RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

1, డిసెంబర్ 2024, ఆదివారం

చిటాపటా చినుకులతో | Chitapata Chinukulatho | Song Lyrics | Akka Chellelu (1970)

చిటాపటా చినుకులతో



చిత్రం: అక్కాచెల్లెలు (1970)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల


పల్లవి:


చిటాపటా చినుకులతో.. 

కురిసింది వాన.. మెరిసింది జాణ

చిటాపటా చినుకులతో.. 

కురిసింది వాన.. మెరిసింది జాణ

చిటాపటా చినుకులతో...


తళాతళా మెరుపులతో.. 

మెరిసింది పైన.. ఉరిమింది లోన

తళాతళా మెరుపులతో.. 

మెరిసింది పైన.. ఉరిమింది లోన

తళాతళా మెరుపులతో...


చరణం 1:


వచ్చే వచ్చే వానజల్లు... 

వచ్చే వచ్చే వానజల్లు

జల్లు కాదది పొంగివచ్చు 

పడుచుదనం వరదలే అది

జల్లు కాదది పొంగివచ్చు 

పడుచుదనం వరదలే అది

వరద కాదది ఆగలేని 

చిలిపితనం వాగులే..

అది నీ వేగమే ఇది...


కురిసింది వాన.. మెరిసింది జాణ...

చిటాపటా చినుకులతో 

కురిసింది వాన మెరిసింది జాణ

చిటాపటా చినుకులతో...


చరణం 2:


నల్లమబ్బు తెల్లమబ్బు 

ముద్దులాడుకున్నవి

చుక్కలన్ని చీకట్లో 

ముసుగు కప్పుకున్నవి

నల్లమబ్బు తెల్లమబ్బు 

ముద్దులాడుకున్నవి

చుక్కలన్ని చీకట్లో 

ముసుగు కప్పుకున్నవి

ఉల్లిపొర చీర తడిసి 

ఒంటికంటుకున్నది

ఉల్లిపొర చీర తడిసి 

ఒంటికంటుకున్నది


తళాతళా మెరుపులతో.. 

మెరిసింది పైన.. ఉరిమింది లోన

తళాతళా మెరుపులతో..


చరణం 3:


మెరిసె మెరిసె రెండు కళ్లు

మెరిసె మెరిసె రెండు కళ్లు

కళ్లు కావవి మనసులోకి 

తెరిచిన వాకిళ్ళులే అవి

కళ్లు కావవి మనసులోకి 

తెరిచిన వాకిళ్ళులే అవి

వాకిళ్ళు కావవి వలపు 

తేనెలూరే రసగుళ్లులే అవి

సెలయేళ్లులే ఇవి..

మెరిసింది పైన.. ఉరిమింది లోన....


తళాతళా మెరుపులతో.. 

మెరిసింది పైన.. ఉరిమింది లోన

చిటాపటా చినుకులతో.. 

కురిసింది వాన.. మెరిసింది జాణ

చిటాపటా చినుకులతో...


- పాటల ధనుస్సు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు