RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

14, అక్టోబర్ 2024, సోమవారం

జలకాలాటలలో కలకల పాటలలో | Jalakalatalalo | Song Lyrics | Jagadekaveeruni Katha (1961)

జలకాలాటలలో కలకల పాటలలో



చిత్రం : జగదేకవీరుని కథ (1961)

సంగీతం : పెండ్యాల

గీతరచయిత : పింగళి నాగేంద్రరావు

నేపధ్య గానం : పి.లీల, సుశీల


పల్లవి :


జలకాలాటలలో కలకల పాటలలో

యేమి హాయిలే హలా... 

అహ యేమి హాయిలే హలా


జలకాలాటలలో కలకల పాటలలో

యేమి హాయిలే హలా... 

అహ యేమి హాయిలే హలా


ల ల లా ల లా..లలలాలాల లా లా లలా


చరణం 1 :


ఉన్నది పగలైనా, 

అహ వెన్నెల కురిసేనే

ఒహొహోహోహొ ఓహో..


ఉన్నది పగలైనా.. 

అహ వెన్నెల కురిసేనే

అహ వన్నె చిన్నెలా కన్నె మనసులో 

సన్న వలపు విరిసే

అహ వన్నె చిన్నెలా కన్నె మనసులో 

సన్న వలపు విరిసే


జలకాలాటలలో కలకల పాటలలో

యేమి హాయిలే హలా... 

అహ యేమి హాయిలే హలా


చరణం 2 :


తీయని రాగమేదో 

మది హాయిగ పాడేనే

అహహహ అహహ అహహ..అహహ


తీయని రాగమేదో 

మది హాయిగ పాడేనే

తరుణ కాలమేలే 

అది వరుని కొరకు పిలుపే

తరుణ కాలమేలే 

అది వరుని కొరకు పిలుపే

అది వరుని కొరకు పిలుపే..


జలకాలాటలలో కలకల పాటలలో

యేమి హాయిలే హలా... 

అహ యేమి హాయిలే హలా


- పాటల ధనుస్సు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు