RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

18, మార్చి 2025, మంగళవారం

తడిసిన కోరిక తాళం తడుతుంటే | Tadisina Korika | Song Lyrics | Abhimanyudu (1984)

తడిసిన కోరిక తాళం తడుతుంటే



చిత్రం : అభిమన్యుడు (1984)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : బాలు, సుశీల


పల్లవి :


తడిసిన కోరిక తాళం తడుతుంటే...

ముసిరే వయసుకు మువ్వలు కడుతుంటే

రారా చేసిపోరా... శివతాండవం...

హోయ్.. హోయ్.. హోయ్...

రారా చేసిపోరా... శివతాండవం... హాయ్


తడిసిన కోరిక తాళం తడుతుంటే...

ముసిరే వయసుకు మువ్వలు కడుతుంటే

రానా చేసిపోనా... శివతాండవం...

హోయ్.. హోయ్.. హోయ్...

రానా చేసిపోనా... శివతాండవం... హాయ్ 


చరణం 1 :


సరిగంగ స్నానాలు చేసి...ఆహా

తనువెల్ల తాపాలు మోసి... హయ్ హయ్

సరిగంగ స్నానాలు చేసి... 

తనువెల్ల తాపాలు మోసి


తడితడి పైటా..అహా.. 

తాకిన చోట.. ఉడికెక్కిపోతుంటే

తడితడి పైటా..అహా.. 

తాకిన చోట.. ఉడికెక్కిపోతుంటే

అడుగడుగున గంగవెర్రులు 

అలజడి పెడుతుంటే.. శివతాండవం


తడిసిన కోరిక తాళం తడుతుంటే...

ముసిరే వయసుకు మువ్వలు కడుతుంటే

రారా చేసిపోరా... శివతాండవం...

రానా.. హాయ్...  చేసిపోనా... 

శివతాండవం... హాయ్ 


చరణం 2 :


పుడుతోంది గుండెల్లో ఉరుము... 

పడగెత్తి పోతోంది నడుము

పుడుతోంది గుండెల్లో ఉరుము... 

పడగెత్తి పోతోంది నడుము


పిడికిట్లోనా.. అహా.. పిల్లనడుమేమో... 

గిజగిజలాడుతుంటే

పిడికిట్లోనా.. అబా.. పిల్లనడుమేమో... 

గిజగిజలాడుతుంటే

పెదవుల్లు పెను దాహం 

ఉబికిఉబికి వస్తుంటే... శివతాండవం


తడిసిన కోరిక తాళం తడుతుంటే...

ముసిరే వయసుకు మువ్వలు కడుతుంటే

రానా చేసిపోనా... శివతాండవం... హాయ్

హోయ్.. హోయ్.. హోయ్...

రారా చేసిపోరా... శివతాండవం...


శివతాండవం... శివతాండవం

శివతాండవం... శివతాండవం


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు