మౌనంగానే ఎదగమనీ
చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)
సంగీతం: కీరవాణి
గీతరచయిత: చంద్రబోస్
నేపధ్య గానం: చిత్ర
పల్లవి:
మౌనంగానే ఎదగమనీ
మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనీ
అర్ధమందులో ఉంది
మౌనంగానే ఎదగమనీ
మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనీ
అర్ధమందులో ఉంది
అపజయాలు కలిగినచోటే
గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే
కొత్త చిగురు కనిపిస్తుంది
మౌనంగానే ఎదగమనీ
మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనీ
అర్ధమందులో ఉంది
అపజయాలు కలిగినచోటే
గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే
కొత్త చిగురు కనిపిస్తుంది
చరణం 1:
దూరమెంతో ఉందనీ
దిగులుపడకు నేస్తమా
దరికి చేర్చు దారులు కూడా
ఉన్నాయి గా
భారమెంతో ఉందనీ
బాధపడకు నేస్తమా
బాధ వెంట నవ్వులపంట
ఉంటుంది గా
సాగరమధనం మొదలవగానే
విషమే వచ్చింది
విసుగే చెందక కృషి చేస్తేనే
అమృతమిచ్చిందీ
అవరోధాల దీవుల్లో
ఆనంద నిధి ఉన్నదీ
కష్టాల వారధి దాటినవారికి
సొంతమవుతుందీ
తెలుసుకుంటె సత్యమిదీ
తలుచుకుంటె సాధ్యమిదీ
మౌనంగానే ఎదగమనీ
మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనే
అర్ధమందులో ఉంది
చరణం 2:
చెమట నీరు చిందగా
నుదుటి రాత మార్చుకో
మార్చలేనిదేదీ లేదని
గుర్తుంచుకో
పిడికిలే బిగించగా
చేతిగీత మార్చుకో
మారిపోని కధలే లేవని
గమనించుకో
తోచినట్టుగా అందరి రాతను
బ్రహ్మే రాస్తాడూ
నచ్చినట్టు గా నీతలరాతని
నువ్వే రాయాలీ
నీ ధైర్యాన్ని దర్షించి
దైవాలే తలదించగా
నీ అడుగుల్లో గుడి కట్టి
స్వర్గాలే తరియించగా
నీ సంకల్పానికి ఆ విధి సైతం
చేతులెత్తాలీ
అంతులేని చరితలకీ
ఆది నువ్వు కావాలీ
మౌనంగానే ఎదగమనీ
మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనే
అర్ధమందులో ఉంది
అపజయాలు కలిగినచోటే
గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే
కొత్త చిగురు కనిపిస్తుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి