కొంటె పిల్ల కోరుకున్న జంట దొరికింది
చిత్రం : అమాయకురాలు (1971)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి :
ఓహో.. ఓ.. ఓ.. ఓ.. ఓ..
ఆహా.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
కొంటె పిల్లా....
కొంటె పిల్ల కోరుకున్న జంట దొరికింది
వంట ఇంటి కుందేలై చేత చిక్కింది
బ్రహ్మచారీ....
బ్రహ్మచారి వంట ఇంటి బాధ తప్పింది
కళ్ళలోన పెళ్లి సొగసు గంతులేసింది
చరణం 1 :
కవ్వించి నవ్వించు గడుసైనదానా..
ఈ వింత సిగ్గేల నీ మోములోన
నను చూసి నా రాజు కను సైగ చేసే
నును సిగ్గు పరదాలు కనులందు వాలే
నీ తీపి కలలన్ని నిజమైన వేళ..
నీ తీపి కలలన్ని నిజమైన వేళ..
సరదాగ నాతోటి సరితూగ రావా
బ్రహ్మచారి వంట ఇంటి బాధ తప్పింది...
కళ్ళలోన పెళ్లి సొగసు గంతులేసింది
చరణం 2 :
చెలికాని అధరాల చిరునవ్వు నేనై..
నిండైన ప్రణయాలు పండించుకోనా
చెలి నీలి కురులందు సిరిమల్లె నేనై..
పరువాల మురిపాలు విరబూయ రానా
అందాల మన ప్రేమ బంధాలలోన...
అందాల మన ప్రేమ బంధాలలోన..
హృదయాలు పెనవేసి విహరించుదామా
కొంటె పిల్ల కోరుకున్న జంట దొరికింది..
వంట ఇంటి కుందేలై చేత చిక్కింది
బ్రహ్మచారి వంట ఇంటి బాధ తప్పింది..
కళ్ళలోన పెళ్లి సొగసు గంతులేసింది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి