RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
adavi donga లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
adavi donga లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, డిసెంబర్ 2024, శుక్రవారం

చల్లాగాలి కొట్టిందమ్మ | Challagali Kottindamma | Song Lyrics | Adavi Donga (1985)

చల్లాగాలి కొట్టిందమ్మ



చిత్రం :  అడవి దొంగ (1985)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు, జానకి 


పల్లవి : 


చల్లాగాలి కొట్టిందమ్మ ఒక్క దెబ్బ

పైటగాలి కొట్టిందమ్మ పడుచు దెబ్బ

చల్లాగాలి కొట్టిందమ్మ ఒక్క దెబ్బ

పైటగాలి కొట్టిందమ్మ పడుచు దెబ్బ


ఆ గాలినింక బంధించవా

నీ పైటచెంగు పక్కెయ్యవా

గట్టిగా గట్టి గట్టిగా... 

మెత్తగా మెత్త మెత్తగా

నీ ముద్దు పేరు 

బుగ్గ మీద ముద్రించవా 


చల్లాగాలి కొట్టిందమ్మ ఒక్క దెబ్బ

పైటగాలి కొట్టిందమ్మ పడుచు దెబ్బ


చరణం 1 :


సన్నజాజిపూల మీద తుమ్మెదాడే

సందేపొద్దు నీడ నీలిమబ్బులాడే

ఎర్రబుగ్గ మీద లేత మీసమాడే

మల్లెచెండు మీద వేడి ఊపిరాడే


ఈ ఆట సైయ్యాటగా.. 

ముప్పూట ఉయ్యాలగా

మల్లెతేనె తాగితాగి మత్తెక్కనా

చిత్తుచిత్తు చేసి నీకు చీరవ్వనా


అబ్బ... ఏం దెబ్బా.. 

హాయిగుందబ్బా.. 

ఆ.. ఆ..ఆ.. ఆ.. ఆ.. హే


చల్లాగాలి కొట్టిందమ్మ ఒక్క దెబ్బ

పైటగాలి కొట్టిందమ్మ పడుచు దెబ్బ


ఆ గాలినింక బంధించవా

నీ పైటచెంగు పక్కెయ్యవా

గట్టిగా గట్టి గట్టిగా... 

మెత్తగా మెత్త మెత్తగా

నీ ముద్దు పేరు 

బుగ్గ మీద ముద్రించవా 


చరణం 2 : 


ముక్కుపచ్చలనెర్రనైతే  తీపి అలక

పచ్చకోక కట్టుకుంటే రామచిలక

ఈడు వంట పట్టగానే ఇంత తళుకా

కొంగు కాస్త పట్టగానే ఇంత ఉలుకా


నీ చూపు దాదాపుగా 

దాచింది దోచెయ్యగా

అందమంత కొండ మీద ఆరెయ్యనా

కోన చాటు అల్లికేదో అల్లైయ్యనా


అబ్బ... ఏం దెబ్బా.. 

హాయిగుందబ్బా.. ఆ.. 

ఓ..ఉమ్మ్.... ఆ.. హే


చల్లాగాలి కొట్టిందమ్మ ఒక్క దెబ్బ

పైటగాలి కొట్టిందమ్మ పడుచు దెబ్బ

చల్లాగాలి కొట్టిందమ్మ ఒక్క దెబ్బ

పైటగాలి కొట్టిందమ్మ పడుచు దెబ్బ


ఆ గాలినింక బంధించవా

నీ పైటచెంగు పక్కెయ్యవా

గట్టిగా గట్టి గట్టిగా... 

మెత్తగా మెత్త మెత్తగా

నీ ముద్దు పేరు 

బుగ్గ మీద ముద్రించవా 


- పాటల ధనుస్సు 


ఇది ఒక నందనవనము | Idi oka Nandana Vanamu | Song Lyrics | Adavi Donga (1985)

ఇది ఒక నందనవనము



చిత్రం :  అడవి దొంగ (1985)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు, జానకి 


పల్లవి : 


ఇది ఒక నందనవనము.. 

ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా

మనసులు కలిపిన దినము.. 

ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా


తరుల గిరుల ఋతు శోభలతో..  

ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా

తరుణ హరిణ జతి నాట్యముతో..  

ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా


కొతకొత్తపాటలెన్నో కోయిలమ్మ 

నేర్చుకున్న వేళా..

ఉవ్వా..ఉవ్వా.. ఉవువ్వా.. 

ఉవ్వా ఉవ్వా..ఉవువ్వా 


చరణం 1 :


ఏటిలోని తీట నీరు 

ఏనుగమ్మ లాలపోసే... 

ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా

చుర్రుమన్న కొండ ఎండ 

ఎర్రననైన బొట్టు పెట్టే...  

ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా


చిలక గోపికలు చీరకట్టినవి... 

ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా

పాలపిట్టలిడ గూడు కట్టినవి... 

ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా


చెవులపిల్లి చెప్పుకున్న 

ఊసువిన్నది.. 

కోతిబావ చెప్పుకుంది 

చెయ్యమన్నది

హేయ్.. చేసుకో వేడిగా వేడుకా...

ఉవ్వా..ఉవ్వా.. ఉవువ్వా.. 

ఉవ్వా ఉవ్వా..ఉవువ్వా 


ఇది ఒక నందనవనము.. 

ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా

మనసులు కలిపిన దినము.. 

ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా


చరణం 2 : 


ఒంటి మీద చెయ్యి వేస్తే 

వయసుకొక్క ఊపు వచ్చే... 

ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా

ఊపు మీద నిన్ను చూస్తే 

రేపు లేని రేతిరొచ్చే... 

ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా


సిగనుపువ్వులే చెదిరిపోయినవి... 

ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా

సిగ్గుమరకలే చెరిగిపోయినవి... 

ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా


పోనుపోను గుట్టు 

నాకు దక్కుతున్నది... 

రాను రాను పట్టు 

నాకు తప్పుతున్నది

హేయ్.. తీరనీ తీయనీ కోరికా..

ఉవ్వా..ఉవ్వా.. ఉవువ్వా.. 

ఉవ్వా ఉవ్వా..ఉవువ్వా 


ఇది ఒక నందనవనము.. 

ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా

మనసులు కలిపిన దినము.. 

ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా


తరుల గిరుల ఋతు శోభలతో..  

ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా

తరుణ హరిణ జతి నాట్యముతో..  

ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా


కొతకొత్తపాటలెన్నో కోయిలమ్మ 

నేర్చుకున్న వేళా..

ఉవ్వా..ఉవ్వా.. ఉవువ్వా.. 

ఉవ్వా ఉవ్వా..ఉవువ్వా 


- పాటల ధనుస్సు 

వీరవిక్రమ ధీరదిగ్గజ | Veera Vikrama Dheera | Song Lyrics | Adavi Donga (1985)

వీరవిక్రమ ధీరదిగ్గజ



చిత్రం : అడవి దొంగ (1985)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి:


లలలలల్లాల లాలలల..

లలలలలలల లాలలల..

ఆ..ఆ..ఆ..ఆ..


వీరవిక్రమ ధీరదిగ్గజ.. 

నీకే స్వాగతాలు

వీరవిక్రమ ధీరదిగ్గజ.. 

నీకే స్వాగతాలు


వాలుచూపుల వన్నెలాడికి .. 

వయసే అంకితాలు...

మహరాజులా మనసేలుకో.. 

మహరాణిలా మనువాడుకో...


చరణం 1:


లలలలల్లాల లాలలల..

లలల లలల లలల..


వచ్చే వసంతకాలం.. 

విచ్చే సుమాలగంధం

నీకై తపించి.. 

నిన్నే జపించే అందం...


కవ్వించు తేనెదీపం.. 

కౌగిళ్ళ ప్రేమశీతం...

నేనై చలించి.. 

నిన్నే వరించే బంధం..


కొండ అరటిపండు ముద్దంట.. 

నా కొండమల్లి నువ్వంట

రసాల.. నవరసాల.. 

యమమసాల వేడిలో..

లవ్ బాయ్ లా.. లాలించవా.. 

కౌ బాయ్ లా కవ్వించనా...


వీరవిక్రమ ధీరదిగ్గజ.. 

నీకే స్వాగతాలు

వాలుచుపుల వన్నెలాడికి .. 

వయసే అంకితాలు..

లలలలల్లా..లాలా..లల్లాలా...


చరణం 2:


లలలలల్లాల లాలలల..

లల.. లల.. లల..


వాటేయ్యకుంటే పాపం.. 

వయ్యరమెంత శాపం

పూచేటి సోకు.. 

దాచేసుకోకు.. నేరం..


వలపన్నది ఎంత వేగం.. 

వలవేసి పట్టే మొహం...

తీరేది కాదు నురేళ్ల తీపి దాహం..


నీ రూపు నాకు చుక్కంట.. 

నా లేత బుగ్గకిమ్మంట...

పెట్టించు.. లగ్గం ఎట్టించు.. 

ముద్దు పుట్టించే వేళలో..

జాంపండుల దొరికవులే.. 

జేమ్స్ బండులా కలిశావులే..


వీరవిక్రమ ధీరదిగ్గజ.. 

నీకే స్వాగతాలు

వాలుచూపుల వన్నెలాడికి.. 

వయసే అంకితాలు..


- పాటల ధనుస్సు 

8, ఫిబ్రవరి 2022, మంగళవారం

వానా వానా వందనం | Vana Vana Vandanam | Song Lyrics | Adavi Donga (1985)

 వానా వానా వందనం



చిత్రం :  అడవి దొంగ (1985) 
సంగీతం :  చక్రవర్తి 
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, జానకి 


పల్లవి: 

అ ఆ ఆ.. వానా వానా వందనం... 
ఆ ఆ ఆ.. వయసా.. వయసా.. వందనం 
నీవే ముద్దుకు మూలధనం 
పడుచు గుండెలో గుప్తధనం 
ఇద్దరి వలపుల ఇంధనం 
ఎంత కురిసినా కాదనం 
ఏమి తడిసినా.. ఆ.. ఆ.. వద్దనం... ఈ దినం.. 
లల్లల్ల..లాలా.. లాలా.. 
అ ఆ ఆ.. వాన వాన వందనం... 
ఆ ఆ ఆ.. వయసా.. వయసా.. వందనం 

చరణం 1: 

చలి పెంచే నీ చక్కదనం...  

కౌగిట దూరే గాలి గుణం 
గాలి వానల కలిసి రేగుతూ.. ..

కమ్ముకుపోతే యవ్వనం 

చినుకు చినుకులో చల్లదనం ...

చిచ్చులు రేపే చిలిపితనం 
వద్దంటూనే వద్దకు చేరే 

ఒళ్లో ఉందీ పడుచుతనం 

మెరుపులు నీలో చూస్తుంటే... 
ఉరుములు నీలో పుడుతుంటే 
వాటేసుకొని తీర్చుకో... 
వానదేవుడి వలపు ఋణం...

వాన దేవుడి వలపు ఋణం... 
అ ఆ ఆ.. వానా వానా వందనం... 

ఆ ఆ ఆ.. వయసా.. వయసా.. వందనం 

చరణం 2: 

కసిగ ఉన్న కన్నెతనం... 

కలబడుతున్న కమ్మదనం 
చెప్పలేక నీ గుండ వేడిలో... 

హద్దుకుపోయిన ఆడతనం 

ముద్దుకు దొరికే తియ్యదనం .. 

ముచ్చట జరిగే చాటుతనం 
కోరి కోరి నీ పైట నీడలో.. 

నిద్దుర లేచిన కోడెతనం 

చినుకులు చిట పటమంటుంటే ..
చెమటలు చందనమౌతుంటే... 
చలి చలి పూజలు చెసుకో... 
శ్రావణమాసం శోభనం .. 

శ్రావణమాసం శోభనం 
అ ఆ ఆ వానా వానా వందనం... 
ఆ ఆ ఆ వయసా.. వయసా.. వందనం 
నీవే ముద్దుకి మూలధనం.. 
పడుచు గుండెలో గుప్తధనం... 
ఇద్దరి వలపుల ఇంధనం.. 
ఎంత తడిచిన కాదనం... 
ఏమి తడిసిన వద్దనం... ఈ దినం.. 
లల్లల్ల..లాలా.. లాలా.. 
అ ఆ ఆ వానా వానా వందనం... 
ఆ ఆ ఆ వయసా.. వయసా.. వందనం


- పాటల ధనుస్సు 

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు