RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
shoban babu songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
shoban babu songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, జూన్ 2026, ఆదివారం

టిక్ టిక్ టిక్ గడియారం పన్నెండయ్యింది | TikTikTik Gadiyaram | Song Lyrics | Illali Korikalu (1982)

టిక్ టిక్ టిక్ గడియారం పన్నెండయ్యింది 


చిత్రం : ఇల్లాలి కోరికలు (1982)

సాహిత్యం : వేటూరి సుందర రామమూర్తి,  

సంగీతం : కె.చక్రవర్తి       

గానం : ఎస్ పి బాలు, ఎస్ జానకి,


పల్లవి : 


టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్....

గడియారం పన్నెండయ్యింది

కొక్కొరోకొ కొక్కొరోకొ....

తెల్లారి పోతానంటోంది..

మానండి అల్లరి.....

మాటోకటుంది మరి.. హ్మ్మ్..

శ్రీవారికి శ్రీమతి...

ఇస్తుందో బహుమతి


హా...అబ్బాబ్బా

మొద్దు నిద్ర మీరును.. హు


టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్....

గడియారం పన్నెండయ్యింది


చరణం 1:


కొత్త చీర కోప్పడుతుంది...

కొంగు కాస్త నలగక పోతే

పట్టెమంచం ములుగుతూ ఉంది...

పక్కమీకు పంచకపోతే


"అబ్బా... ఏమిటా గొడవ...

అర్ధరాత్రి నిద్రోస్తుంటేను"

"అబ్బా... ఎందుకలా అరుస్తారు"


అత్తగారు వింటారు...

మామగారు లేస్తారు..

అత్తగారు వింటారు... హే 

మామగారు లేస్తారు...

ఆడపడుచు విన్నదంటే...

ఆడిపోసుకుంటుంది...

మిమ్మల్నే లెమ్మంటుంటే...

అబ్బ లేవండి... హ..హాయ్ 


టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్....

గడియారం పన్నెండయ్యింది

కొక్కొరోకొ కొక్కొరోకొ....

తెల్లారి పోతానంటోంది


మానండి అల్లరి.... హ్మ్మ్.. 

మాటోకటుంది మరి... అబ్బా 


శ్రీవారికి శ్రీమతి... హ.. 

ఇస్తుందో బహుమతి.. హ్మ్మ్.. 

టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్....

గడియారం పన్నెండయ్యింది


చరణం 2:


ఒళ్ళు నాకు బరువుగ ఉంది...

కళ్ళు తెరిచి చూడకపోతే..

సొగసు రేగి సొదగా ఉంది...

మగత నిద్ర మానకపోతే..


ఇదిగో పడుకో.. వివరాలు

తెల్లవారు చూద్దాం

అర్ధ రాత్రి ఆలాపన నువ్వూనూ 


మనసు విప్పి అడిగింది...

అలుసు చెయ్యరాదండి

మనసు విప్పి అడిగింది...

అలుసు చెయ్యరాదండి


దిండుకింద పోకచెక్క...

దండగేనా చెప్పండి..


హు.. అంతేనా ... ఛి పాడు

మహా నిద్ర మీకే వస్తున్నట్లు


టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్....

గడియారం పన్నెండయ్యింది.. హు..

హే..టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్....

గడియారం పన్నెండయ్యింది.. హ్మ్మ్.. 


కొక్కొరోకొ కొక్కొరోకొ....

తెల్లారి పోతానంటోంది.. 

చాల్లేండి.. 

మానండి అల్లరి..... హ్మ్మ్..హ్మ్మ్.. 

మాటోకటుంది మరి.. మ్మ్.. 

శ్రీవారికి శ్రీమతి...

ఇవ్వాలో బహుమతి.. మ్మ్..


టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్...

గడియారం పన్నెండయ్యింది

హహహహ.. మ్మ్..మ్మ్..మ్మ్ 


- పాటల ధనుస్సు 



10, ఏప్రిల్ 2026, శుక్రవారం

మారాలి మారాలి మనుషుల నడవడి | Marali Marali Manushula | Song Lyrics | Balipeetam (1975)

మారాలి మారాలి మనుషుల నడవడి


చిత్రం : బలిపీఠం (1975)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత : సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం : ఎస్ పి బాలు, పి సుశీల


పల్లవి :


మారాలి మారాలి.. 

మనుషుల నడవడి మారాలి

మారాలి మారాలి.. 

మనుషుల నడవడి మారాలి

మారాలి మారాలి.. 

మనుషుల నడవడి మారాలి

తరతరాలుగా మారని వాళ్లను.. 

మీ తరమైనా మార్చాలి


మారాలి మారాలి.. 

మనుషుల గారడి మారాలి

మారాలి మారాలి.. 

మనుషుల గారడి మారాలి

మెప్పుల కోసం చెప్పేవాళ్లను.. 

మీ తరమైనా మార్చాలి

మారాలి మారాలి.. 

మనుషుల గారడి మారాలి


చరణం 1 :


అందరు దేవుని సంతతి కాదా.. 

ఎందుకు తరతమ భేదాలు

అందరు దేవుని సంతతి కాదా.. 

ఎందుకు తరతమ భేదాలు


అందరి దేవుడు ఒకడే ఐతే..

అందరి దేవుడు ఒకడే ఐతే.. 

ఎందుకు కోటి రూపాలు


అందరి రక్తం ఒకటే కాదా.. 

ఎందుకు కులమత భేదాలు

అందరి రక్తం.... ఒకటే అయితే..

అందరి రక్తం.... ఒకటే అయితే.. 

ఎందుకు రంగుల తేడాలు


మారాలి మారాలి.. 

మనుషుల గారడి మారాలి

మారాలి మారాలి.. 

మనుషుల నడవడి మారాలి


చరణం 2 :


తెలిసి తెలిసి బురద నీటిలో.. 

ఎవరైనా దిగుతారా

ఆ బురదలోనే అందాల కమలము.. 

పుడుతుందని మరిచేరా


కమలం కోసం బురదలోనే.. 

కాపురముండేదెవరు

మనసులోని బురద కడుగుకొని.. 

మనుషుల్లా బతికేవారు

సమధర్మం చాటేవారు.. 

సమధర్మం చాటేవారు

వారిదే ఈనాటి తరం.. 

వారిదే రానున్న యుగం

వారిదే ఈనాటి తరం.. 

వారిదే రానున్న యుగం


కాదనే వారు.. 

ఇంకా కళ్లు తెరవనివారు

మేలుకోక తప్పదులే.. 

మేలుకోక తప్పదులే

మారిపోక తప్పదులే.. 

తప్పదులే...


మారాలి మారాలి.. 

మనుషుల నడవడి మారాలి

మారాలి మారాలి.. 

మనుషుల నడవడి మారాలి

తరతరాలుగా మారనివాళ్లను.. 

మీ తరమైనా మార్చాలి

మారాలి మారాలి.. 

మనుషుల నడవడి మారాలి


- పాటల ధనుస్సు 


9, ఏప్రిల్ 2026, గురువారం

కలసి పాడుదాం తెలుగు పాట | Kalasi Paadudam | Song Lyrics | Balipeetam (1975)

కలసి పాడుదాం తెలుగు పాట 


చిత్రం :  బలిపీఠం (1975)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  శ్రీశ్రీ

నేపధ్య గానం :  ఎస్ పి బాలు


పల్లవి :


కలసి పాడుదాం తెలుగు పాట.. 

కదలి సాగుదాం వెలుగుబాట

తెలుగువారు నవజీవన నిర్మాతలనీ.. 

తెలుగుజాతి సకలావనికే జ్యోతియనీ


కలసి పాడుదాం తెలుగు పాట.. 

కదలి సాగుదాం వెలుగుబాట


చరణం 1 :


కార్యశూరుడు వీరేశలింగం  

కలంపట్టి పోరాడిన సింగం

దురాచారాల దురాగతాలను 

తుదముట్టి౦చిన అగ్నితరంగం

అడుగో.. అతడే.. వీరేశలింగం     


మగవాడెంతటి ముసలాడైనా 

మళ్ళీ పెళ్ళికి అర్హత వుంటే

బ్రతుకే తెలియని బాల  వితంతువు

కెందుకు లేదా హక్క౦టాను 


చేతికి గాజులు తొడిగాడు 

చెదిరిన తిలకం దిద్దాడు.....

మోడు వారిన ఆడబ్రతుకుల 

పసుపూ కుంకుమ నిలిపాడు.. 

నిలిపాడు


కలసి పాడుదాం తెలుగు పాట...  

కదలి సాగుదాం వెలుగుబాట


చరణం 2 :


అడుగో.. అతడే.. గురజాడ

మంచిచెడ్డలు లోకమ౦దున 

ఎంచి చూడగా రెండే కులములు

మంచిచెడ్డలు లోకమ౦దున 

ఎంచి చూడగా రెండే కులములు

మంచియన్నది మాలయైతే... 

మాల నేనౌతాను.. 

మాల నేనౌతాను అన్నాడు.....


కలసి పాడుదాం తెలుగు పాట.. 

కదలి సాగుదాం వెలుగుబాట

తెలుగువారు నవజీవన నిర్మాతలనీ...  

తెలుగుజాతి సకలావనికే జ్యోతియనీ

కలసి పాడుదాం తెలుగు పాట... 

కదలి సాగుదాం వెలుగుబాట 


- పాటల ధనుస్సు 


31, జనవరి 2026, శనివారం

చీకటిలో కారు చీకటిలో | Cheekatilo Karu Cheekatilo | Song Lyrics | Manushulu Marali (1969)

చీకటిలో కారు చీకటిలో


చిత్రం : మనుషులు మారాలి (1969)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : శ్రీ శ్రీ

నేపధ్య గానం : ఘంటసాల


పల్లవి :


చీకటిలో కారు చీకటిలో... 

కాలమనే కడలిలో

శోకమనే పడవలో... 

ఏ దరికో.. ఏ దెసకో


చీకటిలో కారు చీకటిలో... 

కాలమనే కడలిలో

శోకమనే పడవలో... 

ఏ దరికో.. ఏ దెసకో


చరణం 1 :


మనసున పెంచిన 

మమతలు పోయే

మమతలు పంచిన 

మనిషే పోయే


మనసున పెంచిన 

మమతలు పోయే

మమతలు పంచిన 

మనిషే పోయే


మనిషేలేని మౌనములోనా

మనుగడ చీకటి 

మయమైపోయే

లేరెవరూ... నీకెవరూ


చీకటిలో కారు చీకటిలో... 

కాలమనే కడలిలో

శోకమనే పడవలో... 

ఏ దరికో.. ఏ దెసకో


చరణం 2 :


జాలరి వలలో చేవు నీవే

గానుగ మరలో చెరుకువు నీవే


జాలరి వలలో చేవు నీవే

గానుగ మరలో చెరుకువు నీవే


జాలే లేని లోకంలోన

దారిలేని మనిషివి నీవే

లేరెవరూ.. నీకెవరూ..


చీకటిలో కారు చీకటిలో... 

కాలమనే కడలిలో

శోకమనే పడవలో... 

ఏ దరికో.. ఏ దెసకో


- పాటల ధనుస్సు 



తూరుపు సింధూరపు మందారపు | Toorupu Sindhurapu | Song Lyrics | Manushulu Marali (1969)

తూరుపు సింధూరపు మందారపు 


చిత్రం :  మనుషులు మారాలి (1969)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  శ్రీశ్రీ

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి:


తూరుపు సింధూరపు 

మందారపు వన్నెలలో

ఉదయరాగం.. హృదయగానం... 

ఉదయరాగం.. హృదయగానం

తూరుపు సింధూరపు 

మందారపు వన్నెలలో

ఉదయరాగం.. హృదయగానం...

ఉదయరాగం.. హృదయగానం

మరల మరల ప్రతియేడు 

మధుర మధురగీతం...

జన్మదిన వినోదం

మరల మరల ప్రతియేడు 

మధుర మధుర గీతం..

జన్మదిన వినోదం


తూరుపు సింధూరపు 

మందారపు వన్నెలలో

ఉదయరాగం.. హృదయగానం...

ఉదయరాగం.. హృదయగానం...


చరణం 1:


వేల వేల వత్సరాలకేళిలో...

మానవుడుదయించిన 

శుభవేళలో..ఓ..

వేల వేల వత్సరాలకేళిలో...

మానవుడుదయించిన 

శుభవేళలో..ఓ..

వీచే మలయమారుతాలు ...

పుడమి పలికె స్వాగతాలు

మాలికలై తారకలే...

మలిచెకాంతి తోరణాలు..

ఓ..ఓ...హోయ్


తూరుపు సింధూరపు 

మందారపు వన్నెలలో

ఉదయరాగం.. హృదయగానం...

ఉదయరాగం.. హృదయగానం...


చరణం 2:


వలపులోన పులకరించు 

కన్నులతో ...

చెలిమి చేరి పలకరించు 

మగవారు

మనసులోన పరిమళించు 

వెన్నెలతో...

ప్రియుని చూచి పరవశించే 

ప్రియురాలు

జీవితమే స్నేహమయం... 

ఈ జగమే ప్రేమమయం.. 

ప్రేమంటే ఒక భోగం

కాదు కాదు అది త్యాగం ..

ఓ..ఓ...హోయ్..


తూరుపు సింధూరపు 

మందారపు వన్నెలలో

ఉదయరాగం.. హృదయగానం...

ఉదయరాగం.. హృదయగానం...


- పాటల ధనుస్సు 



4, అక్టోబర్ 2025, శనివారం

విరిసిన సిరిమల్లి పెరిగే జాబిల్లి | Virisina Sirimalli | Song Lyrics | Bangaru Chellelu (1979)

విరిసిన సిరిమల్లి పెరిగే జాబిల్లి 



చిత్రం : బంగారు చెల్లెలు (1979)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : బాలు 


పల్లవి :


విరిసిన సిరిమల్లి.. పెరిగే జాబిల్లి

విరిసిన సిరిమల్లి.. పెరిగే జాబిల్లి

పాలవెల్లి పుట్టిన తల్లి... నా చెల్లి

విరిసిన సిరిమల్లి.. పెరిగే జాబిల్లి



చరణం 1 :


రుక్మిణి వలచింది శ్రీకృష్ణుని... 

అన్నయ్య అన్నాడు అది తగదని

రుక్మిణి వలచింది శ్రీకృష్ణుని... 

అన్నయ్య అన్నాడు అది తగదని


రాయబారమంపింది రా రమ్మని.... 

రాయబారమంపింది రా రమ్మని

పెళ్ళాడి వెళ్ళింది దొంగదారిని... 


నా చెల్లెలే రుక్మిణైతే... 

రానిస్తానా ఆ గతిని

కాళ్ళు కడిగి తెస్తాను...  

తాను కోరుకున్నవాడిని


విరిసిన సిరిమల్లి.. పెరిగే జాబిల్లి


చరణం 2 :


కైక లేని రాముడు నీ కరమును పట్టాలి...

కానకెళ్లకే లవకుశులు నీ కడుపున పుట్టాలి

కైక లేని రాముడు నీ కరమును పట్టాలి...

కానకెళ్లకే లవకుశులు నీ కడుపున పుట్టాలి 


రామా రామా అన్న కవలలు 

మామా మామా అని పిలవాలి

రామా రామా అన్న కవలలు 

మామా మామా అని పిలవాలి


అన్నయ్య కన్నుల ఆనందాశ్రువులు

 అక్షితలవ్వాలి

అన్నయ్య కన్నుల ఆనందాశ్రువులు 

అక్షితలవ్వాలి


విరిసిన సిరిమల్లి.. పెరిగే జాబిల్లి


చరణం 3 :


అన్నే అమ్మగ పెరిగిన చెల్లి... 

అన్నెంపున్నెం ఎరుగని తల్లి

అన్నే అమ్మగ పెరిగిన చెల్లి... 

అన్నెంపున్నెం ఎరుగని తల్లి


కన్నతల్లి కాంచిన కలలీ 

అన్నయ్య కంటికి రావాలి

కన్నతల్లి కాంచిన కలలీ 

అన్నయ్య కంటికి రావాలి


అవి అన్నీ పండాలి... 

నా పండుగ కావాలి

అవి అన్నీ పండాలి... 

నా పండుగ కావాలి


పాలవెల్లి పుట్టిన తల్లి... నా చెల్లి

విరిసిన సిరిమల్లి.. పెరిగే జాబిల్లి

విరిసిన సిరిమల్లి.. పెరిగే జాబిల్లి


- పాటల ధనుస్సు 


2, సెప్టెంబర్ 2025, మంగళవారం

పిలిచే వారుంటే పలికేను నేను | Pilichevarunte Palikenu nenu | Song Lyrics | Kalyana Mantapam (1971)

పిలిచే వారుంటే పలికేను నేను



చిత్రం :  కళ్యాణ మంటపం (1971)

సంగీతం :  ఆదినారాయణరావు

గీతరచయిత :  దేవులపల్లి

నేపధ్య గానం : సుశీల, బాలు  


పల్లవి :


పిలిచే వారుంటే.. పలికేను నేను

పిలిచే వారుంటే.. పలికేను నేను

హృదయాన ఉయ్యాల ఊగేను నేను

కనుపాప అద్దాన కదిలేను నేను.. 

ఆ....ఆ.....ఆ....


పలికేవారుంటే.. పిలిచేను నేను

పలికేవారుంటే.. పిలిచేను నేను

హృదయాన ఉయ్యాల ఊగేవు నీవే

కనుపాప అద్దాన కదిలేది నీవే 

ఆ....ఆ.....ఆ....


చరణం 1 :


ఏ నాటిదో ఈ బంధము.. 

మన అనుబంధము.. ఆ...ఆ... ఆ...

ఏ నాటిదో ఈ బంధము.. 

మన అనుబంధము

కలకాలము నిలవాలిలే.. 

మన అనురాగము

గోదారిలా నేడు ఉరికేను మనసు.. 


నీ పిలుపు వినగానే.. 

పులకించె బ్రతుకు 

పులకించె బ్రతుకు

పిలిచే వారుంటే.. పలికేను నేను 


హృదయాన ఉయ్యాల ఊగేవు నీవే

కనుపాప అద్దాన కదిలేది నీవే 

ఆ....ఆ.....ఆ....


చరణం 2 :


నీ రూపమే నా దైవమై 

నను మురిపించెలే ఆ....ఆ..ఆ.. 

నీ రూపమే నా దైవమై 

నను మురిపించెలే

నా అందమే అరవిందమై 

నిను పూజించెలే 

నీ మనసులో నాకు 

చోటుంటే చాలు

నా బ్రతుకులో విరియు 

నవనందనాలు.. నవనందనాలు


పలికేవారుంటే.. పిలిచేను నేను

హృదయాన ఉయ్యాల ఊగేను నేను...

కనుపాప అద్దాన కదిలేను నేను

ఆ....ఆ......ఆ......


చరణం 3 :


కలగన్నదే నిజమైనది 

చెలి ఔనన్నది

సొగసున్నదీ... గుణమున్నదీ 

చెలి నాదైనది 


అడుగుల్లో అడుగేసి నడవాలి మనము

మన మొకటి కాగానే మారాలి జగము

అడుగుల్లో అడుగేసి నడవాలి మనము

మన మొకటి కాగానే మారాలి జగము 


మన మొకటి కాగానే మారాలి జగము

మారాలి జగము.. మారాలి జగము.. 

మారాలి జగము


- పాటల ధనుస్సు 


20, జూన్ 2025, శుక్రవారం

తొలి రాతిరి మీరడిగిన ప్రశ్నకు | Toliratiri Meeragidina | Song Lyrics | Kodallostunnaru Jagartha (1980)

తొలి రాతిరి మీరడిగిన ప్రశ్నకు



చిత్రం: కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త (1980)

సంగీతం: సత్యం

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: సుశీల


పల్లవి:


తొలి రాతిరి మీరడిగిన ప్రశ్నకు..

తొమ్మిది నెలలు ఆగాలి

నేను కమ్మని జవాబు చెప్పాలి


చరణం 1:


ఈయనేమో శ్రీవారు 

ఇల్లాలై పాపం మీరు

చెయ్యి కాల్చుకోవాలనీ ...

శ్రీమతినే బహుమతి కోరి 

శ్రీమతిగా తమరే మారి

ఉయ్యాలలూపాలనీ ...

అందాలే చిందులు వేసి 

అయ్యగారి ఎత్తులు మరిగి

అభిషేకాలే చేస్తూ ఉంటే..


అవునులేండి .. తప్పేముంది.. 

తప్పేదేముంది హ..హ..


మలి రాతిరి మీరడిగిన ప్రశ్నకు

మళ్ళీ కొంచెం ఆగాలి 

నేను తీయని జవాబు చెప్పాలి

తొలి రాతిరి మీరడిగిన ప్రశ్నకు..

తొమ్మిది నెలలు ఆగాలి

నేను కమ్మని జవాబు చెప్పాలి


చరణం 2:


రెండేళ్ళ ముద్దులు ముదిరి 

పండంటి పాపలు కదిలే

సంసారమే సర్వమూ...

ఇన్నాళ్ళ ఖర్చులు తరిగి 

ఇక ముందు ఆదా జరిగి

ఈ ఇల్లే మన స్వర్గమూ ...

ఇద్దరితో ముచ్చట పడక 

మీరింకా ప్రశ్నలు వేస్తే

ముగ్గురితో ఫుల్ స్టాప్ అంటే ...


ఏమీ అనుకోకండీ.. 

ముందుంది ముసళ్ల పండగ హ..హ..


ఇక ముందు మీరడిగితే ప్రశ్నలు 

మనమే జవాబు చెప్పాలి

మనకే జవాబు దారి తెలియాలి..


తొలి రాతిరి మీరడిగిన ప్రశ్నకు.. 

తొమ్మిది నెలలు ఆగాలి

నేను కమ్మని జవాబు హు హు హు


- పాటల ధనుస్సు 


17, జూన్ 2025, మంగళవారం

ఆకలైనా ఆశలైనా కౌగిలైనా జాబిలైనా | Akalaina Ashalaina | Song Lyrics | Kodallostunnaru Jagratha (1980)

ఆకలైనా ఆశలైనా కౌగిలైనా జాబిలైనా



చిత్రం : కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త (1980)

సంగీతం : సత్యం

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : బాలు, సుశీల


పల్లవి :


ఆకలైనా ఆశలైనా 

కౌగిలైనా జాబిలైనా

సగము సగమేలే... 

మనమూ సగమూ సగమేలే

సగము సగమేలే... 

మనమూ సగమూ సగమేలే


ఆకలైనా ఆశలైనా 

కౌగిలైనా జాబిలైనా

సగము సగమేలే... 

మనమూ సగమూ సగమేలే

సగము సగమేలే... 

మనమూ సగమూ సగమేలే


చరణం 1 :


చీర నేనై  పైట నీవై 

సిగ్గుపడదామ 

సిగ్గుమొగ్గల చిలిపి నవ్వుల 

పూలు కడదామ 

ఆ.. వాన నేనై వరద నీవై 

పొంగిపోదామ 

చినుకు ముగ్గుల జిలుగు ముంగిట 

తడిసిపోదామ 


చీర నేనై  పైట నీవై 

సిగ్గుపడదామ 

సిగ్గుమొగ్గల చిలిపి నవ్వుల 

పూలు కడదామ 

ఆ.. వాన నేనై వరద నీవై 

పొంగిపోదామ 

చినుకు ముగ్గుల జిలుగు ముంగిట 

తడిసిపోదామ 


ఎవరు నీవూ ఎవరు నేను 

ఏకమైతే ఇద్దరం

ఏరు నేను నీరు నీవు 

వెల్లువైతే ఈ క్షణం


ఆకలైనా ఆశలైనా 

కౌగిలైనా జాబిలైనా

సగము సగమేలే... 

మనమూ సగమూ సగమేలే

సగము సగమేలే... 

మనమూ సగమూ సగమేలే


చరణం 2 :


ఇల్లు నేనై గడప నీవై 

చల్లగుందామ 

పైరు పచ్చల పందిరేసి 

వెచ్చగుందామ 

ఆ... హరివి నీవై సిరిని నేనై 

హాయిగుందామ 

ఆలుమగలై రేయి పగలు 

అల్లుకుందామ 


ఆ... ఇల్లు నేనై గడప నీవై 

చల్లగుందామ 

పైరు పచ్చల పందిరేసి 

వెచ్చగుందామ 

ఆ... హరివి నీవై సిరిని నేనై 

హాయిగుందామ 

ఆలుమగలై రేయి పగలు 

అల్లుకుందామ 


ఏది రాగం ఏది గీతం 

ఏకమైతే ఇద్దరం

ఏమి అందం ఎంత బంధం 

ఎల్లువైతే ఈ క్షణం


ఆకలైనా ఆశలైనా...  

కౌగిలైనా జాబిలైనా

సగము సగమేలే... 

మనమూ సగమూ సగమేలే

సగము సగమేలే... 

మనమూ సగమూ సగమేలే 


- పాటల ధనుస్సు 

 

కనులముందు నీవుంటే | Kanulamundu Neevunte | Song Lyrics | Chelleli Kapuram (1971)

కనులముందు నీవుంటే


చిత్రం  : చెల్లెలి కాపురం  (1971)

సంగీతం: కె వి మహదేవన్ 

గీతరచయిత : సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం: ఎస్ పి బాలు, పి సుశీల



సాకి : 


పరిమళించు వెన్నెలనీవే

పలకరించు మల్లిక నీవే

ఉం

నా జీవన బృందావనిలో

ఉం

నడయాడే రాధిక నీవే


పల్లవి :


కనులముందు నీవుంటే 

కవిత పొంగిపారదా

ఉం

తొలి చిగురులు చూడగానే 

కలకోకిల కూయదా


చరణం 1:


అలనాటి జనకుని కొలువులో...

ఉహుహు

తొలిసిగ్గుల మేలిముసుగులో


అలనాటి జనకుని కొలువులో

తొలిసిగ్గుల మేలిముసుగులో

అ ఆ అ ఆ రాముని చూసిన జానకివై -


అభిరాముని వలపుల కానుకవై

వాల్మీకి కావ్యవాటిక వెలసిన

వసంతమూర్తివి నీవే


కనులముందు నీవుంటే 

కవిత పొంగిపారదా

తొలి చిగురులు చూడగానే 

కలకోకిల కూయదా


చరణం 2:


అలనాటి సుందరవనములో

వనములో


ఎలప్రాయము పొంగిన క్షణములో

అలనాటి సుందరవనములో

ఎలప్రాయము పొంగిన క్షణములో

అ అ ఆ రాజును గనిన శకుంతలవై -


రతి రాజు భ్రమించిన చంచలవై

కాళిదాసు కల్పనలో మెరిసిన

కమనీయమూర్తి వీవే


కనులముందు నీవుంటే

కవిత పొంగిపారదా

తొలి చిగురులు చూడగానే

కలకోకిల కూయదా


చరణం 3:


అజంతా చిత్రసుందరివై

ఎల్లోరా శిల్పమంజరివై

అజంతా చిత్రసుందరివై

ఎల్లోరా శిల్పమంజరివై

రామప్పగుడిమోమున విరిసిన

రాగిణివై నాగినివై

అమరశిల్పులకు ఊపిరులూదిన

అమృతమూర్తిని నీవే


కనులముందు నీవుంటే 

కవిత పొంగిపారదా

తొలి చిగురులు చూడగానే 

కలకోకిల కూయదా


- పాటల ధనుస్సు 


14, జూన్ 2025, శనివారం

నీరెండ దీపాలు నీ కళ్ళలో | Neerenda Deepalu | Song Lyrics | Illalu (1981)

నీరెండ దీపాలు నీ కళ్ళలో



చిత్రం : ఇల్లాలు (1981)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత :వేటూరి

నేపథ్య గానం : బాలు, సుశీల


పల్లవి :


నీరెండ దీపాలు నీ కళ్ళలో...

నా నీడ చూసాను ఎన్నాళ్ళకో....

ఈ కొండకోనల్ల వాకిళ్ళలో.... 

నీదాననైనాను కౌగిళ్ళలో.... 


నీరెండ దీపాలు నీ కళ్ళలో....

నా నీడ చూసాను ఎన్నాళ్ళకో... 


చరణం 1 :


ఈ సంధ్య వెలుగుల్లో నారింజ రంగుల్లో

ఈ సంధ్య వెలుగుల్లో నారింజ రంగుల్లో

నీ అందచందాలు మందారమై

నీ రాగభావాలు శృంగారమై


ఈ కొండగాలుల్లో నా గుండె ఊసుల్లో

నీ మాట అనురాగ సంగీతమై

నీ చూపు ప్రణయాల పేరంటమై

పొద్దెరగని ముద్దులలో 

ముద్దగ తడిసేవేళ


నీరెండ దీపాలు నీ కళ్ళలో.... 

నా నీడ చూసాను ఎన్నాళ్ళకో... 


చరణం 2 :


నా ఆశలీనాడు ఆకాశమే చేరి

నా ఆశలీనాడు ఆకాశమే చేరి

మెరిసేను తారల్ల మణిహారమై

విరిసేను జాబిల్లి మనతీరమై


అందాల హరివిల్లు పొదరిల్లుగా మారి

వరిచేను విరిపానుపు మనకోసమై

కరగాలి జతగూడి మనమేకమై

ముద్దులలో నెలబాలుడి 

నిద్దురపోయిన వేళ


నీరెండ దీపాలు నీ కళ్ళలో.... 

నా నీడ చూసాను ఎన్నాళ్ళకో... 


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు