhoshi (1970)

అలకలు తీరిన కన్నులు



చిత్రం :  మా నాన్న నిర్దోషి (1970)

సంగీతం :  పెండ్యాల

గీతరచయిత :  సి నారాయణ రెడ్డి 

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి:


అలకలు తీరిన కన్నులు 

ఏమనే ప్రియా..

అల్లరి చూపుల పల్లవి 

పాడెను ప్రియా..

ఆ...ఆ...ఆ..ఆ..

ఆ...ఆ...ఆ..ఆ..

ఆ...ఆ...ఆ..ఆ..


అలకలు తీరిన కన్నులు 

ఏమనే ప్రియా.. 

ఆ.. ఆ.. ఆ

అల్లరి చూపుల పల్లవి 

పాడెను ప్రియా


చరణం 1:


కదలే పూలగాలి.. 

నా ఎదపై తేలి తేలి ఈ ఈ

కదలే పూల గాలి .. 

నా ఎదపై తేలి తేలి

ఏ కథలో తెలుపసాగే.. 

ఏ కలలో పలుకసాగే


ఆ తీయ్యని గాధల 

రాధవు నీవే ప్రియా ఆ ఆ...

నా తీరని వలపుల 

మాధురి నీవే ప్రియా

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..

ఆ ఆ ఆ... ఆ ఆ ఆ...


అలకలు తీరిన కన్నులు 

ఏమనే ప్రియా..

అల్లరి చూపుల పల్లవి 

పాడెను ప్రియా..


చరణం 2:


మదిలో రాగ మాలా.. 

నవమధువై పొంగు వేళా ఆ ఆ

నా తనువే పల్లవించే.. 

అణువణువే పరవశించే


ఆ గానములో నను లీనము కానీ 

ప్రియా ఆ ఆ ఆ

నీ ప్రాణము లో ఒక ప్రాణము కానీ 

ప్రియా ఆ..ఆ..ఆ..ఆ..ఆ..

ఆ ఆ ఆ... ఆ ఆ ఆ...


అలకలు తీరిన కన్నులు 

ఏమనే ప్రియా

ఆ ఆ అల్లరి చూపుల పల్లవి 

పాడెను ప్రియా

ఊ ఊ ఊ ఊ

ఊ ఊ ఊ ఊ


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు