RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

8, నవంబర్ 2024, శుక్రవారం

పచ్చ బొట్టు చెరిగిపోదులే | Pachabottu Cherigipodule | Duet Song Lyrics | Pavitra Bandham (1971)

పచ్చ బొట్టు చెరిగిపోదులే



చిత్రం:  పవిత్ర బంధం (1971)

సంగీతం:  ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత:  ఆరుద్ర

నేపధ్య గానం:  ఘంటసాల, సుశీల


పల్లవి:


పచ్చ బొట్టు చెరిగిపోదులే...నా రాజా..

పడుచు జంట చెదరీపోదులే.... నా రాజా..


పచ్చ బొట్టు చెరిగిపోదులే.. నా రాణీ..

పడుచు జంట చెదరీపోదులే ..నా రాణీ..


పచ్చ బొట్టు చెరిగిపోదులే...


చరణం 1:


పండిన చేలు ...పసుపు పచ్చా

పండిన చేలు... పసుపు పచ్చా

నా నిండు మమతలు.. 

మెండు సొగసులు.. లేత పచ్చా..ఆ..ఆ..


నీ మెడలో పతకం ...చిలక పచ్చా

మన మేలిమి గురుతీ వలపుల పచ్చా


పచ్చ బొట్టు చెరిగిపోదులే ..నా రాణీ

పడుచు జంట చెదరీపోదులే..నా రాణీ


పచ్చ బొట్టు చెరిగిపోదులే..నా రాజా


చరణం 2:


కలసిన కలయిక ...తలవని తలపు

మన కలసిన కలయిక ...తలవని తలపు

నీ చెలిమి విలువకే ...చేతి చలువకే...

చిగిర్చే నా మనసు


తిరిగెను బ్రతుకే... కొత్త మలుపు..ఊ...

ఇది తీయని వాడని మన తొలి వలపు


పచ్చ బొట్టు చెరిగిపోదులే ..నా రాజా

పడుచు జంట చెదరీపోదులే...నా రాణీ...


పచ్చ బొట్టు చెరిగిపోదులే ..


చరణం 3:


నూరేళ్ళ వెలుగు... నుదుటి బొట్టు

నూరేళ్ళ వెలుగు... నుదుటి బొట్టు

అది నోచిన నోములు పూచిన రోజున

పెళ్ళి బొట్టు

    

కట్టేను నీచేయ్... తాళిబొట్టు

కట్టేను నీచేయ్... తాళి బొట్టు

అది కలకాల కాంతుల కలిమి చెట్టు


పచ్చ బొట్టు చెరిగిపోదులే ..నా రాణీ

పడుచుజంట చెదరీపోదులే...నా రాజా


పచ్చ బొట్టు చెరిగిపోదులే...


- పాటల ధనుస్సు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమొకో ఏమొకో చిగురు టధరమున | Emako Chigurutadharamuna | Song Lyrics | Annamayya (1997)

ఏమొకో ఏమొకో చిగురు టధరమున చిత్రం : అన్నమయ్య (1997) సంగీతం : ఎం ఎం కీరవాణి  రచన : అన్నమాచార్య  గానం : బాలు,  సాకి : గోవిందా నిశ్చలాలందా  మందా...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు