RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

11, డిసెంబర్ 2024, బుధవారం

హలో సారూ భలే వారు | Hello Saru Bhale varu | Song Lyrics | Amayakuralu (1971)

హలో సారూ భలే వారు



చిత్రం: అమాయకురాలు (1971)

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత: ఆరుద్ర

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల


పల్లవి:


హలో సారూ భలే వారు 

చెలి వలపు తెలుసుకోరు

పైకెంతో చల్లని వారు.. 

తమరెంతో అల్లరివారు

నా మనసు దోచినారు


చాలు చాలు సరసాలు 

ఇక దూరంగా ఉంటేనే మేలు

లల్లలల్ల ఒహో ఒహో లలల్లల


చరణం 1:


రానిమ్ము రానిమ్ము ఏమైనకానీ.. 

నా ఇంపు నా సొంపు నీ సొమ్ము కాదా

రానిమ్ము రానిమ్ము ఏమైనకానీ.. 

నా ఇంపు నా సొంపు నీ సొమ్ము కాదా

నా తోడు నీవై.. నీ నీడ నేనై.. 

కలవాలి కరగాలి కావాలి ఒకటిగా.. ఆ..ఓ..


చాలు చాలు సరసాలు 

ఇక దూరంగా ఉంటేనే మేలు


హలో సారూ భలే వారు 

చెలి వలపు తెలుసుకోరు


చరణం 2:


రావాలి రావాలి సరియైన అదను.. 

ఆనాడు ఇవ్వాలి నీ నిండు మనసు..

రావాలి రావాలి సరియైన అదను.. 

ఆనాడు ఇవ్వాలి నీ నిండు మనసు

ఆలోగ నీవు ఆవేశ పడకు.. 

ఆకాశ సౌధాలు నిర్మించ రాదులే.. ఏ .. ఓ..


హలో సారూ భలే వారు 

చెలి వలపు తెలుసుకోరు


చాలు చాలు సరసాలు 

ఇక దూరంగా ఉంటేనే మేలు


చరణం 3:


అనురాగ బంధాలు సడలించవద్దు.. 

పెనవేయు హృదయాలు విడదీయవద్దు

అనురాగ బంధాలు సడలించవద్దు.. 

పెనవేయు హృదయాలు విడదీయవద్దు


నీ లేత వలపు ఆమోదమైన.. 

బంగారు స్వప్నాలు 

పండేది ముందెపుడో.. ఓ.. ఓ..


హలో సారూ భలే వారు 

చెలి వలపు తెలుసుకోరు

చాలు చాలు సరసాలు 

ఇక దూరంగా ఉంటేనే మేలు


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు