RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

14, డిసెంబర్ 2024, శనివారం

ఏవో మౌన రాగాలు | Evo Mouna Raagalu | Song Lyrics | Pagabattina Paduchu (1971)

ఏవో మౌన రాగాలు



చిత్రం:  పగబట్టిన పడుచు (1971)

సంగీతం:  యం. రంగారావు

గీతరచయిత :  సి నారాయణ రెడ్డి 

నేపధ్య గానం:  సుశీల


పల్లవి:


ఓహో....ఓహొ...ఓ..ఓ...ఓ...

ఏవో మౌన రాగాలు...

ఏవో మధుర భావాలు...

నాలో కదలె... ఈ వేళా


ఏవో మౌన రాగాలు... 

ఏవో మధుర భావాలు...

నాలో కదలె ...ఈ వేళా


చరణం 1:


తుంటరి వయసేమన్నది...

తూగాడు నడుమేమన్నది

చెరలాడు పైటేమన్నది...

విరహాలు ఇక చాలన్నది


తుంటరి వయసేమన్నది...

తూగాడు నడుమేమన్నది

చెరలాడు పైటేమన్నది...

విరహాలు ఇక చాలన్నది

రారా ఓ చెలికాడా...

వలపే నీదేరా...నీదేలేరా


ఏవో మౌన రాగాలు...

ఏవో మధుర భావాలు

నాలో కదలె ఈవేళా..


చరణం 2:


మాధవుడందని రాధనై...

ఆ రాధ తియ్యని బాధనై

ఆ బాధ మోయని గాధనై...

ఇన్నాళ్ళు జాలిగ తిరిగేను


మాధవుడందని రాధనై...

ఆ రాధ తియ్యని బాధనై

ఆ బాధ మోయని గాధనై...

ఇన్నాళ్ళు జాలిగ తిరిగేను..


రారా ఓ చెలికాడా...

నేనే ఆ రాధనురా...నీ రాధనురా


ఏవో మౌన రాగాలు... 

ఏవో మధుర భావాలు..

నాలో కదలె ఈవేళా... 


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు