RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

20, జూన్ 2025, శుక్రవారం

తొలి రాతిరి మీరడిగిన ప్రశ్నకు | Toliratiri Meeragidina | Song Lyrics | Kodallostunnaru Jagartha (1980)

తొలి రాతిరి మీరడిగిన ప్రశ్నకు



చిత్రం: కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త (1980)

సంగీతం: సత్యం

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: సుశీల


పల్లవి:


తొలి రాతిరి మీరడిగిన ప్రశ్నకు..

తొమ్మిది నెలలు ఆగాలి

నేను కమ్మని జవాబు చెప్పాలి


చరణం 1:


ఈయనేమో శ్రీవారు 

ఇల్లాలై పాపం మీరు

చెయ్యి కాల్చుకోవాలనీ ...

శ్రీమతినే బహుమతి కోరి 

శ్రీమతిగా తమరే మారి

ఉయ్యాలలూపాలనీ ...

అందాలే చిందులు వేసి 

అయ్యగారి ఎత్తులు మరిగి

అభిషేకాలే చేస్తూ ఉంటే..


అవునులేండి .. తప్పేముంది.. 

తప్పేదేముంది హ..హ..


మలి రాతిరి మీరడిగిన ప్రశ్నకు

మళ్ళీ కొంచెం ఆగాలి 

నేను తీయని జవాబు చెప్పాలి

తొలి రాతిరి మీరడిగిన ప్రశ్నకు..

తొమ్మిది నెలలు ఆగాలి

నేను కమ్మని జవాబు చెప్పాలి


చరణం 2:


రెండేళ్ళ ముద్దులు ముదిరి 

పండంటి పాపలు కదిలే

సంసారమే సర్వమూ...

ఇన్నాళ్ళ ఖర్చులు తరిగి 

ఇక ముందు ఆదా జరిగి

ఈ ఇల్లే మన స్వర్గమూ ...

ఇద్దరితో ముచ్చట పడక 

మీరింకా ప్రశ్నలు వేస్తే

ముగ్గురితో ఫుల్ స్టాప్ అంటే ...


ఏమీ అనుకోకండీ.. 

ముందుంది ముసళ్ల పండగ హ..హ..


ఇక ముందు మీరడిగితే ప్రశ్నలు 

మనమే జవాబు చెప్పాలి

మనకే జవాబు దారి తెలియాలి..


తొలి రాతిరి మీరడిగిన ప్రశ్నకు.. 

తొమ్మిది నెలలు ఆగాలి

నేను కమ్మని జవాబు హు హు హు


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

స్వరములు ఏడైనా రాగాలెన్నో | Swaramulu Yedaina Ragalenno | Song Lyrics | Toorpu Padamara (1976)

స్వరములు ఏడైనా రాగాలెన్నో చిత్రం: తూర్పు పడమర (1976) సంగీతం: రమేశ్ నాయుడు గీతరచయిత: సి.నారాయణరెడ్డి  నేపధ్య గానం: పి.సుశీల  పల్లవి: స్వరములు...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు