RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

27, మార్చి 2025, గురువారం

ఈ నాడే బాబూ నీ పుట్టినరోజూ | Eenade Babu Nee Puttinaroju | Song Lyrics | Tata Manavadu (1973)

ఈ నాడే బాబూ నీ పుట్టినరోజూ



చిత్రం :  తాతా మనవడు (1973)

సంగీతం :  రమేశ్ నాయుడు

గీతరచయిత :  సి నారాయణ రెడ్డి

నేపధ్య గానం :  సుశీల 


పల్లవి :


ఈ నాడే బాబూ నీ పుట్టినరోజూ

ఈ ఇంటికే.. ఈ  ఇంటికే 

కొత్త వెలుగు వచ్చినరోజూ

ఈ నాడే బాబూ నీ పుట్టినరోజూ


చరణం 1 :


చిన్నబాబు ఎదిగితె...  

కన్నావరి కానందం..

నెలవంక పెరిగితె...  

నింగికే ఒక అందం

చుక్కలు వేయెందుకు 

ఒక్క చంద్రుడే చాలు..

చుక్కలు వేయెందుకు 

ఒక్క చంద్రుడే చాలు

తనవంశం వెలిగించె 

తనయుడొకడె పదివేలు 


ఈ నాడే బాబూ నీ పుట్టినరోజూ

ఈ ఇంటికే.. ఈ  ఇంటికే 

కొత్త వెలుగు వచ్చినరోజూ

ఈ నాడే బాబూ నీ పుట్టినరోజూ


చరణం 2 : 


కన్నవారి కలలు తెలుసుకోవాలీ.. 

ఆ కలలు కంటనీరు పెడితె 

తుడవాలీ

కన్నవారి కలలు తెలుసుకోవాలీ.. 

ఆ కలలు కంటనీరు పెడితె 

తుడవాలీ

తనకుతాను సుఖపడితే 

తప్పుగాకున్నా.. 

తనవారిని సుఖపెడితే 

ధన్యత ఓ నాన్నా   


ఈ నాడే బాబూ నీ పుట్టినరోజూ


చరణం 3 : 


తండ్రి మాటకై కానకు 

తరలిపోయె రాఘవుడూ.. 

అందుకే ఆ మానవుడు 

ఐనాడు దేవుడూ 

తల్లి చెరను విడిపించగ 

తలపడె ఆ గరుడుడూ.. 

అందుకె ఆ పక్షీంద్రుడు 

అంతటి మహానీయుడూ


ఓ బాబూ నువ్వూ ఆ బాటనడవాలి.. 

ఓ బాబూ నువ్వూ ఆ బాటనడవాలి

భువిలోన నీ పేరు 

ధృవతారగా వెలగాలీ.. 

ధృవతారగా వెలగాలీ   


ఈ నాడే బాబూ నీ పుట్టినరోజూ

ఈ ఇంటికే.. ఈ  ఇంటికే 

కొత్త వెలుగు వచ్చినరోజూ

ఈ నాడే బాబూ నీ పుట్టినరోజూ


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు