ఆకు చాటున పిందె తడిసె
చిత్రం : ముద్దుల మావయ్య (1989)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : బాలు, జానకి
పల్లవి :
ఆకు చాటున పిందె తడిసెనోయ్ మామ
మారాకువేసి మారాలుచేసే
గారాలు చూడు మామ
నేరాలు చెయ్యి మామ
హోయ్..మామ..మామ..
మామ..మామ..మామ..మామ
మామ..మామ..మామ..
మామ..మామ..మామ
హోయ్...
ఆకు చాటున పిందె తడిసెనా భామ
మారాకులోన మారాలు చేసి గారాలు
దోచుకోనా నేరాలు చేసుకోనా
భామ..భామ..భామ..
మామ..మామ..మామ
చరణం 1 :
పందిరి నువ్వై తీగల్లే అల్లుకుపోనీ
అందాలూరె నీ పాటకు పల్లవి కానీ
వేసిందమ్మా జాబిల్లి వెన్నెల ఓణి
నవ్విందమ్మా నడకల్లో కిన్నెరసాని
అండదండ నువ్వే నాకింకా...
కైదండ లేకా ఉండలేను..
రారా నా వంక
కొండమల్లి పువ్వే నువ్వంట
నా గుండెలోన ఉండిపోతే
అంతే చాలంట
ఆకు చాటున పిందె తడిసెనోయ్ మామ
మారాకువేసి మారాలుచేసే
గారాలు చూడు మామ
నేరాలు చెయ్యి మామ
హోయ్.. మామ..మామ..మామ..
హోయ్..భామ..భామ..భామా..
చరణం 2 :
తళుకుల పుట్ట వచ్చింది తపనల పుట్ట
కులుకుల పిట్ట నచ్చింది వదిలేదెట్ట
అక్కరకొచ్చె అందాల చక్కని చుక్క
చక్కర ముద్దే ఇచ్చింది చెక్కిలి నొక్క
హోయ్..
పట్టరాని పాలపిట్టరో పండంటి ఈడు
ముట్టబోతే ముద్దు పుట్టెరో
పుట్టతేనె పట్టు పెదవిరో ఓ చిట్టి ముద్దు
పెట్టకుంటే ఆగేదెట్టారో
అరె..
ఆకు చాటున పిందె తడిసెనా భామ
మారాకులోన మారాలు చేసి
గారాలు దోచుకోనా
నేరాలు చేసుకోనా
భామ..భామ..భామ..
మామ..మామ..మామ
హోయ్..భామ..భామ..భామ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి