కొండ కోనలలోన కొలువైన స్వామీ
రచన : రామకృష్ణ దువ్వు
కొండ కోనలలోన
కొలువైన స్వామీ
నిండు మనసుతోటి
నిను చేరినాము
గండముల పారద్రోలి
మము బ్రోవుమయ్య
చండ ప్రచండ
తేజోమయ
శ్రీ లక్ష్మి
నారసింహా
శ్రీ లక్ష్మి
నారసింహా
కొండ కోనలలోన
కొలువైన స్వామీ
నిండు మనసుతోటి
నిను చేరినాము
గండముల పారద్రోలి
మము బ్రోవుమయ్య
చండ ప్రచండ
తేజోమయ
శ్రీ లక్ష్మి
నారసింహా
శ్రీ లక్ష్మి
నారసింహా
చరణం 1:
రూపమున నిను చూడ
భీకరాకారా
మనమున కాంచిన
కరుణామూర్తీ
రూపమున నిను చూడ
భీకరాకారా
మనమున కాంచిన
కరుణామూర్తీ
ప్రతికూల
స్తితులెన్నో
పగబట్టి నాయీ
ఉగ్ర ప్రఛండాగ్ని
జ్వాలల
భష్మీకరించీ
అకాల మృత్యువుల
నుండి
కాపాడు స్వామీ
ప్రతికూల
స్తితులెన్నో
పగబట్టి నాయీ
ఉగ్ర ప్రఛండాగ్ని
జ్వాలల
భష్మీకరించీ
అకాల మృత్యువుల
నుండి
కాపాడు స్వామీ
కొండ కోనలలోన
కొలువైన స్వామీ
నిండు మనసుతోటి
నిను చేరినాము
గండముల పారద్రోలి
మము బ్రోవుమయ్య
చండ ప్రచండ
తేజోమయ
శ్రీ లక్ష్మి
నారసింహా
శ్రీ లక్ష్మి
నారసింహా
చరణం 2 :
దివిలోన భువిలోన
అణువణువు లోనా
నీవు కలవంటు
ప్రహ్లాదు పలుకగా
దివిలోన భువిలోన
అణువణువు లోనా
నీవు కలవంటు
ప్రహ్లాదు పలుకగా
ద్వార పాలకుని
శాపముపహరింపగా
స్థంబమున
కనిపించె
ఉగ్ర రూపముగా
పాపాలు హరియించి
కరుణించు స్వామీ
ద్వార పాలకుని
శాపముపహరింపగా
స్థంబమున
కనిపించె
ఉగ్ర రూపముగా
పాపాలు హరియించి
కరుణించు స్వామీ
కొండ కోనలలోన
కొలువైన స్వామీ
నిండు మనసుతోటి
నిను చేరినాము
గండముల పారద్రోలి
మము బ్రోవుమయ్య
చండ ప్రచండ
తేజోమయ
శ్రీ లక్ష్మి
నారసింహా
శ్రీ లక్ష్మి
నారసింహా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి