RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

23, అక్టోబర్ 2024, బుధవారం

ఆడే పాడే పసివాడా | Adepade Pasivada | Song Lyrics | Pelli Kanuka (1960)

ఆడే పాడే పసివాడా



చిత్రం  :  పెళ్లి కానుక (1960)

సంగీతం  :  ఏ.ఎం. రాజ

గీతరచయిత  : చెరువు ఆంజనేయశాస్త్రి

నేపధ్య గానం  :  సుశీల


పల్లవి:


ఆడే పాడే పసివాడా...

ఆడేనోయీ నీ తోడా

ఆనందం పొంగేనోయి దీపావళి

ఇంటింట వెలుగు దీపాల మెరుగు

ఎనలేని వేడుకరా... 

ఎనలేని వేడుకరా...


చరణం : 1


చిరునవ్వు వెన్నెల్లు చిలికేటివాడా

అరుదైన చిరుముద్దు అరువీయరారా

చిరునవ్వు వెన్నెల్లు చిలికేటివాడా

అరుదైన చిరుముద్దు అరువీయరారా


నా మదిలో నీకు నెలవే కలదూ

నా మదిలో నీకు నెలవే కలదూ

బదులే నాకూ నీవీయవలదు

నీపై మేము నిలిపిన ఆశలు

నిజమైన చాలునురా... ఆ.. ఆ..

నిజమైన చాలునురా


చరణం : 2


చిన్నారి జయమంచు మ్రోగే పఠాసు

చిటపటమని పూలు చిమ్మే మతాబు

చిన్నారి జయమంచు మ్రోగే పఠాసు

చిటపటమని పూలు చిమ్మే మతాబు


నీ రూపమే ఇంటి దీపము బాబూ

నీ రూపమే ఇంటి దీపము బాబూ

మాలో పెరిగే మమతవు నీవు

మంచనిపించి మము మురిపించిన

మరివేరే కోరమురా... ఆ.. ఆ..

మరివేరే కోరమురా


ఆడే పాడే పసివాడా...

ఆడేనోయీ నీ తోడా

ఆనందం పొంగేనోయి దీపావళి

ఇంటింట వెలుగు దీపాల మెరుగు

ఎనలేని వేడుకరా... 

ఎనలేని వేడుకరా...


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు