RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

11, డిసెంబర్ 2024, బుధవారం

పాడెద నీ నామమే గోపాలా | Padeda nee naamane | Song Lyrics | Amayakuralu (1971)

పాడెద నీ నామమే గోపాలా



చిత్రం: అమాయకురాలు (1971) 

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 

గీతరచయిత: దాశరథి 

నేపథ్య గానం: సుశీల 


పల్లవి: 


ఆ... ఆ ఆ ఆ... ఆ ఆ ఆ... ఆ... 

పాడెద నీ నామమే గోపాలా 

పాడెద నీ నామమే గోపాలా 

హృదయములోనే పదిలముగానే 

నిలిపెద నీ రూపమేరా... 

పాడెద నీ నామమే గోపాలా 


చరణం 1: 


మమతలలోనే మాలికలల్లి 

నిలిచితి నీకోసమేరా 

మమతలలోనే మాలికలల్లి 

నిలిచితి నీకోసమేరా 

ఆశలతోనే హారతి చేసి 

పదములు పూజింతు రారా 


పాడెద నీ నామమే గోపాలా 


చరణం 2: 


నీ మురళీ గానమే పిలిచెరా 

కన్నుల నీమోము కదలెనులేరా 

నీ మురళీగానమే పిలిచెరా 

పొన్నలు పూచే బృందావనిలో 

వెన్నెల కురిసే యమునాతటిపై 

ఆ..... 

పొన్నలు పూచే బృందావనిలో 

వెన్నెల కురిసే యమునాతటిపై 

నీ సన్నిధిలో జీవితమంతా ..

కానుక చేసేను రారా 


పాడెద నీ నామమే గోపాలా 

హృదయములోనే పదిలముగానే 

నిలిపెద నీ రూపమేరా... 

పాడెద నీ నామమే గోపాలా...


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

సుందర సురనందన | Sundara Suranandana | Song Lyrics | Pooja Phalam (1964)

సుందర సురనందన చిత్రం : పూజాఫలం (1964) సంగీతం : ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత : సి.నారాయణరెడ్డి  నేపధ్య గానం : పి. సుశీల పల్లవి: సుందర సురనందన  ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు