RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

3, మే 2022, మంగళవారం

పందొమ్మిదివందల ఎనభై వరకు | Pandommidi vandala | Song Lyrics | Sardar Paparayudu (1980)

పందొమ్మిదివందల ఎనభై వరకు



చిత్రం:  సర్దార్ పాపారాయుడు (1980)

సంగీతం:  చక్రవర్తి

గీతరచయిత:  దాసరి

నేపధ్య గానం:  సుశీల, బాలు



పల్లవి :


పందొమ్మిదివందల ఎనభై వరకు

ఇట్లాంటి ఒక పిల్ల నా కంటబడలేదు

పడినా ....నే వెంటపడలేదు

ఓ బంగారక్కా .. చూపే శృంగారక్కా

ఓ బంగారక్కా .. చూపే శృంగారక్కా


పందొమ్మిదివందల ఎనభై వరకు

ఇట్టాంటి కుర్రోడు నాకంటబడలేదు

పడినా ....నే వెంటపడలేదు

ఓ అందాలయ్యా ...చూపే దండాలయ్యా

ఓ అందాలయ్యా ...చూపే దండాలయ్యా


చరణం 1 :



ఆరేళ్ళ ముందు చూస్తే.. చిన్నపిల్ల

పదహారేళ్ళ వయసునాడు .కుర్రపిల్ల


ఆరేళ్ళ ముందు చూస్తే.. చిన్నపిల్ల

పదహారేళ్ళ వయసునాడు ...కుర్రపిల్ల

ఏడు పెరుగుతుంటే.. ఈడు పెరుగుతుంది

ఈడు పెరుగుతుంటే ..జోడు కుదురుతుంది


ప్రేమకు ఈడెందుకూ? పెళ్ళికి ప్రేమెందుకు?

ప్రేమకు పెళ్లితోడు ..పెళ్ళికి ప్రేమతోడు

అమ్మతోడు ..అయ్యతోడు.. నీకు నాకు... ఈడుజోడు ...


హోయ్ .. హోయ్.. 

పందొమ్మిదివందల ఎనభై వరకు

ఇట్లాంటి ఒక పిల్ల నా కంటబడలేదు

పడినా ....నే వెంటపడలేదు

ఓ అందాలయ్యా ...చూపే దండాలయ్యా

ఓ బంగారక్కా .. చూపే శృంగారక్కా


చరణం 2 :


మొదటిసారి చూచినపుడు.. అగ్గిరాముడు...

మరి మూడేళ్ల ముందుచూస్తే ..అడవిరాముడు..


మొదటిసారి చూచినపుడు.. అగ్గిరాముడు

మరి మూడేళ్ల ముందుచూస్తే ..అడవిరాముడు


 ఏడు పెరుగుతుంటే ..వయసు తరుగుతుంది

 వయసు తరుగుతుంటే.. సోకు పెరుగుతుంది


మనసుకు సోకెందుకు ? వయసుకు మనసెందుకు?

మనిషికి మనసు అందం.. మనసుకు ప్రేమబంధం

ఈ అందం ..ఆ బంధం.. ఇద్దరిది ...వివాహబంధం


హోయ్! పందొమ్మిదివందల ఎనభై వరకు

ఇట్టాంటి కుర్రోడు నాకంటబడలేదు

పడినా ....నే వెంటపడలేదు

ఓ అందాలయ్యా ...చూపే దండాలయ్యా

ఓ అందాలయ్యా ...చూపే దండాలయ్యా...


పందొమ్మిదివందల ఎనభై వరకు

ఇట్లాంటి ఒక పిల్ల నా కంటబడలేదు

పడినా ....నే వెంటపడలేదు

ఓ బంగారక్కా .. చూపే శృంగారక్కా

ఓ బంగారక్కా .. చూపే శృంగారక్కా


- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు