RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

18, అక్టోబర్ 2024, శుక్రవారం

పరుగులు తీసే నీ వయసునకూ | Parugulu teese nee vayasunaku | Song Lyrics | Atma Balam (1964)

పరుగులు తీసే నీ వయసునకూ



చిత్రం: ఆత్మబలం (1964)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల



పల్లవి:


ఓహో హొహూఎఓ హో...

పరుగులు తీసే నీ వయసునకూ 

పగ్గం వేసెను నా మనసూ


పరుగులు తీసే నీ వయసునకు 

పగ్గం వేసెను నా మనసు

ఉరకలు వేసే నా మనసునకు 

ఉసిగొలిపెనులే నీ సొగసు 

అహాహహ


పరుగులు తీసే నీ వయసునకు 

పగ్గం వేసెను నా మనసు

ఉరకలు వేసే నా మనసునకు 

ఉసిగొలిపెనులే నీ సొగసు 

అహాహహ

పరుగులు తీసే నీ వయసునకు 

పగ్గం వేసెను నా మనసు

చరణం 1:


ఓయని పిలిచే నా పిలుపునకు 

ఓయని పలికెను నీ వలపు

ఓహోయని పలికెను నీ వలపు

ఓయని పిలిచే నా పిలుపునకు 

ఓయని పలికెను నీ వలపు

ఓహోయని పలికెను నీ వలపు

ఓయని పలికే నీ వలపునకు 

తీయగ మారెను నా తలపు

తియతీయగ మారెను నా తలపు 

ఒహొహొహొ హొహొహొ

పరుగులు తీసే నీ వయసునకు 

పగ్గం వేసెను నా మనసు


చరణం 2:


తొణకని బెణకని నీ బిగువులతో 

దోబూచాడెను నా నగవూ

అహ దోబూచాడెను నా నగవూ

దోబూచాడే నా నగవులలో 

దోరగ పండెను నీ మరులు

దోరదోరగ పండెను నీ మరులూ

ఒహొహొహొ హొహొహొ

పరుగులు తీసే నీ వయసునకు 

పగ్గం వేసెను నా మనసు


చరణం 3:


లేదనిపించే నీ నడుము 

అహహా 

నాదనిపించెను ఈ క్షణము 

ఒహో

లేదనిపించె నీ నడుము 

నాదనిపించెను ఈ క్షణము

ఉందో లేదో ఈ జగము

ఉందువు నీవు నాలో సగము

ఇది నిజము కాదనుము

పరుగులు తీసే నీ వయసునకు 

పగ్గం వేసెను నా మనసు

ఉరకలు వేసే నా మనసునకు 

ఉసిగొలిపెనులే నీ సొగసు 

అహాహహహ

పరుగులు తీసే నీ వయసునకు 

పగ్గం వేసెను నా మనసు



- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు