RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

22, అక్టోబర్ 2024, మంగళవారం

నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని | Nuvvante Pranamani | Song Lyrics | Naa Autograph (2004)

నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని



చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)

సంగీతం: కీరవాణి

గీతరచయిత: చంద్రబోస్

నేపధ్య గానం: విజయ్ ఏసుదాస్ 


పల్లవి:


నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని

నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని

ఎవరికీ చెప్పుకొను నాకు తప్ప

కన్నులకి కళలు లేవు నీరు తప్ప


నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని

నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని

ఎవరికీ చెప్పుకొను నాకు తప్ప

కన్నులకి కళలు లేవు నీరు తప్ప


చరణం 1 :


మనసు వుంది మమతా వుంది

పంచుకునే నువ్వు తప్ప

ఊపిరి వుంది ఆయువు వుంది

ఉండాలనే ఆశ తప్ప


ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా

ప్రేమిస్తే సుదీర్ఘ నరకం నిజమేనా


ఎవరిని అడగాలి నన్ను తప్ప

చివరికి ఏమవ్వాలి మన్ను తప్ప


నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని

నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని


చరణం 2 :


వెంటొస్తనన్నావు వెళ్ళొస్తానన్నావు

జంటై ఒకరి పంటైయి వెళ్ళావు

కరుణిస్తానన్నావు వరమిస్తానన్నావు

బరువై మెడకు ఊరివై పోయావు


దేవత లోను ద్రోహం ఉందని తెలిపావు

దీపం కూడా దహి ఇస్తుందని తెలిచావు


ఎవరిని నమ్మాలి నన్ను తప్ప

ఎవరిని నిందించాలి నిన్ను తప్ప


నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని

నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని

ఎవరికీ చెప్పుకొను నాకు తప్ప

కన్నులకి కళలు లేవు నీరు తప్ప


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు