RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
mani ratnam songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
mani ratnam songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, అక్టోబర్ 2024, బుధవారం

ఏదో తెలియని బంధమిది | Edo Teliyani Bandhamidi | Song Lyrics | Nayakudu (1987)

ఏదో తెలియని బంధమిది



చిత్రం: నాయకుడు (1987)

సంగీతం: ఇళయరాజా 

నేపధ్య గానం: బాలు, ఎస్. పి. శైలజ  

గీతరచయిత : వేటూరి సుందరరామమూర్తి 


పల్లవి :


ఏదో తెలియని బంధమిది

ఏదో తెలియని బంధమిది

ఎదలో ఒదిగే రాగమిది..ఈ..ఈ..

ఏదో తెలియని బంధమిది

ఎదలో ఒదిగే రాగమిది..ఈ..ఈ..

ఏదో తెలియని బంధమిది


చరణం 1 :


పూజకు నోచని పువ్వును కోరి

వలచిన స్వామివి నువ్వేలే...

రూపం లేని అనురాగానికి

ఊపిరి నీ చిరు నవ్వేలే...

కోవెల లేనీ....

కోవెల లేని దేవుడవు...

గుండెల గుడిలో వెలిశావు...ఊ..

పలికే జీవన సంగీతానికి

వలపుల స్వరమై ఒదిగావు...

తనువూ మనసూ ఇక నీవే... 


ఏదో తెలియని బంధమిది 

ఏదో తెలియని బంధమిది

ఎదలో ఒదిగే రాగమిది..ఈ..ఈ..

ఏదో తెలియని బంధమిది


చరణం 2:


వేసవి దారుల వేసటిలోన

వెన్నెల తోడై కలిశావు...

పూచే మల్లెల తీగకు నేడు

పందిరి నీవై నిలిచావు...

ఆశలు రాలే...ఏ..ఏ

ఆశలు రాలే శిశిరంలో...ఓ..

ఆమని నీవై వెలిశావు...ఊ..

ఆలుమగల అద్వైతానికి

అర్థం నీవై నిలిచావు...

తనువూ మనసూ ఇక నీవే...ఏ..ఏ


ఏదో తెలియని బంధమిది

ఏదో తెలియని బంధమిది

ఎదలో ఒదిగే రాగమిది..ఈ..ఈ..

ఏదో తెలియని బంధమిది హా..ఆ


- పాటల ధనుస్సు 

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు