RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
p leela songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
p leela songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, సెప్టెంబర్ 2025, గురువారం

గిరిజా కల్యాణం | Girija Kalyanam | Song Lyrics | Rahashyam (1967)

గిరిజా కల్యాణం



చిత్రం :  రహస్యం (1967)

సంగీతం :  ఘంటసాల

గీతరచయిత :  మల్లాది రామకృష్ణ శాస్త్రి

నేపధ్య గానం :  ఘంటసాల,  పి. సుశీల, పి.లీల


పల్లవి :


అంబా పరాకు దేవీ పరాకు

మమ్మేలు మా శారదంబా పరాకు

అంబా పరాకు దేవీ పరాకు

మమ్మేలు మా శారదంబా పరాకు


ఉమా మహేశ్వర ప్రసాద 

లబ్ధ పూర్ణ జీవనా గజాననా..

బహుపరాక్ బహుపరాక్...


చండభుజాయమండల 

దోధూయమాన వైరిగణా.. 

షడాననా

బహుపరాక్ బహుపరాక్..


మంగళాద్రి నారసింహ... 

బహుపరాక్ బహుపరాక్...

బంగరు తల్లి కనకదుర్గ.. 

బహుపరాక్ బహుపరాక్..

కృష్ణాతీర కూచెన్నపూడి 

నిలయా గోపాలదేవ.. 

బహుపరాక్...


అవధరించరయ్యా 

విద్యలనాదరించరయ్యా

అవధరించరయ్యా 

విద్యలనాదరించరయ్యా

లలితకళల విలువ తెలియు 

సరసులు పదింపదిగ పరవశులయ్యే

అవధరించరయ్యా 

విద్యల నాదరించరయ్యా


ఈశుని మ్రోల.. హిమగిరి బాల..

ఈశుని మ్రోల.. హిమగిరి బాల..

కన్నెతనము ధన్యమయిన గాథ

కణకణలాడే తామసాన కా

ముని రూపము బాపీ..ఆ కోపీ..

కాకలు తీరీ కను తెరచి తను తెలసీ

తన లలనను పరిణయమాడిన 

ప్రబంధము

అవధరించరయ్యా 

విద్యల నాదరించరయ్యా..


చరణం 1 :


రావో.. రావో.. లోల లోల 

లోలంబాలక రావో....

రావో రావో లోల లోల 

లోలం బాలక రావో

లోకోన్నత మహోన్నతుని 

తనయ మేనాకుమారి

లోకోన్నత మహోన్నతుని 

తనయ మేనాకుమారి

రాజ సులోచన రాజాననా...

రావో రావో లోల లోల 

లోలంబాలక రావో


చెలువారు మోమున లేలేత నగవులా

కలహంస గమనాన కలికీ ఎక్కడికే

మానస సరసినీ మణి పద్మదళముల

రాణించు అల రాజహంస సన్నిధికే


వావిలి పూవుల మాలలు గైసేసి

వావిలి పూవుల మాలలు గైసేసి

వయ్యారి నడల బాలా ఎక్కడికే

వయ్యారి నడల బాలా ఎక్కడికే


కన్నారా నన్నేల కైలాస నిలయాన

కొలువైన అల దేవదేవు సన్నిధికే ....


తగదిది తగదిది తగదిది

ధరణీధర వర సుకుమారీ

తగదిది తగదిది తగదిది

ధరణీధర వర సుకుమారీ.. 

తగదిదీ ..

 

అండగా మదనుడుండగా

మన విరిశరముల పదనుండగా

నిను బోలిన కులపావని తానై

వరు నరయగ బోవలెనా ...

ఆ.....ఆ....ఆ...

తగదిది తగదిది తగదిది

ధరణీధర వర సుకుమారీ..


కోరిన వాడెవడైనా 

ఎంతటి ఘనుడైనా

కోలనేయనా సరసను 

కూలనేయనా

కనుగొనల ననమొనల గాసి చేసి.. 

నీ దాసు చేయనా

తగదిది తగదిది తగదిది

ధరణీధర వర సుకుమారీ.. 

తగదిదీ ..


చరణం 2 :


ఈశుని దాసుని చేతువా... 

అపసద... అపచారము కాదా

ఈశుని దాసుని చేతువా..

కోలల కూలెడు అలసుడు కాడూ... 

ఆదిదేవుడే అతడూ...

సేవలు చేసి ప్రసన్నుని చేయ.. 

నా స్వామి నన్నేలు నోయీ...

నీ సాయమే వలదోయీ...

ఈశుని దాసుని చేతువా..


కాని పనీ మదనా.. 

కాని పని మదనా..

అది నీ చేతకాని పని మదనా...

అహంకరింతువ.. 

హరుని జయింతువ

అహంకరింతువ.. 

హరుని జయింతువ

అది నీ చేతకాని పని మదనా ..... 

కాని పని మదనా...


చిలుక తత్తడి రౌత 

ఎందుకీ హుంకరింతా

చిలుక తత్తడి రౌత 

ఎందుకీ హుంకరింతా

వినకపోతివా ఇంతటితో..

వినకపోతివా ఇంతటితో.. 

నీ విరిశరముల పని సరి..

సింగిణి పని సరి..  

తేజో పని సరి.. చిగురికి 

నీ పని సరి మదనా

కాని పని మదనా....

చిలుక తత్తడి రౌత 

ఎందుకీ హుంకరింతా... 

చిలుక తత్తడి రౌత


సామగ సాగమ సాధారా.. 

శారద నీరద సాకారా

ధీనా ధీనా ధీసారా ... 

సామగ సాగమ సాధారా


ఇవె కైమోడ్పులు ...  

ఇవె సరిజోతలు

వినతులివే అరవిందోజ్వలా... 

ఇదె వకుళాంజలి మహనీయా

ఇదె హృదయాంజలి... 

ఈశా మహేశా

సామగ సాగమ సాధారా.. 

శారద నీరద సాకారా

ధీనా ధీనా ధీసారా ... 

సామగ సాగమ సాధారా


విరులన్ నిను పూజ సేయగా... 

విధిగా నిన్నొక గేస్తు జేయగా

దొరకొన్న రసావతారు 

చిచ్చరకంటన్ 

పరిమార్తువా ప్రభూ...

కరుణన్ గిరిరాజ కన్యకన్ 

సతిగా తాము పరిగ్రహింపగా

మరుడేపున రూపున వర్థిలుగా...

రతి మాంగల్యము 

రక్ష సేయరా ప్రభూ... 

ప్రభూ... పతిభిక్ష ప్రభూ....


అంబాయని అసమశరుడు 

నను పిలిచెను వినవో

జనకుడవై ఆదరణగ 

తనయునిగా జేకొనవో

అంబాయని అసమశరుడు 

నను పిలిచెను వినవో...


మనమే నీ మననమై... 

తనువే నీ ధ్యానమై

నీ భావన లీనమైన 

గిరిబాలనేలవో


శరణం భవ శరణం భవ 

శరణం భవ స్వామీ...

పరిపాలయ పరిపాలయ 

పరిపాలయ మాం స్వామీ..


బిడియపడి భీష్మించి 

పెళ్ళికొడుకైనట్టి 

జగమేలు తండ్రికి.. జయమంగళం

జగమేలు తండ్రికి.. జయమంగళం...


విరులచే వరునిచే కరము 

చేకొనజేయు జగమేలు తల్లికి.. 

జయమంగళం

కూచేన్నపూడి భాగవతుల 

సేవలందే దేవదేవా 

శ్రీ వేణుగోపాల.. మంగళం..

త్రైలోక్య మందార శుభమంగళం...


- పాటల ధనుస్సు 


19, సెప్టెంబర్ 2025, శుక్రవారం

ఏమిటో నీ మాయ | Emito Nee Maya | Song Lyrics | Missamma (1955)

ఏమిటో నీ మాయ


చిత్రం :  మిస్సమ్మ (1955)

సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత :  పింగళి నాగేంద్రరావు 

నేపధ్య గానం :  పి. లీల


పల్లవి:


ఏమిటో నీ మాయ..

ఓ చల్లని రాజా.. వెన్నెల రాజా

ఏమిటో నీ మాయ

ఓ చల్లని రాజా.. వెన్నెల రాజా

ఏమిటో నీ మాయ...


చరణం 1:


వినుటయే కాని వెన్నెల మహిమలు...

వినుటయే కాని వెన్నెల మహిమలు...

అనుభవించి నే నెరుగనయా..

అనుభవించి నే నెరుగనయా..

నీలో వెలసిన కళలూ కాంతులు ..

నీలో వెలసిన కళలూ కాంతులు...

లీలగా ఇపుడే కనిపించెనయా..


ఏమిటో నీ మాయ

ఓ చల్లని రాజా.. వెన్నెల రాజా

ఏమిటో నీ మాయ...


చరణం 2:


కనుల కలికమిది నీ కిరణములే..

కనుల కలికమిది నీ కిరణములే..

మనసును వెన్నగా చేసెనయా..

మనసును వెన్నగా చేసెనయా..

చెలిమి కోరుతూ యేవో పిలుపులు..

చెలిమి కోరుతూ యేవో పిలుపులు..

నాలో నాకే వినిపించెనయా ...


ఏమిటో నీ మాయ

ఓ చల్లని రాజా.. వెన్నెల రాజా

ఏమిటో నీ మాయ...


- పాటల ధనుస్సు 



కరుణించు మేరిమాతా | Karuninchu Meri Matha | Song Lyrics | Missamma (1955)

రుణించు మేరిమాతా



చిత్రం :  మిస్సమ్మ (1955)

సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత :  పింగళి నాగేంద్రరావు

నేపధ్య గానం :  పి. లీల


పల్లవి:


కరుణించు మేరిమాతా..  

శరణింక మేరిమాత

నీవే..  శరణింక మేరిమాత.. 


కరుణించు మేరిమాతా..  

శరణింక మేరిమాత

నీవే..  శరణింక మేరిమాత.. 


చరణం 1:


పరిశుద్ధాత్మ మహిమ.. 

వరపుతృగంటివమ్మ

పరిశుద్ధాత్మ మహిమ.. 

వరపుతృగంటివమ్మ

ప్రభు ఏసునాధుకృపచే 

మా భువికి కలిగే రక్ష..


కరుణించు మేరిమాతా.. 

శరణింక మేరిమాత

నీవే.. శరణింక మేరిమాత


చరణం 2:


గురి లేని దారిచేరి 

పరిహాసమాయే బ్రతుకూ..

గురి లేని దారిచేరి 

పరిహాసమాయే బ్రతుకూ..

క్షణమైన శాంతిలేదే.. 

దినదినము శోధానాయే


కరుణించు మేరిమాతా.. 

శరణింక మేరిమాత

నీవే.. శరణింక మేరిమాత..


- పాటల ధనుస్సు 



తెలుసుకొనవే చెల్లి | Telusukonave Chelli | Song Lyrics | Missamma (1955)

తెలుసుకొనవే చెల్లి



చిత్రం :  మిస్సమ్మ (1955)

సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత :  పింగళి నాగేంద్రరావు 

నేపధ్య గానం :  పి. లీల


పల్లవి:


తెలుసుకొనవే చెల్లి.. 

అలా నడుచుకొనవే చెల్లీ

తెలుసుకొనవే చెల్లి


మగవారికి దూరముగ 

మగువలెపుడు మెలగాలని

మగవారికి దూరముగ 

మగువలెపుడు మెలగాలని

తెలుసుకొనవే చెల్లి.. 

అలా నడుచుకొనవే చెల్లీ

తెలుసుకొనవే చెల్లి


చరణం 1:


మనకు మనమె వారికడకు 

పని ఉన్న పోరాదని ...  ఆ...  ఆ...

మనకు మనమె వారికడకు 

పని ఉన్న పోరాదని

అలుసు చేసి నలుగురిలో 

చులకనగ చూసెదరని

అలుసు చేసి నలుగురిలో 

చులకనగ చూసెదరని


తెలుసుకొనవే చెల్లి... 

అలా నడుచుకొనవే చెల్లీ

తెలుసుకొనవే చెల్లి


చరణం 2:


పదిమాటలకొక మాటయు 

బదులు చెప్పకూడదని ... ఆ... ఆ...

పదిమాటలకొక మాటయు 

బదులు చెప్పకూడదని

లేని పోని అర్థాలను 

మన వెనుకనె చాటెదరని

లేని పోని అర్థాలను 

మన వెనుకనె చాటెదరని


తెలుసుకొనవే చెల్లి... 

అలా నడుచుకొనవే చెల్లీ

తెలుసుకొనవే చెల్లి...


- పాటల ధనుస్సు 


13, సెప్టెంబర్ 2025, శనివారం

శ్రీ జానకీ దేవీ సీమంతమలరే | Sri Janakidevi Seemantham | Song Lyrics | Missamma (1955)

శ్రీ జానకీ దేవీ సీమంతమలరే



చిత్రం :  మిస్సమ్మ (1955)

సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత :  పింగళి నాగేంద్రరావు 

నేపధ్య గానం :  పి. లీల


పల్లవి:


శ్రీ జానకీ దేవీ సీమంతమలరే

మహలక్ష్మి సుందర వదనము గనరే

శ్రీ జానకీ దేవి సీమంతమలరే


చరణం 1:


పన్నీరు గంధాలు సఖి పైన చిలికించి

కానుకలూ కట్నాలు చదివించరమ్మా

పన్నీరు గంధాలు సఖి పైన చిలికించి

కానుకలూ కట్నాలు చదివించరమ్మా


మల్లే మొల్లల తరులు సఖి జడను సవరించీ

ఎల్లా వేడుకలిపుడూ చేయించరమ్మా


శ్రీ జానకీ దేవీ సీమంతమలరే

మహలక్ష్మి సుందర వదనము గనరే

శ్రీ జానకీ దేవి సీమంతమలరే


చరణం 2:


కులుకుచూ కూచున్న కలికిని తిలకించి

అలుక చెందగనీక అలరించరమ్మా

కులుకుచూ కూచున్న కలికిని తిలకించి

అలుక చెందగనీక అలరించరమ్మా


కులమెల్ల దీవించు కొమరూని గనుమంచు

ఎల్లా ముత్తైదువులు దీవించరమ్మా


శ్రీ జానకీ దేవీ సీమంతమలరే

మహలక్ష్మి సుందర వదనము గనరే

శ్రీ జానకీ దేవి సీమంతమలరే


- పాటల ధనుస్సు 


12, మార్చి 2025, బుధవారం

జగధబి రాముడు శ్రీరాముడే | Jagadabhi Ramudu Sriramude | Song Lyrics | LavaKusa (1963)

జగధబి రాముడు శ్రీరాముడే



చిత్రం :  లవకుశ (1963)

సంగీతం :  ఘంటసాల

గీతరచయిత :  సముద్రాల (సీనియర్)

నేపధ్య గానం :  ఘంటసాల, లీల, సుశీల


పల్లవి :


జయ జయ రాం జయ రఘురాం 

జయ జయ రాం జయ రఘురాం


జగధబి రాముడు శ్రీరాముడే.. 

రఘుకుల సోముడు ఆ రాముడే

జగధబి రాముడు శ్రీరాముడే.. 

రఘుకుల సోముడు ఆ రాముడే

జగధబి రాముడు శ్రీరాముడే.. 


జనకుని మాటన తలపై నిలిపి.. 

తన సుఖముల విడి వనితావణి తో 

వనములకేగిన ధర్మావతారుడు.. 

జగధబి రాముడు శ్రీరాముడే 


చరణం 1 :


కరమున ధనువు శరములు దాలిచి.. 

కరమున ధనువు

ఆ ఆ..ఆ..ఆ.... ఆ ఆ..ఆ..ఆ... ఆ ఆ..ఆ..ఆ

కరమున ధనువు శరములు దాలిచి.. 

ఇరువది చేతుల దొరనే కూలిచి

సురలను గాంచిన వీరాధివీరుడు.. 

జగధబి రాముడు శ్రీరాముడే 


చరణం 2 :


ఆలుమగల అనురాగాలకు 

ఆలుమగల అనురాగాలకు

పోలిక సీతారాములే అనగా..  

పొలిక సీతారాములే అనగా

వెలసిన ఆదర్శ ప్రేమావతారుడు.. 

జగధబి రాముడు శ్రీరాముడే


నిరతము ధర్మము నెరపీ నిలిపీ..

ఆ..ఆ..ఆ..ఆ..ఆ

నిరతము ధర్మము నెరపీ నిలిపీ.. 

నరులకు సురలకు తరతరాలకు

ఒరవడి అయినా వర యుగపురుషుడు.. 

జగధబి రాముడు శ్రీరాముడే


చరణం 3 : 


ఇనకులమణి సరితూగే తనయుడు 

అన్నయూ ప్రభువు లేనే లేడని

ఇనకులమణి సరితుగే తనయుడు 

అన్నయూ ప్రభువు లేనే లేడని

జనులు భజించే పురుషోత్తముడు...


జగధబి రాముడు శ్రీరాముడే... 

రఘుకుల సోముడు ఆ రాముడే

జగధబి రాముడు శ్రీరాముడే...

జయ జయ రాం జయ రఘురాం 

జయ జయ రాం జయ రఘురాం


- పాటల ధనుస్సు 


రామ సుగుణధామ | Rama Sugunadhama | Song Lyrics | LavaKusa (1963)

రామ సుగుణధామ



చిత్రం :  లవకుశ (1963)

సంగీతం :  ఘంటసాల

గీతరచయిత :  సముద్రాల (సీనియర్)

నేపధ్య గానం :   లీల, సుశీల


పల్లవి :


రామ సుగుణధామ 

రఘువంశ జలధిసోమా...

శ్రీ రామ సుగుణధామా

సీతామనోభిరామా 

సాకేతసార్వభౌమా

శ్రీ రామ సుగుణధామా 


చరణం 1 :


మందస్మిత సుందర 

వదనారవింద రామా

ఇందీవర శ్యామలాంగ 

వందితసుత్రామా

మందార మరందోపమ 

మధుర మధుర నామా

మందార మరందోపమ 

మధుర మధుర నామా


శ్రీ రామ సుగుణధామా 

రఘువంశ జలధిసోమా...

శ్రీ రామ సుగుణధామా 


చరణం 2 :


అవతారపురుష 

రావణాది దైత్యవి రామా

నవనీత హృదయ 

ధర్మనిరత రాజల రామా

పవమాన తనయ సన్నుత 

పరమాత్మ పరంధామా

పవమాన తనయ సన్నుత 

పరమాత్మ పరంధామా


శ్రీ రామ సుగుణధామ 

రఘువంశ జలధిసోమా

సీతామనోభిరామా... 

సాకేతసార్వభౌమా...

సీతామనోభిరామా...


- పాటల ధనుస్సు 


లేరు కుశలవుల సాటి | Leru Kusalavula Saati | Song Lyrics | LavaKusa (1963)

లేరు కుశలవుల సాటి



చిత్రం :  లవకుశ (1963)

సంగీతం :  ఘంటసాల

గీతరచయిత :  సముద్రాల (సీనియర్)

నేపధ్య గానం :  లీల, సుశీల


పల్లవి :


లేరు కుశలవుల సాటి.. 

సరి వీరులు ధారుణిలో ఓ ఓ ఓ .....

లేరు కుశలవుల సాటి.. 

సరి వీరులు ధారుణిలో ఓ ఓ ఓ ......

లేరు కుశలవుల సాటి .....


తల్లి దీవెన తాతయ్య కరుణ 

వెన్నుకాయగా వెరువగనేలా .....

ఆ ఆ ఆ....ఆ ఆ ఆ... ఆ ఆ ఆ....

తల్లి దీవెన తాతయ్య కరుణ 

వెన్నుకాయగా వెరువగనేలా

హయమును విడువుముగా ... ఆ ఆ ఆ...


లేరు కుశలవుల సాటి .....


చరణం 1 :


బీరములాడి రాముని తమ్ములు 

దురమున మాతో నిలువగలేక .....

బీరములాడి రాముని తమ్ములు 

దురమున మాతో నిలువగలేక

పరువము మాసిరిగా ఆ ఆ ఆ .....

పరువము మాసిరిగా ఆ ఆ ఆ .....

లేరు కుశలవుల సాటి .....


చరణం 2 :


పరాజయమ్మే ఎరుగని రాముని 

రణమున మేమే గెలిచితిమేమి .....

పరాజయమ్మే ఎరుగని రాముని 

రణమున మేమే గెలిచితిమేమి

యశమిక మాదేగా ఆ ఆ ఆ...ఆ ఆ ఆ...

యశమిక మాదేగా ఆ ఆ ఆ ... ఆ ఆ ఆ...

యశమిక మాదేగా.. ఆ ఆ ఆ ఆ... 

ఆ ఆ ఆ ఆ...ఆ ఆ ఆఅ.....ఆ ఆ...


లేరు కుశలవుల సాటి ..... 

సరి వీరులు ధారుణిలో ఓ ఓ ఓ .....

లేరు కుశలవుల సాటి .....


- పాటల ధనుస్సు 

వినుడు వినుడు రామాయణ గాధా | Vinudu Vinudu Ramayanagadha | Song Lyrics | LavaKusa (1963)

వినుడు వినుడు రామాయణ గాధా



చిత్రం :  లవకుశ (1963)

సంగీతం :  ఘంటసాల

గీతరచయిత : సముద్రాల (సీనియర్)

నేపధ్య గానం :  లీల, సుశీల


పల్లవి :


ఓ ఓ ఓ....

వినుడు వినుడు రామాయణ గాధా.. 

వినుడీ మనసారా

వినుడు వినుడు రామాయణ గాధా.. 

వినుడీ మనసారా

ఆలపించినా ఆలకించినా 

ఆనందమొలికించే గాధ


వినుడు వినుడు రామాయణ గాధా.. 

వినుడీ మనసారా


చరణం 1 :


శ్రీరాముని రారాజు సేయగా 

కోరెను దశరధ భూజాని

పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా 

మంగళ వార్త వినీ

ఆ ఆ ఆ ఆ ..... ఆ ఆ ఆ ఆ

పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా 

మంగళ వార్త వినీ

కారు చిచ్చుగా మారెను కైకా 

మందర మాట వినీ.. 

మందర మాట వినీ


వినుడు వినుడు రామాయణ గాధా 

వినుడీ మనసారా


చరణం 2 :


అలుక తెలిసి ఏతెంచిన 

భూపతినడిగెను వరములు ఆ తల్లి

జరుపవలయు పట్టాభిషేకమూ 

భరతుడికీ పృధివీ

మెలగవలయు పదునాలుగేడులూ 

రాముడు కారడవీ

చెలియ మాటకూ ఔను కాదనీ 

పలుకడు భూజానీ

కూలే భువిపైని...


వినుడు వినుడు రామాయణ గాధా 

వినుడీ మనసారా


చరణం 3 :


కౌసలేయు రావించి మహీపతి 

ఆనతి తెలిపెను పినతల్లి

మోసమెరిగి సౌమిత్రి కటారీ 

దూసెను రోసిల్లీ

దోసమనీ వెనుదీసె తమ్మునీ 

రాముడు దయశాలీ

వనవాస దీక్షకూ సెలవు కోరె 

పినతల్లీ పదాల వ్రాలి


ఆ..... ఆ... ఆ... ఆ... 

వెడలినాడు రాఘవుడూ అడవికేగగా

పడతి సీత సౌమిత్రీ తోడు నీడగా

వెడలినాడు రాఘవుడూ అడవికేగగా

పడతి సీత సౌమిత్రీ తోడు నీడగా

గోడుగోడున అయోధ్య ఘొల్లుమన్నదీ

వీడకుమా మనలేనని వేడుకున్నదీ

అడుగులబడి రాఘవా....

అడుగలబడి రాఘవా ఆగమన్నదీ..

ఆగమన్నదీ .. ఆగమన్నదీ

అడలి అడలి కన్నీరై అరయుచున్నదీ


- పాటల ధనుస్సు 


శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా | Sriramuni Charitamunu | Song Lyrics | LavaKusa (1963)

శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా


చిత్రం : లవకుశ (1963)

సంగీతం :  ఘంటసాల

గీతరచయిత :  సముద్రాల (సీనియర్)

నేపధ్య గానం :  లీల, సుశీల


పల్లవి :


ఆ..ఆ..ఆ..


శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా

ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా

శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా

ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా


చెలువుమీర పంచవటి సీమలో

తమ కొలువు సేయ సౌమిత్రీ ప్రేమతో

తన కొలువు తీరె రాఘవుడూ భామతో..


శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా

ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా 


చరణం 1 :


రాముగని ప్రేమగొనే రావణు చెల్లీ

ముకు చెవులు కోసె సౌమిత్రీ రోసిల్లీ

రావణుడామాట విని పంతము పూనీ

మైథిలినీ కొనిపోయే మాయలు పన్నీ


శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా

ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా 


చరణం 2 :


రఘుపతిని రవిసుతునీ 

కలిపెను హనుమా

నృపుజేసెను సుగ్రీవుని 

రామవచన మహిమా

ప్రతి ఉపకృతి చేయుమని 

పలికెను కపులా

హనుమంతుడు లంకజేరి 

వెదకెను నలుదిశలా


శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా

ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా


ఆ... నాథా .... రఘునాథా.... పాహి పాహి...

పాహి అని అశోకవనిని శోకించే సీత

పాహి అని అశోకవనిని శోకించే సీత

దరికి జెని ముద్రికనిడి 

తెలిపె విభుని వార్త


ఆ జనని శిరోమణి అందుకొని పావనీ

ఆ జనని శిరోమణి అందుకొని పావనీ

లంక కాల్చి రాముని కడకేగెను 

రివురివ్వుమని


శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా

ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా  


చరణం 3 :


దశరథసూనుడు లంకను డాసి 

దశకంటు తలను కోసి

దశరధసూనుడు లంకను 

డాసి దశకంటు తలను కోసి

ఆతని తమ్ముని రాజును చేసి 

సీతను తెమ్మని పలికే


చేరవచ్చు ఇల్లాలిని చూసీ 

శీలపరీక్షను కోరె రఘుపతీ

అయోనిజ పైనే అనుమానమా...

ధర్మమూర్తి రామచంద్రుని 

ఇల్లాలికా ఈ పరిక్షా....


పతి ఆనతి తలదాలిచి 

అగ్నిదూకె సీతా

పతి ఆనతి తలదాలిచి 

అగ్నిదూకె సీతా

కుతవాహుడు చల్లబడి 

సాధించెను మాతా

కుతవాహుడు చల్లబడి 

సాధించెను మాతా

సురలు పొగడ ధరణిజతో 

పురికి తరలె రఘునేత


శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా

ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా

ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా..

వినుడోయమ్మా వినుడోయమ్మా.....


శ్రీరాఘవం దశరాథాత్మజ మప్రమేయం

సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం

ఆజానుబాహుం.. అరవింద దళాయతాక్షం

రామం.. నిశాచర వినాశకరం.. నమామీ!!


- పాటల ధనుస్సు 


ఊరకే కన్నీరు నింప | Oorake Kanneru Nimpa | Song Lyrics | LavaKusa (1963)

ఊరకే కన్నీరు నింప



చిత్రం :  లవకుశ (1963)

సంగీతం :  ఘంటసాల

గీతరచయిత :  సదాశివబ్రహ్మం

నేపథ్య గానం :  లీల, సుశీల 


పల్లవి :


ఊరకే కన్నీరు నింప 

కారణమేమమ్మా

ఊరకే కన్నీరు నింప 

కారణమేమమ్మా 

మారడవి విదేమమ్మా 


చరణం 1 : 


శ్రీరాముని మించిన 

నీ వీర కుమారులము మేము

శ్రీరాముని మించిన 

నీ వీర కుమారులము మేము

కోరితే బంగారు కొండ 

కొని తేగలమమ్మా


ఊరకే కన్నీరు నింప 

కారణమేమమ్మా 


చరణం 2 : 


తల్లి చింత తీర్పలేని 

తనయుల బ్రతుకెందుకమ్మా

తల్లి చింత తీర్పలేని 

తనయుల బ్రతుకెందుకమ్మా

వల్లకాదు చెప్పకున్న 

వదలము నీ పాదములా 


ఊరకే కన్నీరు నింప 

కారణమేమమ్మా 

మారాడ విదేమమ్మా

ఊరకే కన్నీరు నింప 

కారణమేమమ్మా 


- పాటల ధనుస్సు 


15, అక్టోబర్ 2024, మంగళవారం

ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మ | Aadilakshmi vanti | Song Lyrics | Jagadekaveeruni Katha (1961)

ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మ 



చిత్రం: జగదేకవీరుని కథ (1961)

సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 

గీతరచయిత: పింగళి నాగేంద్రరావు   

నేపధ్య గానం: పి.లీల, సుశీల,


పల్లవి :


ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మ 

ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మ 


సేవలంది మాకు వరములీయవమ్మ 

సేవలంది మాకు వరములీయవమ్మ 

ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మ 


చరణం 1 :


కలుగునే మీ వంటి సాధ్వి అత్తగా మాకు

తొలి మేము చేసిన పుణ్యమున గాక

మందార మాలతీ పారిజాతాలతో

అందముగ ముడివేసి అలరజేసేము 


ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మ 

ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మ 


సేవలంది మాకు వరములీయవమ్మ 

సేవలంది మాకు వరములీయవమ్మ 

ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మ 


చరణం 2:


మనసు చల్లగ కాగ మంచిగంధము పూసి

మా ముచ్చటలు తీర్ప మనవి చేసేము

పారాణి వెలయించి పాదపూజలు చేసే

కోరికలు తీరునవి పొంగిపోయేము


ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మ 

ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మ 


సేవలంది మాకు వరములీయవమ్మ 

సేవలంది మాకు వరములీయవమ్మ 

ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మ 


- పాటల ధనుస్సు

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు