RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

12, మార్చి 2025, బుధవారం

శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా | Sriramuni Charitamunu | Song Lyrics | LavaKusa (1963)

శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా


చిత్రం : లవకుశ (1963)

సంగీతం :  ఘంటసాల

గీతరచయిత :  సముద్రాల (సీనియర్)

నేపధ్య గానం :  లీల, సుశీల


పల్లవి :


ఆ..ఆ..ఆ..


శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా

ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా

శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా

ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా


చెలువుమీర పంచవటి సీమలో

తమ కొలువు సేయ సౌమిత్రీ ప్రేమతో

తన కొలువు తీరె రాఘవుడూ భామతో..


శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా

ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా 


చరణం 1 :


రాముగని ప్రేమగొనే రావణు చెల్లీ

ముకు చెవులు కోసె సౌమిత్రీ రోసిల్లీ

రావణుడామాట విని పంతము పూనీ

మైథిలినీ కొనిపోయే మాయలు పన్నీ


శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా

ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా 


చరణం 2 :


రఘుపతిని రవిసుతునీ 

కలిపెను హనుమా

నృపుజేసెను సుగ్రీవుని 

రామవచన మహిమా

ప్రతి ఉపకృతి చేయుమని 

పలికెను కపులా

హనుమంతుడు లంకజేరి 

వెదకెను నలుదిశలా


శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా

ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా


ఆ... నాథా .... రఘునాథా.... పాహి పాహి...

పాహి అని అశోకవనిని శోకించే సీత

పాహి అని అశోకవనిని శోకించే సీత

దరికి జెని ముద్రికనిడి 

తెలిపె విభుని వార్త


ఆ జనని శిరోమణి అందుకొని పావనీ

ఆ జనని శిరోమణి అందుకొని పావనీ

లంక కాల్చి రాముని కడకేగెను 

రివురివ్వుమని


శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా

ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా  


చరణం 3 :


దశరథసూనుడు లంకను డాసి 

దశకంటు తలను కోసి

దశరధసూనుడు లంకను 

డాసి దశకంటు తలను కోసి

ఆతని తమ్ముని రాజును చేసి 

సీతను తెమ్మని పలికే


చేరవచ్చు ఇల్లాలిని చూసీ 

శీలపరీక్షను కోరె రఘుపతీ

అయోనిజ పైనే అనుమానమా...

ధర్మమూర్తి రామచంద్రుని 

ఇల్లాలికా ఈ పరిక్షా....


పతి ఆనతి తలదాలిచి 

అగ్నిదూకె సీతా

పతి ఆనతి తలదాలిచి 

అగ్నిదూకె సీతా

కుతవాహుడు చల్లబడి 

సాధించెను మాతా

కుతవాహుడు చల్లబడి 

సాధించెను మాతా

సురలు పొగడ ధరణిజతో 

పురికి తరలె రఘునేత


శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా

ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా

ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా..

వినుడోయమ్మా వినుడోయమ్మా.....


శ్రీరాఘవం దశరాథాత్మజ మప్రమేయం

సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం

ఆజానుబాహుం.. అరవింద దళాయతాక్షం

రామం.. నిశాచర వినాశకరం.. నమామీ!!


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు