ఈ సిగ్గు దొంతరలు ఎన్నాళ్ళూ
చిత్రం : మేనకోడలు (1972)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి :
ఈ సిగ్గు దొంతరలు ఎన్నాళ్ళూ..
ఈ వయసు తొందరలు ఎన్నాళ్ళు ..
ఎన్నాళ్ళో ?
ఎన్నాళ్ళా.. నా మనసు నీ మనసు తెలిసేదాకా
నా పెదవి నీ పెదవి కలిసే దాకా
ఈ సిగ్గు దొంతరలు ఎన్నాళ్ళూ..
ఈ వయసు తొందరలు ఎన్నాళ్ళూ
చరణం 1 :
అలలాగా వెన్నెలలాగా..
నువ్వలుముకుంటే నా మనసే ఆగునా.. హొయ్
కనుగీటి.. బుగ్గను మీటీ..
నువు పెనవేస్తే నా వలపే దాగునా
దాగని ఆ వలపే కావాలీ..
దాగని ఆ వలపే కావాలీ
నువ్వు నా దానివై ఉండిపోవాలీ.. ఆ.. ఊ
ఈ సిగ్గు దొంతరలు ఎన్నాళ్ళూ..
ఈ వయసు తొందరలు ఎన్నాళ్ళూ
నా కొంగు నీ కొంగు కలిపే దాకా..
కళ్యాణ రాగాలు పలికే దాకా..
అందాకా.. అందాకా
చరణం 2 :
పుత్తడిబొమ్మలా ఉన్నావూ..
పున్నమి పువ్వులా ఉన్నావూ
మల్లెల పాన్పు మీద ఉన్నావూ
హొయ్.. మల్లెల పాన్పు మీద ఉన్నావూ
చల చల్లగా మెల్లగా అల్లరి పెడుతున్నావూ.. ఊ.. ఊ
ఈ సిగ్గు దొంతరలు ఎన్నాళ్ళూ..
ఈ వయసు తొందరలు ఎన్నాళ్ళూ
చిన్నారి పాపాయి కలిగేదాకా..
ఇన్నాళ్ళ పైడి కలలు పండే దాకా.. హహహహ
ఆహహహా.. ఆహహహా.. ఆహాహాహా
ఊహుహుహూ.. ఊహుహుహూ.. ఊహుహుహూ
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి