రారా కనరారా కరుణ మానినారా
చిత్రం: జగదేకవీరుని కథ (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
గీతరచయిత: పింగళి నాగేంద్రరావు
నేపధ్య గానం: ఘంటసాల,
పల్లవి :
రారా కనరారా కరుణ మానినారా
ప్రియతమలారా
రారా కనరారా కరుణ మానినారా
ప్రియతమలారా
చరణం 1 :
నాలో నాలుగు ప్రాణములనగా
నాలో నాలుగు దీపములనగా
నాలో నాలుగు ప్రాణములనగా
నాలో నాలుగు దీపములనగా
కలిసి మెరిసి అలరించిన చెలులే
కలిసి మెలసి అలరించిన చెలులే
నను విడనాడెదరా
రారా కనరారా కరుణ మానినారా
ప్రియతమలారా...రారా
చరణం 2 :
మీ ప్రేమలతో మీ స్నేహముతో
మీ ప్రేమలతో మీ స్నేహముతో
అమరజీవిగా నను చేసితిరే
మీరు లేని నా బ్రతుకేలా
మీరు లేని నా బ్రతుకేలా
మరణమె శరణముగా
రారా కనరా కరుణ మానినారా
ప్రియతమలారా
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి