ఓ సఖి ...ఒహో చెలి
చిత్రం: జగదేకవీరుని కథ (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
గీతరచయిత: పింగళి నాగేంద్రరావు
నేపధ్య గానం: ఘంటసాల
పల్లవి :
ఓ.....దివ్య రమణులారా ...
నేటికి కనికరించినారా ....
కలకాదు కదా సఖులారా...
ఓ సఖి ...ఒహో చెలి ...
ఒహో మదీయ మోహిని
ఓ సఖి... ఒహో చెలి ...
ఒహో మదీయ మోహిని... ఓసఖి
చరణం 1 :
కలలోపల కనిపించి
వలపించిన చెలులోహొ...ఓ...ఓ..
కలలోపల కనిపించి
వలపించిన చెలులోహొ....
కనుల విందు చేసారే
కనుల విందు చేసారిక
ధన్యుడనైతిని నేనహ..
ఓ సఖి... ఒహో చెలి ...
ఒహో మదీయ మోహిని... ఓసఖి
చరణం 2 :
నయగారములొలికించి...
ప్రియరాగము పలికించి
నయగారములొలికించి...
ప్రియరాగము పలికించి
హాయినొసుగు ప్రియలేలే ......
హాయినొసుగు ప్రియలేలే....
మరి మాయలు సిగ్గులు ఏలనే....
ఓ సఖి... ఒహో చెలి ...
ఒహో మదీయ మోహిని... ఓసఖి
చరణం 3 :
కను చూపులు ఒక వైపు...
మనసేమొ నా వైపు
కను చూపులు ఒక వైపు...
మనసేమొ నా వైపు
ఆటలహొ తెలిసెను...ఏ...ఏ...
ఆటలహొ తెలిసెను
చెలగాటము నా కడ చెల్లునె...
ఓ సఖి... ఒహో చెలి ...
ఒహో మదీయ మోహిని...
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి