RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
naa autograph sweet memories లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
naa autograph sweet memories లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, అక్టోబర్ 2024, గురువారం

దువ్విన తలనే దువ్వడం | Duvvina Talane Duvvadam | Song Lyrics | Naa Autograph (2004)

దువ్విన తలనే దువ్వడం 



చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)

సంగీతం: కీరవాణి

గీతరచయిత: చంద్రబోస్

నేపధ్య గానం: కీరవాణి, సుమంగళి 


పల్లవి :


దువ్విన తలనే దువ్వడం 

అద్దిన పౌడర్ అద్దడం

దువ్విన తలనే దువ్వడం 

అద్దిన పౌడర్ అద్దడం


అద్దం వదలక పొవడం 

అందానికి మెరుగులు దిద్దడం

నడిచి నడిచి ఆగడం 

ఆగి ఆగి నవ్వడం 

ఉండి ఉండి అరవడం 

తెగ అరిచి చుట్టూ చూడటం 

ఇన్ని మార్పులకు కారణం 

ఏమైవుంటుందోయి


ఇది కాదా l o v e

ఇది కాదా l o v e

ఇది కాదా l o v e

ఇది కాదా l o v e

ఇది కాదా l o v e

ఇది కాదా l o v e

ఇది కాదా l o v e

ఇది కాదా l o v e


చరణం 1 :


ముఖమున మొటిమే రావడం

మనసుకి చెమటే పట్టడం

మతిమరుపెంతో కలగడం 

మతి స్తిమితం పూర్తిగ తప్పడం 

త్వరగా స్నానం చెయ్యడం

త్వర త్వరగా భొంచేస్తుండటం 

త్వరగా కలలోకెళ్ళడం

ఆలస్యం గ నిదరొవడం 

ఇన్నర్ధాలకి ఒకే పదం 

ఏమైవుంటుందోయి


ఇది కాదా l o v e

ఇది కాదా l o v e

ఇది కాదా l o v e

ఇది కాదా l o v e

ఇది కాదా l o v e

ఇది కాదా l o v e

ఇది కాదా l o v e

ఇది కాదా l o v e


- పాటల ధనుస్సు 


22, అక్టోబర్ 2024, మంగళవారం

నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని | Nuvvante Pranamani | Song Lyrics | Naa Autograph (2004)

నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని



చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)

సంగీతం: కీరవాణి

గీతరచయిత: చంద్రబోస్

నేపధ్య గానం: విజయ్ ఏసుదాస్ 


పల్లవి:


నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని

నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని

ఎవరికీ చెప్పుకొను నాకు తప్ప

కన్నులకి కళలు లేవు నీరు తప్ప


నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని

నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని

ఎవరికీ చెప్పుకొను నాకు తప్ప

కన్నులకి కళలు లేవు నీరు తప్ప


చరణం 1 :


మనసు వుంది మమతా వుంది

పంచుకునే నువ్వు తప్ప

ఊపిరి వుంది ఆయువు వుంది

ఉండాలనే ఆశ తప్ప


ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా

ప్రేమిస్తే సుదీర్ఘ నరకం నిజమేనా


ఎవరిని అడగాలి నన్ను తప్ప

చివరికి ఏమవ్వాలి మన్ను తప్ప


నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని

నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని


చరణం 2 :


వెంటొస్తనన్నావు వెళ్ళొస్తానన్నావు

జంటై ఒకరి పంటైయి వెళ్ళావు

కరుణిస్తానన్నావు వరమిస్తానన్నావు

బరువై మెడకు ఊరివై పోయావు


దేవత లోను ద్రోహం ఉందని తెలిపావు

దీపం కూడా దహి ఇస్తుందని తెలిచావు


ఎవరిని నమ్మాలి నన్ను తప్ప

ఎవరిని నిందించాలి నిన్ను తప్ప


నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని

నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని

ఎవరికీ చెప్పుకొను నాకు తప్ప

కన్నులకి కళలు లేవు నీరు తప్ప


- పాటల ధనుస్సు 


మన్మథుడే బ్రహ్మను పూని | Manmadhude Brahmanu pooni | Song Lyrics | Naa Autograph (2004)

మన్మథుడే బ్రహ్మను పూని 



చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)

సంగీతం: కీరవాణి

గీతరచయిత: చంద్రబోస్

నేపధ్య గానం: సందీప్ భౌమిక్, గంగ 


పల్లవి:


మన్మథుడే బ్రహ్మను పూని 

సృష్టించాడేమో గాని

యాభై కేజీ ల మందారాన్నీ

అయిదున్నర అడుగుల బంగారాన్నీ


పలికింది ఆకాశ వాణీ 

ఈ కొమ్మ ని ఎళుకొమ్మనీ


మన్మథుడే బ్రహ్మను పూని 

సృష్టించాడేమో గాని

యాభై కేజీ ల మందారాన్నీ

అయిదున్నర అడుగుల బంగారాన్నీ


చరణం 1 :


దీన్నీ తెలుగులో కారం అంటారు 

మరీ మలయాళంలో

ఇరివు

ఓహో ఇది తీపీ మీ భాషలో

మధురం

మరీ చేదు చేదు చేదు చేదు

కైకు


ఆరె రుచులని అనుకున్నానే 

నిన్నటివరకు నిన్నటివరకు

ఏడో రుచీనే కనుగొన్నానే 

నీ ప్రేమతో


రాజిగాల్లారిందా న్యాంకాండో మిన్నల్ 

వరయేల్ మిన్నల్ వరయేల్

ఇయం రుచియం ఉండిందరినీయం 

నీ ప్రేమతో


నిన్నటీ దాకా నాలుగు దిక్కులు ఈ లోకంలో

ఇన్నుమొదల్ నువ్వే దిక్కు ఎంతో దట్టీల

హే మనసులాయో


నీ పలుకులే కీరవాణీ 

నా పెదవితో తాళమేయ్యనీ


మాధవుడే బ్రహ్మను పూని 

సృష్టించాడేమో గానీ

అరవై కేజీ ల చిలిపితనాన్ని

అలుపన్నది ఎరుగని రవితేజాన్నీ


చరణం 2 :


పెదాల్ని ఏమంటారు చుండు

నడుం నీ ఇడుపు

నా పెదాలతో నీ నడుం మీద 

ఇలా చేస్తే ఏమంటారో

ఆస దోస ఆమెమంద మీశ

ఏయ్ చెప్పమంటుంటే చెప్పనా


రెండో మూడో కావాలమ్మా భూతద్దాలు

ఉందొ లేదో చూడాలంటే నీ నడుముని

వందలకొద్దీ కావాలంట 

జలపాతాలు జలపాతాలు

పెరీగే కొద్దీ తీర్చాలంటే నీ వేడినీ


లెక్కకుమించి జరగాలమ్మా 

మొదటి రాత్రులూ

మక్కువ తీరగా చెయ్యాలంటే 

మధురయాత్రలూ


విన్నాను నీ హృదయవాని 

వెన్నళ్లలో నిను చేరనీ


మన్మథుడే బ్రహ్మను పూని 

సృష్టించాడేమో గాని

అరవై కేజీ ల దుడుకుతనాన్నీ

అలుపన్నది ఎరుగని రవితేజాన్నీ


పలికింది ఆకాశ వాణీ 

ఈ కొమ్మనే ఎళుకొమ్మనీ


- పాటల ధనుస్సు 

గామ గామ హంగామా | Gama Gama Hangama | Song Lyrics | Naa Autograph (2004)

గామ గామ హంగామా



చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)

సంగీతం: కీరవాణి

గీతరచయిత: చంద్రబోస్

నేపధ్య గానం: బాలు, శ్రీవర్ధిని


పల్లవి:


గామ గామ హంగామా

మనమే హాయి చిరునామా

పాత బాధ గదినీ ఖాళీ చేద్దామా

గామ గామ హంగామా

కష్టం ఖర్చు పెడదామా

కొత్త సంతోషం జమ చేద్దామా


రప రప్పప్పారప్పారపా 

రప రప్పప్పారప్పా

రప రప్పప్ప రర రప్పప్పా 

రర పారపరపా


గామ గామ హంగామా

మనమే హాయి చిరునామా

పాత బాధ గదినీ ఖాళీ చేద్దామా


గామ గామ హంగామా

కష్టం ఖర్చు పెడదామా

కొత్త సంతోషం జమ చేద్దామా


రప రప్పప్పారప్పారపా 

రప రప్పప్పారప్పా

రప రప్పప్ప రర రప్పప్పా 

రర పారపరపా


చరణం 1:


నీ రాకతో రాయిలాంటి 

నా జీవితానికే జీవం వచ్చిందీ

నీ చూపుతో జీవం వచ్చిన రాయే 

చక్కని శిల్పం అయ్యిందీ

చేయూతతో శిల్పం కాస్తా 

నడకలు నేర్చీ కోవెల చేరిందీ

నీ నవ్వుతో కోవెల చేరిన 

శిల్పంలోన కోరిక కలిగింది

ఆ కోరికేమిటో చెప్పని

నను వీడి నువ్వు వెళ్ళొద్దని

మళ్ళీ రాయిని చెయ్యొద్దనీ


రప రప్పప్పారప్పారపా 

రప రప్పప్పారప్పా

రప రప్పప్ప రర రప్పప్పా 

రర పారపరపా


గామ గామ హంగామా

మనమే హాయి చిరునామా

పాత బాధ గదినీ ఖాళీ చేద్దామా


చరణం 2:


నీ మాటతో నాపై నాకే ఏదో 

తెలియని నమ్మకమొచ్చిందీ

నీ స్పూర్తితో ఎంతో ఎంతో 

సాధించాలని తపనే పెరిగిందీ

నీ చెలిమితో ఊహల్లోన 

ఊరిస్తున్న గెలుపే అందిందీ

ఆ గెలుపుతో నిస్పృహలోన 

నిదురిస్తున్న మనసే మురిసిందీ

ఆ మనసు అలిసిపోరాదని

ఈ చెలిమి నిలిచిపోవాలని

ఇలా బ్రతుకును గెలవాలనీ


రప రప్పప్పారప్పారపా 

రప రప్పప్పారప్పా

రప రప్పప్ప రర రప్పప్పా 

రర పారపరపా


గామ గామ హంగామా

మనమే హాయి చిరునామా

పాత బాధ గదినీ ఖాళీ చేద్దామా


గామ గామ హంగామా

కష్టం ఖర్చు పెడదామా

కొత్త సంతోషం జమ చేద్దామా


రప రప్పప్పారప్పారపా 

రప రప్పప్పారప్పా

రప రప్పప్ప రర రప్పప్పా 

రర పారపరపా


- పాటల ధనుస్సు 


గుర్తుకొస్తున్నాయి | Gurthukostunnayi | Song Lyrics | Naa Autograph (2004)

గుర్తుకొస్తున్నాయి



చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)

సంగీతం: కీరవాణి

గీతరచయిత: చంద్రబోస్

నేపధ్య గానం: కృష్ణకుమార్ 


పల్లవి:


గుర్తుకొస్తున్నాయి 

గుర్తుకొస్తున్నాయి

ఎదలోతులో ఏమూలనో

నిదురించు జ్ఞాపకాలూ 

నిద్రలేస్తున్నాయి

గుర్తుకొస్తున్నాయి 

గుర్తుకొస్తున్నాయి


ఈగాలిలో ఏమమతలో

మా అమ్మ మాటలాగా 

పలకరిస్తున్నాయి...

గుర్తుకొస్తున్నాయి 

గుర్తుకొస్తున్నాయి


చరణం 1:


మొదట చూసినా 

టూరింగ్ సినిమా

మొదట మొక్కినా 

దేవుని ప్రతిమా


రేగుపళ్ళకై పట్టిన కుస్తీ

రాగిచెంబుతో చేసిన ఇస్త్రీ

కోతికొమ్మలో బెణికిన కాలు

మేకపొదుగులో తాగిన పాలూ

దొంగచాటుగా కాల్చిన బీడీ

సుబ్బుగాడిపై చెప్పిన చాడీ

మోటబావిలో మిత్రుని మరణం

ఏకధాటిగా ఏడ్చిన తరుణం...


గుర్తుకొస్తున్నాయి 

గుర్తుకొస్తున్నాయి


చరణం 2:


మొదటిసారిగా గీసిన మీసం

మొదట వేసినా ద్రౌపది వేషం

నెలపరీక్షలో వచ్చిన సున్నా

గోడకుర్చి వేయించిన నాన్న

పంచుకున్న ఆ పిప్పరమెంటు

పీరు సాయిబూ పూసిన సెంటూ

చెడుగుడాటలో గెలిచిన కప్పు

షావుకారుకెగవేసిన అప్పు


మొదటి ముద్దులో 

తెలియని తనమూ

మొదటి ప్రేమలో 

తియ్యందనమూ...


గుర్తుకొస్తున్నాయి 

గుర్తుకొస్తున్నాయి


ఎదలోతులో ఏమూలనో

నిదురించు జ్ఞాపకాలూ 

నిద్రలేస్తున్నాయి

గుర్తుకొస్తున్నాయి 

గుర్తుకొస్తున్నాయి


- పాటల ధనుస్సు 


మౌనంగానే ఎదగమనీ | Mounamgane Edagamani | Song Lyrics | Naa Autograph (2004)

మౌనంగానే ఎదగమనీ



చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)

సంగీతం: కీరవాణి

గీతరచయిత: చంద్రబోస్

నేపధ్య గానం: చిత్ర


పల్లవి:


మౌనంగానే ఎదగమనీ 

మొక్క నీకు చెబుతుంది

ఎదిగినకొద్దీ ఒదగమనీ 

అర్ధమందులో ఉంది


మౌనంగానే ఎదగమనీ 

మొక్క నీకు చెబుతుంది

ఎదిగినకొద్దీ ఒదగమనీ 

అర్ధమందులో ఉంది


అపజయాలు కలిగినచోటే 

గెలుపు పిలుపు వినిపిస్తుంది

ఆకులన్ని రాలిన చోటే 

కొత్త చిగురు కనిపిస్తుంది


మౌనంగానే ఎదగమనీ 

మొక్క నీకు చెబుతుంది

ఎదిగినకొద్దీ ఒదగమనీ 

అర్ధమందులో ఉంది

అపజయాలు కలిగినచోటే 

గెలుపు పిలుపు వినిపిస్తుంది

ఆకులన్ని రాలిన చోటే 

కొత్త చిగురు కనిపిస్తుంది


చరణం 1:


దూరమెంతో ఉందనీ 

దిగులుపడకు నేస్తమా

దరికి చేర్చు దారులు కూడా 

ఉన్నాయి గా

భారమెంతో ఉందనీ 

బాధపడకు నేస్తమా

బాధ వెంట నవ్వులపంట 

ఉంటుంది గా


సాగరమధనం మొదలవగానే 

విషమే వచ్చింది

విసుగే చెందక కృషి చేస్తేనే 

అమృతమిచ్చిందీ

అవరోధాల దీవుల్లో 

ఆనంద నిధి ఉన్నదీ

కష్టాల వారధి దాటినవారికి 

సొంతమవుతుందీ

తెలుసుకుంటె సత్యమిదీ 

తలుచుకుంటె సాధ్యమిదీ


మౌనంగానే ఎదగమనీ 

మొక్క నీకు చెబుతుంది

ఎదిగినకొద్దీ ఒదగమనే 

అర్ధమందులో ఉంది


చరణం 2:


చెమట నీరు చిందగా 

నుదుటి రాత మార్చుకో

మార్చలేనిదేదీ లేదని 

గుర్తుంచుకో

పిడికిలే బిగించగా 

చేతిగీత మార్చుకో

మారిపోని కధలే లేవని 

గమనించుకో


తోచినట్టుగా అందరి రాతను 

బ్రహ్మే రాస్తాడూ

నచ్చినట్టు గా నీతలరాతని 

నువ్వే రాయాలీ


నీ ధైర్యాన్ని దర్షించి 

దైవాలే తలదించగా

నీ అడుగుల్లో గుడి కట్టి 

స్వర్గాలే తరియించగా

నీ సంకల్పానికి ఆ విధి సైతం 

చేతులెత్తాలీ


అంతులేని చరితలకీ 

ఆది నువ్వు కావాలీ


మౌనంగానే ఎదగమనీ 

మొక్క నీకు చెబుతుంది

ఎదిగినకొద్దీ ఒదగమనే 

అర్ధమందులో ఉంది

అపజయాలు కలిగినచోటే 

గెలుపు పిలుపు వినిపిస్తుంది

ఆకులన్ని రాలిన చోటే 

కొత్త చిగురు కనిపిస్తుంది


- పాటల ధనుస్సు 

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు