RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

12, మార్చి 2025, బుధవారం

వినుడు వినుడు రామాయణ గాధా | Vinudu Vinudu Ramayanagadha | Song Lyrics | LavaKusa (1963)

వినుడు వినుడు రామాయణ గాధా



చిత్రం :  లవకుశ (1963)

సంగీతం :  ఘంటసాల

గీతరచయిత : సముద్రాల (సీనియర్)

నేపధ్య గానం :  లీల, సుశీల


పల్లవి :


ఓ ఓ ఓ....

వినుడు వినుడు రామాయణ గాధా.. 

వినుడీ మనసారా

వినుడు వినుడు రామాయణ గాధా.. 

వినుడీ మనసారా

ఆలపించినా ఆలకించినా 

ఆనందమొలికించే గాధ


వినుడు వినుడు రామాయణ గాధా.. 

వినుడీ మనసారా


చరణం 1 :


శ్రీరాముని రారాజు సేయగా 

కోరెను దశరధ భూజాని

పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా 

మంగళ వార్త వినీ

ఆ ఆ ఆ ఆ ..... ఆ ఆ ఆ ఆ

పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా 

మంగళ వార్త వినీ

కారు చిచ్చుగా మారెను కైకా 

మందర మాట వినీ.. 

మందర మాట వినీ


వినుడు వినుడు రామాయణ గాధా 

వినుడీ మనసారా


చరణం 2 :


అలుక తెలిసి ఏతెంచిన 

భూపతినడిగెను వరములు ఆ తల్లి

జరుపవలయు పట్టాభిషేకమూ 

భరతుడికీ పృధివీ

మెలగవలయు పదునాలుగేడులూ 

రాముడు కారడవీ

చెలియ మాటకూ ఔను కాదనీ 

పలుకడు భూజానీ

కూలే భువిపైని...


వినుడు వినుడు రామాయణ గాధా 

వినుడీ మనసారా


చరణం 3 :


కౌసలేయు రావించి మహీపతి 

ఆనతి తెలిపెను పినతల్లి

మోసమెరిగి సౌమిత్రి కటారీ 

దూసెను రోసిల్లీ

దోసమనీ వెనుదీసె తమ్మునీ 

రాముడు దయశాలీ

వనవాస దీక్షకూ సెలవు కోరె 

పినతల్లీ పదాల వ్రాలి


ఆ..... ఆ... ఆ... ఆ... 

వెడలినాడు రాఘవుడూ అడవికేగగా

పడతి సీత సౌమిత్రీ తోడు నీడగా

వెడలినాడు రాఘవుడూ అడవికేగగా

పడతి సీత సౌమిత్రీ తోడు నీడగా

గోడుగోడున అయోధ్య ఘొల్లుమన్నదీ

వీడకుమా మనలేనని వేడుకున్నదీ

అడుగులబడి రాఘవా....

అడుగలబడి రాఘవా ఆగమన్నదీ..

ఆగమన్నదీ .. ఆగమన్నదీ

అడలి అడలి కన్నీరై అరయుచున్నదీ


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు