RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

14, జూన్ 2025, శనివారం

ముక్కుపుడక పెట్టుకో మహలక్ష్మిలా | Mukkupudaka Pettuko | Song Lyrics | Palnati Simham (1985)

ముక్కుపుడక పెట్టుకో మహలక్ష్మిలా



చిత్రం:  పల్నాటి సింహం (1985)

సంగీతం:  చక్రవర్తి

గీతరచయిత:  వేటూరి

నేపధ్య గానం:  బాలు, సుశీల


పల్లవి:


ముక్కుపుడక పెట్టుకో మహలక్ష్మిలా

సిగను పూలు పెట్టుకో శ్రీలక్ష్మిలా

కౌగిలింత.. హుష్..

కౌగిలింత చేరుకో కల్యాణిలా

రేతిరంత మేలుకో రేరాణిలా

ఎన్నడు రాని ఈ మల్లెల రాతిరి హాయిగా


ముక్కుపుడక ఎందుకు మనసుండగా

సిగను పువ్వులెందుకు సొగసుండగా

కౌగిలింతలివ్వనా కట్నాలుగా

పరువమంత పరవనా తొలి పాన్పుగా

ఎన్నడు రాని ఈ మల్లెల రాతిరి హాయిగా


చరణం 1:


మొదటి రాతిరి సిగ్గు మొగలి పువ్వట

గుచ్చుకుంటుంది మొగ్గ విచ్చుకుంటుదట

మోజు ఉండి చెప్పలేని మోమాటం

గాజులున్న చేతికేమో చెలగాటం


కన్నెపిల్ల కాపురానా 

కౌగిలింతతోనె కాలు పెడుతుంటే

సిగ్గుతల్లి ఎర్రముగ్గు 

చీకటింటిలోనె చెరిగిపోతుంటే

ఆపాలు తాపాలు మురిపాలు సలపాలి


ముక్కుపుడక ఎందుకు మనసుండగా

సిగను పువ్వులెందుకు సొగసుండగా


చరణం 2:


చెంప గిల్లితే లేత చందమామలు

చెమ్మ గిల్లితే కొత్త వలపు తేమలు

పువ్వులన్ని అత్తరైన పులకింత

కంటి చూపు కబురులేని కవ్వింత


తెల్లవారి అమ్మగారు 

ఏమి ఎరగనట్టు నన్ను చూస్తుంటే

తెల్లవార్లు జరుపుకున్న 

తేనె విందు తలచి నవ్వులొస్తుంటే

ప్రతి రేయీ మనకింకా తొలిరేయి కావాలి


ముక్కుపుడక పెట్తుకో మహలక్ష్మిలా

సిగను పూలు పెట్టుకో శ్రీలక్ష్మిలా

కౌగిలింతలివ్వనా కట్నాలుగా

పరువమంత పరవనా తొలి పాంపుగా

ఎన్నడు రాని ఈ మల్లెల రాతిరి హాయిగా


ఊహుహుహు హుహు ఊహూహుహూ...


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

స్వరములు ఏడైనా రాగాలెన్నో | Swaramulu Yedaina Ragalenno | Song Lyrics | Toorpu Padamara (1976)

స్వరములు ఏడైనా రాగాలెన్నో చిత్రం: తూర్పు పడమర (1976) సంగీతం: రమేశ్ నాయుడు గీతరచయిత: సి.నారాయణరెడ్డి  నేపధ్య గానం: పి.సుశీల  పల్లవి: స్వరములు...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు