ఏదో తెలియని బంధమిది
చిత్రం: నాయకుడు (1987)
సంగీతం: ఇళయరాజా
నేపధ్య గానం: బాలు, ఎస్. పి. శైలజ
గీతరచయిత : వేటూరి సుందరరామమూర్తి
పల్లవి :
ఏదో తెలియని బంధమిది
ఏదో తెలియని బంధమిది
ఎదలో ఒదిగే రాగమిది..ఈ..ఈ..
ఏదో తెలియని బంధమిది
ఎదలో ఒదిగే రాగమిది..ఈ..ఈ..
ఏదో తెలియని బంధమిది
చరణం 1 :
పూజకు నోచని పువ్వును కోరి
వలచిన స్వామివి నువ్వేలే...
రూపం లేని అనురాగానికి
ఊపిరి నీ చిరు నవ్వేలే...
కోవెల లేనీ....
కోవెల లేని దేవుడవు...
గుండెల గుడిలో వెలిశావు...ఊ..
పలికే జీవన సంగీతానికి
వలపుల స్వరమై ఒదిగావు...
తనువూ మనసూ ఇక నీవే...
ఏదో తెలియని బంధమిది
ఏదో తెలియని బంధమిది
ఎదలో ఒదిగే రాగమిది..ఈ..ఈ..
ఏదో తెలియని బంధమిది
చరణం 2:
వేసవి దారుల వేసటిలోన
వెన్నెల తోడై కలిశావు...
పూచే మల్లెల తీగకు నేడు
పందిరి నీవై నిలిచావు...
ఆశలు రాలే...ఏ..ఏ
ఆశలు రాలే శిశిరంలో...ఓ..
ఆమని నీవై వెలిశావు...ఊ..
ఆలుమగల అద్వైతానికి
అర్థం నీవై నిలిచావు...
తనువూ మనసూ ఇక నీవే...ఏ..ఏ
ఏదో తెలియని బంధమిది
ఏదో తెలియని బంధమిది
ఎదలో ఒదిగే రాగమిది..ఈ..ఈ..
ఏదో తెలియని బంధమిది హా..ఆ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి