RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
anjalidevi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
anjalidevi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, ఆగస్టు 2026, ఆదివారం

హాయి హాయిగా ఆమని సాగే | Hayi Hayiga Amani Sage | Song Lyrics | Suvarna Sundari (1957)

హాయి హాయిగా ఆమని సాగే 


చిత్రం :  సువర్ణ సుందరి (1957)

సంగీతం :  ఆదినారాయణరావు

గీతరచయిత :  సముద్రాల (సీనియర్)

నేపధ్య గానం :  ఘంటసాల, జిక్కి  


పల్లవి :


ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

హాయి హాయిగా ఆమని సాగే

హాయి హాయిగా ఆమని సాగే

సోయగాల గన ఓయి సఖా.. 

ఆ ఆ ఆ.. హాయి సఖా.. ఆ ఆ ఆ

హాయి హాయిగా ఆమని సాగే


లీలగా పువులు గాలికి ఊగా ఆ.. ఆ.. ఆ...

లీలగా పువులు గాలికి ఊగా ఆ ఆ ఆ.....

లీలగా పువులు గాలికి వూగా

సనిదమ దనిసా గమ గమ దనిసా

రిసనిద సరిసని దనిని దనిని దని 

మగద మగద మద గరిగ మదని

లీలగా పువులు గాలికి ఊగా

కలిగిన తలపుల వలపులు రేగా

కలిగిన తలపుల వలపులు రేగా

ఊగిపోవు మది ఉయ్యాలగా..

ఆ ఆ ఆ..  జంపాలగా ఆ ఆ ఆ

హాయి హాయిగా ఆమని సాగే


చరణం 1 :


ఏమో... 

ఏమో తటిల్లతికమే మెరుపు

ఏమో తటిల్లతికమే మెరుపు 

మైమరపేమో

మొయిలురాజు దరి మురిసినదేమో.. 

మైమరపేమో

మొయిలురాజు దరి మురిసినదేమో


వలపు కౌగిలుల వాలి సోలి... 

వలపు కౌగిలుల వాలి సోలి

ఊగిపోవు మది ఉయ్యాలగా...  

జంపాలగా ఆ ఆ ఆ

హాయి హాయిగా ఆమని సాగే 


చరణం 2 :


ఆ ఆ ఆ ఆ ఆచూడుమా చందమామ.. 

అటు చూడుమా చందమామ

కనుమా వయ్యారి శారదయామిని 

కవ్వించే ప్రేమ...

ఆ ఆ ఆ.. చూడుమా చందమామ

వగలా తూలే విరహిణులా

వగలా తూలే విరహిణులా

మనసున మోహము రేపు నగవులా

మనసున మోహము రేపు నగవులా


ఊగిపోవు మది ఉయ్యాలగా 

జంపాలగా.. ఆ.. ఆ.. ఆ

హాయి హాయిగా ఆమని సాగే 


చరణం 3 :


ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..

కనుగవా తనియగా ప్రియతమా

కలువలు విరిసెనుగా..... 

కనుగవా తనియగా ప్రియతమా

కలువలు విరిసెనుగా ఆ ఆ ఆ 

కనుగవా తనియగా


చెలువము కనుగొనా.. ఆ.. ఆ.. 

చెలువము కనుగొనా

మనసానంద నాట్యాలు సేయునోయీ

ఆనంద నాట్యాలు సేయునోయీ


సరిగమదనిసా దనిసా 

సనిసగరిగా సరిసని

దనిమదనిస నిరినిరి దనిదని 

మదమద గమగమ గమ

దనిసా గమ దనిసా దనిసా


- పాటల ధనుస్సు 

15, నవంబర్ 2025, శనివారం

మీ నగుమోము నా కనులారా | Mee Nagumomu Naa Kanulara | Song Lyrics | Badi Panthulu (1972)

మీ నగుమోము నా కనులారా


చిత్రం : బడి పంతులు (1972)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : పి. సుశీల


పల్లవి:


మీ నగుమోము నా కనులారా 

కడదాకా కననిండు

మీ నగుమోము నా కనులారా 

కడదాకా కననిండు

ఈ సూత్రముతో ఈ కుంకుమతో 

నను కడతేరి పోనిండు

మీ నగుమోము నా కనులారా 

కడదాకా కననిండు


చరణం 1:


ఉపచారాలే చేసితినో.. 

ఎరగక అపచరాలే చేసితినో

ఉపచారాలే చేసితినో.. 

ఎరగక అపచరాలే చేసితినో

ఒడుదుడుకులలో తోడై ఉంటిని .. 

మీ అడుగున అడుగై నడిచితిని

మీ నగుమోము నా కనులారా 

కడదాకా కననిండు


చరణం 2:


రెక్కలు వచ్చి పిల్లలు వెళ్ళారు...

రెక్కలు అలిసి మీరున్నారు

రెక్కలు వచ్చి పిల్లలు వెళ్ళారు...

రెక్కలు అలిసి మీరున్నారు

పండుటాకులము మిగిలితిమి..

పండుటాకులము మిగిలితిమి..

ఇంకెన్ని పండుగలు చూడనుంటిమి

మీ నగుమోము నా కనులారా 

కడదాకా కననిండు


చరణం 3:


ఏ నోములు నే నోచితినో .. 

ఈ దేవుని పతిగా పొందితిని

ఏ నోములు నే నోచితినో .. 

ఈ దేవుని పతిగా పొందితిని

ప్రతి జన్మ మీ సన్నిధిలోనా... 

ప్రమిదగ వెలిగే వరమడిగితిని


మీ నగుమోము నా కనులారా 

కడదాకా కననిండు

ఈ సూత్రముతో ఈ కుంకుమతో 

నను కడతేరి పోనిండు

మీ నగుమోము నా కనులారా 

కడదాకా కననిండు


- పాటల ధనుస్సు 


27, మార్చి 2025, గురువారం

ఈ నాడే బాబూ నీ పుట్టినరోజూ | Eenade Babu Nee Puttinaroju | Song Lyrics | Tata Manavadu (1973)

ఈ నాడే బాబూ నీ పుట్టినరోజూ



చిత్రం :  తాతా మనవడు (1973)

సంగీతం :  రమేశ్ నాయుడు

గీతరచయిత :  సి నారాయణ రెడ్డి

నేపధ్య గానం :  సుశీల 


పల్లవి :


ఈ నాడే బాబూ నీ పుట్టినరోజూ

ఈ ఇంటికే.. ఈ  ఇంటికే 

కొత్త వెలుగు వచ్చినరోజూ

ఈ నాడే బాబూ నీ పుట్టినరోజూ


చరణం 1 :


చిన్నబాబు ఎదిగితె...  

కన్నావరి కానందం..

నెలవంక పెరిగితె...  

నింగికే ఒక అందం

చుక్కలు వేయెందుకు 

ఒక్క చంద్రుడే చాలు..

చుక్కలు వేయెందుకు 

ఒక్క చంద్రుడే చాలు

తనవంశం వెలిగించె 

తనయుడొకడె పదివేలు 


ఈ నాడే బాబూ నీ పుట్టినరోజూ

ఈ ఇంటికే.. ఈ  ఇంటికే 

కొత్త వెలుగు వచ్చినరోజూ

ఈ నాడే బాబూ నీ పుట్టినరోజూ


చరణం 2 : 


కన్నవారి కలలు తెలుసుకోవాలీ.. 

ఆ కలలు కంటనీరు పెడితె 

తుడవాలీ

కన్నవారి కలలు తెలుసుకోవాలీ.. 

ఆ కలలు కంటనీరు పెడితె 

తుడవాలీ

తనకుతాను సుఖపడితే 

తప్పుగాకున్నా.. 

తనవారిని సుఖపెడితే 

ధన్యత ఓ నాన్నా   


ఈ నాడే బాబూ నీ పుట్టినరోజూ


చరణం 3 : 


తండ్రి మాటకై కానకు 

తరలిపోయె రాఘవుడూ.. 

అందుకే ఆ మానవుడు 

ఐనాడు దేవుడూ 

తల్లి చెరను విడిపించగ 

తలపడె ఆ గరుడుడూ.. 

అందుకె ఆ పక్షీంద్రుడు 

అంతటి మహానీయుడూ


ఓ బాబూ నువ్వూ ఆ బాటనడవాలి.. 

ఓ బాబూ నువ్వూ ఆ బాటనడవాలి

భువిలోన నీ పేరు 

ధృవతారగా వెలగాలీ.. 

ధృవతారగా వెలగాలీ   


ఈ నాడే బాబూ నీ పుట్టినరోజూ

ఈ ఇంటికే.. ఈ  ఇంటికే 

కొత్త వెలుగు వచ్చినరోజూ

ఈ నాడే బాబూ నీ పుట్టినరోజూ


- పాటల ధనుస్సు 


12, మార్చి 2025, బుధవారం

సందేహించకుమమ్మా | Sandehinchaku Mamma | Song Lyrics | LavaKusa (1963)

సందేహించకుమమ్మా


చిత్రం :  లవకుశ (1963)

సంగీతం :  ఘంటసాల

గీతరచయిత :  సముద్రాల (సీనియర్)

నేపధ్య గానం :  ఘంటసాల 


పల్లవి :


సందేహించకుమమ్మా 

రఘురాము ప్రేమను ..... సీతమ్మా .....

సందేహించకుమమ్మా 

రఘురాము ప్రేమను ..... సీతమ్మా

సందేహించకుమమ్మా ..... 


చరణం 1 :


ఒకే బాణము ఒకటే మాట ..... 

ఒక్క భామకే రాముని ప్రేమ .....

ఒకే బాణము ఒకటే మాట ..... 

ఒక్క భామకే రాముని ప్రేమ

మిన్నే విరిగిపడినా ... 

ఆ ఆ ఆ... ఆ ఆ ఆ... ఆ ఆ ఆ...

మిన్నే విరిగిపడినా 

వ్రతభంగమ్ము కానీడమ్మా ఆ ఆ ఆ...


సందేహించకుమమ్మా 

రఘురాము ప్రేమను సీతమ్మా .....

సందేహించకుమమ్మా .... 


చరణం 2 :


రఘుకులేశుడే ధర్మము వీడి 

మరో భామతో కూడిన నాడు .....

రఘుకులేశుడే ధర్మము వీడి 

మరో భామతో కూడిన నాడు

నాదు జపము తపము 

నా కావ్యమ్మె వృథయగునమ్మా .....

నాదు జపము తపము 

నా కావ్యమ్మె వృథయగునమ్మా ఆ ఆ ఆ


సందేహించకుమమ్మా 

రఘురాము ప్రేమను ..... సీతమ్మా .....


- పాటల ధనుస్సు 


12, మే 2022, గురువారం

కాశీ విశ్వనాథా తండ్రీ విశ్వనాథా | Kasi Viswanadha | Song Lyrics | Puli Bidda (1981)

కాశీ విశ్వనాథా.. తండ్రీ విశ్వనాథా



చిత్రం :  పులిబిడ్డ (1981)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  బాలు


పల్లవి:


కాశీ విశ్వనాథా.. తండ్రీ విశ్వనాథా..

నువ్వే తండ్రివైతే... నా తల్లి విశాలాక్షి

నువ్వే నాకు సాక్షి..


కాశీ విశ్వనాథా.. తండ్రీ విశ్వనాథా..

నువ్వే తండ్రివైతే... నా తల్లి విశాలాక్షి

నువ్వే నాకు సాక్షి..


కాశీ విశ్వనాథా..తండ్రీ విశ్వనాథా..


చరణం 1:


కడుపున ఉండి కాలదన్నితే జన్మను ఇచ్చిందీ

కాళ్ల మీద పడి తల్లి అంటే కాదు పొమ్మంది..

కడుపున ఉండి కాలదన్నితే జన్మను ఇచ్చిందీ

కాళ్ల మీద పడి తల్లి అంటే కాదు పొమ్మంది..


పేగును తెంచిన అదే త్యాగం.. 

ప్రేమను తుంచిందా

అది అంతరాత్మనే నులిమేసిందా...

ఇక సత్యమన్నదే కరువౌతుందా...

ఇక సత్యమన్నదే కరువౌతుందా...


కాశీ విశ్వనాథా..తండ్రీ విశ్వనాథా..


చరణం 2:


శంభో మహదేవ హరహర శంభో మహదేవా

శంభో మహదేవ హరహర శంభో మహదేవా


దేహం రూపం ప్రాణం సర్వం విశాలాక్షి బిక్ష

అన్నెం పున్నెం ఎరుగని నాకు అన్నపూర్ణ రక్ష

దేహం రూపం ప్రాణం సర్వం విశాలాక్షి బిక్ష

అన్నెం పున్నెం ఎరుగని నాకు అన్నపూర్ణ రక్ష


ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డకు ఇది అగ్నిపరీక్ష

ఒడి చేర్చుకోవా.. అమ్మా నన్ను

గుడిలోని తండ్రే మనకు తీర్పు..

గుడిలోని తండ్రే మనకు తీర్పు..


కాశీ విశ్వనాథా.. తండ్రీ విశ్వనాథా..

నువ్వే తండ్రివైతే... నా తల్లి విశాలాక్షి

నువ్వే నాకు సాక్షి...

కాశీ విశ్వనాథా..తండ్రీ విశ్వనాథా..

శంభో మహదేవ హరహర శంభో మహదేవా

శంభో మహదేవ హరహర శంభో మహదేవా


కాశీ విశ్వనాథా..తండ్రీ విశ్వనాథా..


పాటల ధనుస్సు 

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు