గామ గామ హంగామా
చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)
సంగీతం: కీరవాణి
గీతరచయిత: చంద్రబోస్
నేపధ్య గానం: బాలు, శ్రీవర్ధిని
పల్లవి:
గామ గామ హంగామా
మనమే హాయి చిరునామా
పాత బాధ గదినీ ఖాళీ చేద్దామా
గామ గామ హంగామా
కష్టం ఖర్చు పెడదామా
కొత్త సంతోషం జమ చేద్దామా
రప రప్పప్పారప్పారపా
రప రప్పప్పారప్పా
రప రప్పప్ప రర రప్పప్పా
రర పారపరపా
గామ గామ హంగామా
మనమే హాయి చిరునామా
పాత బాధ గదినీ ఖాళీ చేద్దామా
గామ గామ హంగామా
కష్టం ఖర్చు పెడదామా
కొత్త సంతోషం జమ చేద్దామా
రప రప్పప్పారప్పారపా
రప రప్పప్పారప్పా
రప రప్పప్ప రర రప్పప్పా
రర పారపరపా
చరణం 1:
నీ రాకతో రాయిలాంటి
నా జీవితానికే జీవం వచ్చిందీ
నీ చూపుతో జీవం వచ్చిన రాయే
చక్కని శిల్పం అయ్యిందీ
చేయూతతో శిల్పం కాస్తా
నడకలు నేర్చీ కోవెల చేరిందీ
నీ నవ్వుతో కోవెల చేరిన
శిల్పంలోన కోరిక కలిగింది
ఆ కోరికేమిటో చెప్పని
నను వీడి నువ్వు వెళ్ళొద్దని
మళ్ళీ రాయిని చెయ్యొద్దనీ
రప రప్పప్పారప్పారపా
రప రప్పప్పారప్పా
రప రప్పప్ప రర రప్పప్పా
రర పారపరపా
గామ గామ హంగామా
మనమే హాయి చిరునామా
పాత బాధ గదినీ ఖాళీ చేద్దామా
చరణం 2:
నీ మాటతో నాపై నాకే ఏదో
తెలియని నమ్మకమొచ్చిందీ
నీ స్పూర్తితో ఎంతో ఎంతో
సాధించాలని తపనే పెరిగిందీ
నీ చెలిమితో ఊహల్లోన
ఊరిస్తున్న గెలుపే అందిందీ
ఆ గెలుపుతో నిస్పృహలోన
నిదురిస్తున్న మనసే మురిసిందీ
ఆ మనసు అలిసిపోరాదని
ఈ చెలిమి నిలిచిపోవాలని
ఇలా బ్రతుకును గెలవాలనీ
రప రప్పప్పారప్పారపా
రప రప్పప్పారప్పా
రప రప్పప్ప రర రప్పప్పా
రర పారపరపా
గామ గామ హంగామా
మనమే హాయి చిరునామా
పాత బాధ గదినీ ఖాళీ చేద్దామా
గామ గామ హంగామా
కష్టం ఖర్చు పెడదామా
కొత్త సంతోషం జమ చేద్దామా
రప రప్పప్పారప్పారపా
రప రప్పప్పారప్పా
రప రప్పప్ప రర రప్పప్పా
రర పారపరపా
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి