RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

20, డిసెంబర్ 2024, శుక్రవారం

చల్లాగాలి కొట్టిందమ్మ | Challagali Kottindamma | Song Lyrics | Adavi Donga (1985)

చల్లాగాలి కొట్టిందమ్మ



చిత్రం :  అడవి దొంగ (1985)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు, జానకి 


పల్లవి : 


చల్లాగాలి కొట్టిందమ్మ ఒక్క దెబ్బ

పైటగాలి కొట్టిందమ్మ పడుచు దెబ్బ

చల్లాగాలి కొట్టిందమ్మ ఒక్క దెబ్బ

పైటగాలి కొట్టిందమ్మ పడుచు దెబ్బ


ఆ గాలినింక బంధించవా

నీ పైటచెంగు పక్కెయ్యవా

గట్టిగా గట్టి గట్టిగా... 

మెత్తగా మెత్త మెత్తగా

నీ ముద్దు పేరు 

బుగ్గ మీద ముద్రించవా 


చల్లాగాలి కొట్టిందమ్మ ఒక్క దెబ్బ

పైటగాలి కొట్టిందమ్మ పడుచు దెబ్బ


చరణం 1 :


సన్నజాజిపూల మీద తుమ్మెదాడే

సందేపొద్దు నీడ నీలిమబ్బులాడే

ఎర్రబుగ్గ మీద లేత మీసమాడే

మల్లెచెండు మీద వేడి ఊపిరాడే


ఈ ఆట సైయ్యాటగా.. 

ముప్పూట ఉయ్యాలగా

మల్లెతేనె తాగితాగి మత్తెక్కనా

చిత్తుచిత్తు చేసి నీకు చీరవ్వనా


అబ్బ... ఏం దెబ్బా.. 

హాయిగుందబ్బా.. 

ఆ.. ఆ..ఆ.. ఆ.. ఆ.. హే


చల్లాగాలి కొట్టిందమ్మ ఒక్క దెబ్బ

పైటగాలి కొట్టిందమ్మ పడుచు దెబ్బ


ఆ గాలినింక బంధించవా

నీ పైటచెంగు పక్కెయ్యవా

గట్టిగా గట్టి గట్టిగా... 

మెత్తగా మెత్త మెత్తగా

నీ ముద్దు పేరు 

బుగ్గ మీద ముద్రించవా 


చరణం 2 : 


ముక్కుపచ్చలనెర్రనైతే  తీపి అలక

పచ్చకోక కట్టుకుంటే రామచిలక

ఈడు వంట పట్టగానే ఇంత తళుకా

కొంగు కాస్త పట్టగానే ఇంత ఉలుకా


నీ చూపు దాదాపుగా 

దాచింది దోచెయ్యగా

అందమంత కొండ మీద ఆరెయ్యనా

కోన చాటు అల్లికేదో అల్లైయ్యనా


అబ్బ... ఏం దెబ్బా.. 

హాయిగుందబ్బా.. ఆ.. 

ఓ..ఉమ్మ్.... ఆ.. హే


చల్లాగాలి కొట్టిందమ్మ ఒక్క దెబ్బ

పైటగాలి కొట్టిందమ్మ పడుచు దెబ్బ

చల్లాగాలి కొట్టిందమ్మ ఒక్క దెబ్బ

పైటగాలి కొట్టిందమ్మ పడుచు దెబ్బ


ఆ గాలినింక బంధించవా

నీ పైటచెంగు పక్కెయ్యవా

గట్టిగా గట్టి గట్టిగా... 

మెత్తగా మెత్త మెత్తగా

నీ ముద్దు పేరు 

బుగ్గ మీద ముద్రించవా 


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు