RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

20, నవంబర్ 2024, బుధవారం

చక్కనైన ఓ చిరుగాలి | Chakkanaina O Chirugali | Song Lyrics | Premasagaram (1983)

చక్కనైన ఓ చిరుగాలి



చిత్రం :  ప్రేమసాగరం (1983)

సంగీతం :  టి. రాజేందర్

గీతరచయిత :  రాజశ్రీ

నేపధ్య గానం :  బాలు


పల్లవి:


చక్కనైన ఓ చిరుగాలి... 

ఒక్కమాట వినిపోవాలి

చక్కనైన ఓ చిరుగాలి... 

ఒక్కమాట వినిపోవాలి


ఉషా దూరమైన నేను... 

ఊపిరైన తీయలేను

గాలి.. చిరుగాలి .. 

చెలి చెంతకు వెళ్ళి 

అందించాలి

నా ప్రేమ సందేశం...


చక్కనైన ఓ చిరుగాలి... 

ఒక్కమాట వినిపోవాలి

చక్కనైన ఓ చిరుగాలి... 

ఒక్కమాట వినిపోవాలి


ఉషా దూరమైన నేను... 

ఊపిరైన తీయలేను

గాలి.. చిరుగాలి .. 

చెలి చెంతకు వెళ్ళి 

అందించాలి

నా ప్రేమ సందేశం...


చరణం 1:


మూసారు గుడిలోని తలుపులను.. 

ఆపారు గుండెల్లో పూజలను

దారిలేదు చూడాలంటే దేవతను.. 

వీలుకాదు చెప్పాలంటే వేదనను

కలతైపోయే నా హృదయం.. 

కరువైపోయే ఆనందం

అనురాగమీవేళ 

అయిపోయే చెరసాల 

అనురాగమీవేళ 

అయిపోయే చెరసాల 

అయిపోయె చెరసాల


గాలి..  చిరుగాలి..  

చెలి చెంతకు వెళ్ళి

అందించాలి... 

నా ప్రేమ సందేశం...


చరణం 2:


నా ప్రేమ రాగాలు కలలాయె.. 

కన్నీటి కథలన్ని బరువాయే

మబ్బు వెనక 

చందమామ దాగి ఉన్నదో

మనసు వెనుక 

ఆశలన్ని దాచుకున్నదో

వేదనలేల ఈ సమయం.. 

వెలుతురు నీదే రేపుదయం


శోధనలు ఆగేను ... 

శోకములు తీరేను 

శోధనలు ఆగేను ... 

శోకములు తీరేను 

శోకములు తీరేను...


గాలి..  చిరుగాలి..  

చెలి చెంతకు వెళ్ళి

అందించాలి... 

నా ప్రేమ సందేశం...


చక్కనైన ఓ చిరుగాలి... 

ఒక్కమాట వినిపోవాలి

చక్కనైన ఓ చిరుగాలి... 

ఒక్కమాట వినిపోవాలి


ఉషా దూరమైన నేను... 

ఊపిరైన తీయలేను

గాలి.. చిరుగాలి .. 

చెలి చెంతకు వెళ్ళి 

అందించాలి

నా ప్రేమ సందేశం...  

ఈ నా ప్రేమ సందేశం... 

ఈ  నా ప్రేమ సందేశం


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు