చీర లేని చిన్నదానా
చిత్రం : వాడే వీడు (1973)
సంగీతం : సత్యం
గీతరచయిత : సి నారాయణ రెడ్డి
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి :
చీర లేని చిన్నదానా.. ఓయబ్బా
చిగురాకు వన్నెదానా
చిక్కావే నా చేతికి.. అమ్మదొంగా
ఎట్టా నిన్నొదిలేది.. సామి రంగా
చీర లేని చిన్నదాన.. ఓయబ్బా
చిగురాకు వన్నెదానా
చిగురాకు వన్నెదానా
హేహె... ఓహో
చరణం 1 :
మంచె కాడ నాటి రాతిరి
వంచెన చేసావే.. మరిచావా
వంచెన చేసావే...
పోతు పోతు నా గుండెల్లో..
దూసుకు పోయావే
కిల్లాడి... దూసుకుపోయావే
ఈ పూట నీ పైట నా చేత చిక్కింది
ఆహ..ఉహు..ఉహు...
ఈ పూట నీ పైట నా చేత చిక్కింది
ఎదురు దెబ్బ తిన్నావే ఎక్కడికెలతావే
చీర లేని చిన్నదానా.. ఓయబ్బా
చిగురాకు వన్నెదానా... ఆ
చిగురాకు వన్నెదానా...
చరణం 2 :
ఉబుకే వయసు ఉసిగొల్పుతుంటే
ఊరుకోగలనా... ఆహ
దాచిన సోగసు దా.. దా అంటుంటే...
తట్టుకోగలనా
నిలువెల్ల నీ వంపులు గిలిగింతలు
పెడుతుంటే
ఆ.. పెడుతుంటే
నిలువెల్ల నీ వంపులు గిలిగింతలు
పెడుతుంటే
ఊపలేకున్నాను... ఓ పిల్లా
హేయ్..
చీర లేని చిన్నదానా... ఓయబ్బా
చిగురాకు వన్నెదానా
చరణం 3 :
కులుకు నడక కొడే నాగు
మెలికెలాగుంది
హేయె... మెలికెలాగుంది... అహ
కలికినడుము కొండవాగు
మలుపులాగుంది... హో..హో..హో...
మలుపులాగుంది
నీ చూపులో ఏదో చురుకుంది...
మెరుపుంది..ఊ
నీ చూపులో ఏదో చురుకుంది...
మెరుపుంది
తడిసిన నీ అందంలో...
లేనిది ఏముంది..ఆహా...హ..హ..
చీర లేని చిన్నదానా.. ఓయబ్బా
చిగురాకు వన్నెదానా
చిక్కావే నా చేతికి.. అమ్మదొంగా
ఎట్టా నిన్నొదిలేది.. సామి రంగా
చీర లేని చిన్నదాన....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి