RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

30, జూన్ 2025, సోమవారం

ఏమని పాడను | Yemani Paadanu | Song Lyrics | Seetharama Kalyanam (1986)

ఏమని పాడను



చిత్రం  :  సీతారామకళ్యాణం (1986)

సంగీతం  :  కె.వి. మహదేవన్

గీతరచయిత  :  వేటూరి

నేపధ్య గానం  :  బాలు, సుశీల 


పల్లవి :


ఏమని పాడను..

ఏమని పాడను 

రెండు మనసుల మూగ గీతం

ఏదని చెప్పను...

ఏదని చెప్పను 

నాలుగు పెదవుల ఏక తాళం


అది చెబుతున్నప్పుడు... 

లయ పుడుతున్నప్పుడు...

నా గుండెల్లో చప్పుడే ప్రేమా

నీ పెదవుల్లో చప్పుడే ముద్దు


ఏమని పాడను 

రెండు మనసుల మూగ గీతం

ఏదని చెప్పను 

నాలుగు పెదవుల ఏక తాళం


అది చెబుతున్నప్పుడు... 

లయ పుడుతున్నప్పుడు...

నా గుండెల్లో చప్పుడే ప్రేమా

నీ పెదవుల్లో చప్పుడే ముద్దు


చరణం 1 :


వయసొచ్చిన మర్నాడే... 

మనసిస్తుంది

మనసిచ్చీ ఇవ్వగానే 

కథమౌదలౌతుంది

వయసొచ్చిన మర్నాడే... 

మనసిస్తుంది

మనసిచ్చీ ఇవ్వగానే 

కథమౌదలౌతుంది 


నిదరన్నది కంటికి రాకా.. 

కుదురన్నది వంటికి లేకా

నిదరన్నది కంటికి రాకా.. 

కుదురన్నది వంటికి లేకా


ఆకలిగా.. దాహంగా... 

కౌగిలిగా.. మోహంగా

బ్రతుకు పంతమై.. 

బతిమాలుకునే నమస్కార బాణమ్

అదే.. మొదటి చుంబనమ్ 


ఏమని పాడను 

రెండు మనసుల మూగ గీతం

ఏదని చెప్పను 

నాలుగు పెదవుల ఏక తాళం


అది చెబుతున్నప్పుడు... 

లయ పుడుతున్నప్పుడు...

నా గుండెల్లో చప్పుడే ప్రేమా

నీ పెదవుల్లో చప్పుడే ముద్దు


చరణం 2 :


తొలి చూపే వలపులకు శ్రీకారం

కలవరింతలయ్యే ఒక కమ్మని రాగం

తొలి చూపే వలపులకు శ్రీకారం

కలవరింతలయ్యే ఒక కమ్మని రాగం


నడిరాతిరి ముగ్గులు పెట్టి...

తెలవారని పొద్దులు దాటి

నడిరాతిరి ముగ్గులు పెట్టి...

తెలవారని పొద్దులు దాటి


ఎండనకా.. వాననకా.. 

రేయనకా.. పగలనకా

పులకరింతగా పలకరించినా 

మల్లెపూల బాణమ్

అదే....  వలపు వందనం


ఏమని పాడను 

రెండు మనసుల మూగ గీతం

ఏదని చెప్పను 

నాలుగు పెదవుల ఏక తాళం


అది చెబుతున్నప్పుడు... 

లయ పుడుతున్నప్పుడు...

నా గుండెల్లో చప్పుడే ప్రేమా

నీ పెదవుల్లో చప్పుడే ముద్దు


ఏమని పాడను... ఏదని చెప్పను

ఊమ్మ్..ఊమ్మ్మ్


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమొకో ఏమొకో చిగురు టధరమున | Emako Chigurutadharamuna | Song Lyrics | Annamayya (1997)

ఏమొకో ఏమొకో చిగురు టధరమున చిత్రం : అన్నమయ్య (1997) సంగీతం : ఎం ఎం కీరవాణి  రచన : అన్నమాచార్య  గానం : బాలు,  సాకి : గోవిందా నిశ్చలాలందా  మందా...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు