ఆకేసి పప్పేసి బువ్వేసి
చిత్రం : అభిమన్యుడు (1984)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
ఆకేసి పప్పేసి బువ్వేసి నెయ్యేసి
తనకో ముద్ద నాకో ముద్ద
ఆకేసి పప్పేసి బువ్వేసి నెయ్యేసి
తనకో ముద్ద నాకో ముద్ద
తినిపించువాడొచ్చే వేళయింది..
వళ్ళంతా కళ్ళుగా ఎదురొచ్చింది
ఇలా.. ఇలా.. ఇలా..ఆ..ఇలా.. ఇలా.. ఇలా..
చరణం 1 :
అతగడే జతగాడు అనుకున్నది..
అనుకున్నదే కలలు కంటున్నది
అతగాడే జతగాడు అనుకున్నది..
అనుకున్నదే కలలు కంటున్నది
కలలోని విందు... కనులవిందవునా
కలలోని విందు... కనులవిందవునా
మనసులోని ఆశ... మాంగళ్యమౌనా
ఇలా... ఇలా... ఇలా..ఆ..
ఇలా... ఇలా... ఇలా
చరణం 2 :
ఇది కలా... కలా... కలా...
మనమిలా.. ఇలా... ఇలా
గాలిలా పువ్వులా తావిలా...
కలిసి ఉన్నాము కలవకనే
కలుసుకున్నాము... తెలియకనే
వెలుగుకు నీడకు చెలిమిలా...
ఒక్కటైనాము కలవకనే
ఒదిగి ఉన్నాము... కరగకనే
ఈ ప్రేమపత్రము..
ఈ జన్మకు చెల్లువేయ్యుము
ప్రతి జన్మజన్మకు..
మరల తిరగ వ్రాసుకొందము
ఎలా ఎలా ఎలా..ఆ ఆ ఆ
ఇలా ఇలా ఇలా..ఇలా ఇలా ఇలా
ఆకుంది పప్పుంది
బువ్వుంది నెయ్యుంది
ఆకలి ఉంది..ఆశ ఉంది
చరణం 3 :
వెన్నెల కలువలా చెలువలా
\మందగించాము... జతలుగ
విందులవుదాము... కథలుగా
కన్నుల పాపలా... చూపులా..
చూచుకుందాము... సొగసులుగా
పగలు రేయిగా... రేయి పగలుగా
ఈ రాగసూత్రము...
మూడుముళ్ళు వేసుకుందము
ఈ మూగమంత్రము...
దీవెనగా చేసుకుందము
ఎలా ఎలా ఎలా..ఆ... ఆ... ఆ...
ఇలా.. ఇలా.. ఇలా..ఇలా... ఇలా... ఇలా
ఆకుంది పప్పుంది
బువ్వుంది నెయ్యుంది
ఆకలి ఉంది..ఆశ ఉంది
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్....
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి