కాశీ విశ్వనాథా.. తండ్రీ విశ్వనాథా
చిత్రం : పులిబిడ్డ (1981)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు
పల్లవి:
కాశీ విశ్వనాథా.. తండ్రీ విశ్వనాథా..
నువ్వే తండ్రివైతే... నా తల్లి విశాలాక్షి
నువ్వే నాకు సాక్షి..
కాశీ విశ్వనాథా.. తండ్రీ విశ్వనాథా..
నువ్వే తండ్రివైతే... నా తల్లి విశాలాక్షి
నువ్వే నాకు సాక్షి..
కాశీ విశ్వనాథా..తండ్రీ విశ్వనాథా..
చరణం 1:
కడుపున ఉండి కాలదన్నితే జన్మను ఇచ్చిందీ
కాళ్ల మీద పడి తల్లి అంటే కాదు పొమ్మంది..
కడుపున ఉండి కాలదన్నితే జన్మను ఇచ్చిందీ
కాళ్ల మీద పడి తల్లి అంటే కాదు పొమ్మంది..
పేగును తెంచిన అదే త్యాగం..
ప్రేమను తుంచిందా
అది అంతరాత్మనే నులిమేసిందా...
ఇక సత్యమన్నదే కరువౌతుందా...
ఇక సత్యమన్నదే కరువౌతుందా...
కాశీ విశ్వనాథా..తండ్రీ విశ్వనాథా..
చరణం 2:
శంభో మహదేవ హరహర శంభో మహదేవా
శంభో మహదేవ హరహర శంభో మహదేవా
దేహం రూపం ప్రాణం సర్వం విశాలాక్షి బిక్ష
అన్నెం పున్నెం ఎరుగని నాకు అన్నపూర్ణ రక్ష
దేహం రూపం ప్రాణం సర్వం విశాలాక్షి బిక్ష
అన్నెం పున్నెం ఎరుగని నాకు అన్నపూర్ణ రక్ష
ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డకు ఇది అగ్నిపరీక్ష
ఒడి చేర్చుకోవా.. అమ్మా నన్ను
గుడిలోని తండ్రే మనకు తీర్పు..
గుడిలోని తండ్రే మనకు తీర్పు..
కాశీ విశ్వనాథా.. తండ్రీ విశ్వనాథా..
నువ్వే తండ్రివైతే... నా తల్లి విశాలాక్షి
నువ్వే నాకు సాక్షి...
కాశీ విశ్వనాథా..తండ్రీ విశ్వనాథా..
శంభో మహదేవ హరహర శంభో మహదేవా
శంభో మహదేవ హరహర శంభో మహదేవా
కాశీ విశ్వనాథా..తండ్రీ విశ్వనాథా..
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి