RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

13, మార్చి 2025, గురువారం

పతియే ప్రత్యక్షా దైవమే | Pathiye Pratyaksha Daivame | Song Lyrics | Ame Katha (1977)

పతియే ప్రత్యక్షా దైవమే



చిత్రం: ఆమె కథ (1977)

సంగీతం: చక్రవర్తి

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు, ఎస్.జానకి


పల్లవి:


పతియే ప్రత్యక్షా దైవమే... ఏయ్...

పతియే ప్రత్యక్షా దైవమే..

భక్తియుక్తునతో భర్త సేవలకు 

పూలు తెచ్చుకో పూజ చేసుకో...

అబ్బోహో చూత్తాములే ఊఁఊఁ...


సతియే గులహాలచిమిలే... లే..

సతియే గులహాలచిమిలే

తెలివితేటలతో దెబ్బలేతుకొని 

బుద్ధి తెచ్చుకో బాగచూసుకో...

బాగా తూతుకో... ఆఁ..


పతియే గులహాలచిమిలే

ఛీ ఛీ ఛీ... ఛీ

పతియే ప్రత్యక్షా దైవమే..ఏ..

ఛీ ఛీ ఛీ ఛీ...


చరణం 1:


గీసిన గీటు దాటిన 

సీత గతి విన్నావు కదా..

సీత లేక చీలాములు 

పడ్డా తిప్పలు విన్నాలే

మాటకు మాట ఎదురొచ్చావా 

నీ గతి అంతేలే

మాటలొచ్చిన మనిషిని నేనూ 

మట్టిబొమ్మననుకున్నావా..

సంపాయించే మొగాణ్ణి పట్టుకు 

సతాయించకే సుభాషిణీ..

సుభాషిణీ.. సుభాషిణీ..

ఆ.. సుభాషిణీ.. సుభాషిణీ..

సంపాయించం నీకేం తెలుసు 

నిమ్మకాయ పులుసూ...

అఘోరించావ్...

నోలు మూసుకో భీమాండనేయ

నోలు మూసుకో భీమాండనేయ

తెంపరి కూతలు కూసావంటే 

కొంప నుంచి నిను గెంటేస్తా..

తప్పులు కూతలు కూసావంటే 

చెప్పు తీసుకుని తన్నిస్తా


పతియే.. ఆ.. పతియే.. ఆ.. పతియే.. 

పులహాలచిమిలే..

ఇదుగో.. ఇది..ఇది.. ఏవిటే నువ్వు

పతియే.. ఆ.. పతియే.. ఈ.. పతియే.. 

ప్రత్యక్షా దైవమే.. దైవమే.. దైవమే..


చరణం 2:


ఇది ఇల్లా.. వల్లకాడా.. 

కాపురముండే ఇల్లా 

చేపల మార్కెట్టా..

ఏళ్ళు ఒచ్చిన తల్లితండ్రులా.. 

కళ్ళు తెరవని పిల్లకుంకలా..

ఒరేయ్.. వేలెడు లేరు.. 

రాస్కెళ్ళూ.. పెద్దల్నెదిస్తార్రా...

మిమ్మల్ని చీల్చి.. 

ఆ తర్వాత అదేంటి.. 

చండాడేసి పూడ్చిబెట్టడం 

జరగబోతోంది..

హా.. గుర్తులేదా నాన్నా..


ఉన్నూ..

హిరణ్యకశిపుడి కొడుకు 

తండ్రికే ఎదురుతిరగలేదా..

లవకుశులే ఆ రామచంద్రుని 

కళ్ళు తెరవలేదా..

ఇరుగూ పొరుగూ విన్నారంటే 

పురుగుల్లాగా చూస్తారు..

బుద్ధిలేని ఈ పెద్దలవల్లే 

పిల్లాజెల్లా చెడిపోతారు..

తల్లో బళ్ళో పిల్లో దానికి 

చెప్పి చూడరా బుడుగా..

చెప్పి చూడరా బుడుగా.. 

దానికి చెప్పీ చూడరో బుడుగో..


చందా కందా నందా వాళ్ళకు 

సదవులు చెప్పేదెవలూ..

నే కాదు..

ఎల్లి అలగవే పిల్లా పిలుగా

ఎల్లి అలగవే పిల్లా పిలుగా

ఎంత కడిగినా ఎంత ఉతికినా 

ఎలుక తోక నలుపేలే..

ఇకపై కొట్టుకు సచ్చారంటే 

ఇపుడే ఏట్లో దూకేస్తాం..

ఇపుడే ఏట్లో దూకేస్తాం..


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు