RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

21, అక్టోబర్ 2024, సోమవారం

గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి | Gilli kajjalu techukone | Song Lyrics | Atma Balam (1964)

గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి



చిత్రం: ఆత్మబలం (1964) 

సంగీతం: కె.వి. మహదేవన్ 

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ 

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల 


పల్లవి: 


గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి 

నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి 

గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి 

నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయీ 


బుల్లి కారున్న షోకిల అబ్బాయి 

నీ పోజుల్లో ఉన్నది భలే బడాయ 

బుల్లి కారున్న షోకిల అబ్బాయి 

నీ పోజుల్లో ఉన్నది భలే బడాయి 


చరణం 1: 


వయసు తోటి దోరదోర 

సొగసులొస్తాయి 

సొగసులతో ఓరఓర 

చూపులొస్తాయ 


వయసు తోటి దోరదోర 

సొగసులొస్తాయి 

సొగసులతో ఓరఓర 

చూపులొస్తాయి 

చూపులతో లేని పోని 

గీరలొస్తాయి 

ఆ గీరలన్ని జారిపోవు 

రోజులొస్తాయి 


బుల్లి కారున్న షోకిలా అబ్బాయి 

నీ పోజుల్లో ఉన్నది భలే బడాయి 


కుర్రకారు కోరికలు 

గుర్రాలవంటివి 

కళ్ళాలు వదిలితే 

కదం తొక్కుతాయి 


కుర్రకారు కోరికలు 

గుర్రాలవంటివి 

కళ్ళాలు వదిలితే 

కదం తొక్కుతాయి 


పట్టు తప్పినంతనే 

పరువే తీస్తాయి 

ఒళ్ళు దగ్గరుంచుకుంటే 

మంచిదబ్బాయీ... 

ఈ... ఈ... ఈ... 


గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి 

నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి 


చరణం 2: 


మొదట మొదట కళ్ళతోటి 

మొదలుపెట్టి లడాయి 

హృదయమంత పాకుతుంది 

హుషారైన హాయి 


మొదట మొదట కళ్ళతోటి 

మొదలుపెట్టి లడాయి 

హృదయమంత పాకుతుంది 

హుషారైన హాయి 

కలకాలం ఉండదు 

ఈ పడుచు బడాయి 

తొలినాడే చల్లబడి 

పోవునమ్మాయి 


బుల్లి కారున్న షోకిలా అబ్బాయి 

నీ పోజుల్లో ఉన్నది భలే బడాయి 


కళ్ళు చూసి మోసపోయి 

కలవరించకు 

ఓరచూపు కోరచూపు 

ఒకటనుకోకు 


కళ్ళు చూసి మోసపోయి 

కలవరించకు 

ఓరచూపు కోరచూపు 

ఒకటనుకోకు 


ఇస్తేను హృదయమెంతో 

మెత్తనైనది 

ఎదురుతిరిగితే అదే 

కత్తి వంటిదీ... ఈ... 


గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి 

నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి 

బుల్లి కారున్న షోకిలా అబ్బాయి 

నీ పోజుల్లో ఉన్నది భలే బడాయి


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమొకో ఏమొకో చిగురు టధరమున | Emako Chigurutadharamuna | Song Lyrics | Annamayya (1997)

ఏమొకో ఏమొకో చిగురు టధరమున చిత్రం : అన్నమయ్య (1997) సంగీతం : ఎం ఎం కీరవాణి  రచన : అన్నమాచార్య  గానం : బాలు,  సాకి : గోవిందా నిశ్చలాలందా  మందా...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు