RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

11, డిసెంబర్ 2024, బుధవారం

సన్నజాజి పువ్వులు | Sannajaji Puvvulu | Song Lyrics | Amayakuralu (1971)

సన్నజాజి పువ్వులు



చిత్రం : అమాయకురాలు (1971)

సంగీతం : ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత : ఆరుద్ర

నేపధ్య గానం : ఘంటసాల, సుశీల


పల్లవి :


సన్నజాజి పువ్వులు 

చందమామ కాంతులు.. 

చిన్నారి పాపా నవ్వులు

మా ఇంటి వెలుగు మా కంటి వెలుగు.. 

బంగారు జోతుల దీవెనలు


సన్నజాజి పువ్వులు 

చందమామ కాంతులు... 

చిన్నారి పాపా నవ్వులు

మా ఇంటి వెలుగు మా కంటి వెలుగు... 

బంగారు జోతుల దీవెనలు


చరణం 1 :


పాపాయి గెంతులు... 

తువ్వాయి చెంగులు

పాపాయి గెంతులు... 

తువ్వాయి చెంగులు

తూరీగలాగ దొరకదు.. 


పరుగులు తీస్తే పండుగ.. 

ఉరకలు వేస్తె వేడుక

మా జోతి చిందులే అందాల విందులు


సన్నజాజి పువ్వులు.. 

చందమామ కాంతులు... 

చిన్నారి పాపా నవ్వులు 


చరణం 2 :


తాతయ్య మీసాల ఉయ్యాలలూగేను.. 

అమ్మమ్మ కళ్ళతో దోబూచులాడేను

తాతయ్య మీసాల ఉయ్యాలలూగేను... 

అమ్మమ్మ కళ్ళతో దోబూచులాడేను

ఆడిన ఆట.... పాడిన పాట...

ఆడిన ఆట అల్లరి... 

పాడిన పాట పల్లవి.. 

మా జోతి మాటలే వరహాల మూటలు


సన్నజాజి పువ్వులు.. 

చందమామ కాంతులు.. 

చిన్నారి పాపా నవ్వులు


చరణం 3 :


ఆ కొంటె చేష్టలు ఆ చిలిపి చూపులు

ఆ కొంటె చేష్టలు ఆ చిలిపి చూపులు 

ఆనందమొసగే వరములు

ఇరుగుపొరుగు మెచ్చగా 

ఇంటిల్లిపాదికి నచ్చగా.. 

చిరంజీవి పెరగాలి బంగారు తల్లిగా


సన్నజాజి పువ్వులు 

చందమామ కాంతులు.. 

చిన్నారి పాపా నవ్వులు

మా ఇంటి వెలుగు మా కంటి వెలుగు.. 

బంగారు జోతుల దీవెనలు


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు