RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

23, మార్చి 2025, ఆదివారం

కృష్ణమ్మ పెన్నమ్మ పెనవేసుకున్నట్టు | Krishnamma Pennamma | Song Lyrics | Vajrayudham (1985)

కృష్ణమ్మ పెన్నమ్మ పెనవేసుకున్నట్టు 



చిత్రం : వజ్రాయుధం (1985)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : బాలు, జానకి  


పల్లవి :


కృష్ణమ్మ పెన్నమ్మ పెనవేసుకున్నట్టు 

పెదవుల్ని కలిపెయ్యనా

గోదారి కావేరి ముద్దాడుకున్నట్టు 

కొంగుల్ని ముడివెయ్యనా

అలలై చెలించనా... కళలే వరించనా

నీలో పొంగేటి అందాల సందిళ్ళలో.. ఓ.. ఓ..


గంగమ్మ యమునమ్మ కలబోసుకున్నట్టు 

కౌగిళ్లు తడిపెయ్యనా

తుంగమ్మ భద్రమ్మ  వడి చేరుకున్నట్టు 

ఒళ్ళంతా తడిమెయ్యనా

నదినై చెలించనా... మదిలో వసించనా

పాలుతేనళ్ల పరువాల పందిళ్లలో.. ఓ.. ఓ... 


చరణం 1 :


తళుకు బెళుకులొలుకు కలికిచిలుక నడకలో

కడవకైన ఎడములేని తొడిమ నడుములో

వయసు అలా.. సొగసు కళ రేగుతున్నది

మనసుపడి మరుని ఒడి చేరుతున్నది


వలపు తీరా వంశధారా పిలుపు 

వినిపించే నా గుండెలో

వాగు వంకా సాగిరాగా జరిగే ఈ సంబరం


కృష్ణమ్మ పెన్నమ్మ పెనవేసుకున్నట్టు 

పెదవుల్ని కలిపెయ్యనా

తుంగమ్మ భద్రమ్మ  వడి చేరుకున్నట్టు 

ఒళ్ళంతా తడిమెయ్యనా


చరణం 2 :


అలలు తగిలి శిలలు పలుకు శిల్పవీణలో

నదుల ఎదను నటణమాడు చిలిపిమువ్వలో

కౌగిలితో స్వాగతమే పలుకుతున్నది

కాముడితో కాపురమే అడుగుతున్నది


కిన్నెరసాని కిలకిలలన్నీ సిగను 

చేరాయి సిరిమల్లెలై

కడలినదులు కలిసే దాకా 

సాగే ఈ సంగమం 


గంగమ్మ యమునమ్మ కలబోసుకున్నట్టు 

కౌగిళ్లు తడిపెయ్యనా

గోదారి కావేరి ముద్దాడుకున్నట్టు 

కొంగుల్ని ముడివెయ్యనా


నదినై చెలించనా... మదిలో వసించనా

నీలో పొంగేటి అందాల సందిళ్ళలో.. ఓ.. ఓ..


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే | Brahmamokkate Parabrahmamokkate | Annamacharya Keerthana | Annamayya (1997)

 బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే చిత్రం : అన్నమయ్య (1997) సంగీతం : ఎం ఎం కీరవాణి  రచన : అన్నమాచార్య సంకీర్తనలు  గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు