RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
kalasi padudam telugu paata లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
kalasi padudam telugu paata లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, ఏప్రిల్ 2026, గురువారం

కలసి పాడుదాం తెలుగు పాట | Kalasi Paadudam | Song Lyrics | Balipeetam (1975)

కలసి పాడుదాం తెలుగు పాట 


చిత్రం :  బలిపీఠం (1975)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  శ్రీశ్రీ

నేపధ్య గానం :  ఎస్ పి బాలు


పల్లవి :


కలసి పాడుదాం తెలుగు పాట.. 

కదలి సాగుదాం వెలుగుబాట

తెలుగువారు నవజీవన నిర్మాతలనీ.. 

తెలుగుజాతి సకలావనికే జ్యోతియనీ


కలసి పాడుదాం తెలుగు పాట.. 

కదలి సాగుదాం వెలుగుబాట


చరణం 1 :


కార్యశూరుడు వీరేశలింగం  

కలంపట్టి పోరాడిన సింగం

దురాచారాల దురాగతాలను 

తుదముట్టి౦చిన అగ్నితరంగం

అడుగో.. అతడే.. వీరేశలింగం     


మగవాడెంతటి ముసలాడైనా 

మళ్ళీ పెళ్ళికి అర్హత వుంటే

బ్రతుకే తెలియని బాల  వితంతువు

కెందుకు లేదా హక్క౦టాను 


చేతికి గాజులు తొడిగాడు 

చెదిరిన తిలకం దిద్దాడు.....

మోడు వారిన ఆడబ్రతుకుల 

పసుపూ కుంకుమ నిలిపాడు.. 

నిలిపాడు


కలసి పాడుదాం తెలుగు పాట...  

కదలి సాగుదాం వెలుగుబాట


చరణం 2 :


అడుగో.. అతడే.. గురజాడ

మంచిచెడ్డలు లోకమ౦దున 

ఎంచి చూడగా రెండే కులములు

మంచిచెడ్డలు లోకమ౦దున 

ఎంచి చూడగా రెండే కులములు

మంచియన్నది మాలయైతే... 

మాల నేనౌతాను.. 

మాల నేనౌతాను అన్నాడు.....


కలసి పాడుదాం తెలుగు పాట.. 

కదలి సాగుదాం వెలుగుబాట

తెలుగువారు నవజీవన నిర్మాతలనీ...  

తెలుగుజాతి సకలావనికే జ్యోతియనీ

కలసి పాడుదాం తెలుగు పాట... 

కదలి సాగుదాం వెలుగుబాట 


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

చుక్కల్లారా చూపుల్లారా | Chukkallara Chupullara | Song Lyrics | Apadbhandavudu (1992)

చుక్కల్లారా చూపుల్లారా   చిత్రం: ఆపద్బాంధవుడు (1992) సంగీతం:  ఎ మ్.  ఎ మ్. కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్ పి బాలు, చిత్ర,  పల్లవి :...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు