RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

22, మే 2022, ఆదివారం

అందం శరణం గఛ్చామి | Andam Saranam | Song Lyrics | Pasivadi Pranam (1987)

అందం శరణం గఛ్చామి



చిత్రం:  పసివాడి ప్రాణం (1987)

సంగీతం:  చక్రవర్తి

గీతరచయిత:  వేటూరి

నేపధ్య గానం:  బాలు, సుశీల


పల్లవి:


అందం శరణం గఛ్చామి...  

అధరం శరణం గఛ్చామి

ఈ సాయంత్ర వేళ...  నీ ఏకాంతసేవ

అతి మధురం... అనురాగం.. 

ఒదిగే వయ్యారం


ప్రణయం శరణం గఛ్చామి.... 

హృదయం శరణం గఛ్చామి

ఈ సింధూర వేళ... నీ శృంగారలీల

సుఖ శిఖరం... శుభయోగం.... 

అది నా సంగీతం



చరణం 1:


ఎంతకు తీరని ఎదలో ఆశలేమో... 

అడగరానిదై చెప్పరానిదై.. 

పెదవుల అంటింతనై... 


మాటతో తీరని మదిలో దాహమే

చిలిపి ముద్దుకై.. చినుకు తేనెకై ... 

కసికసి కవ్వింతలై


నీ నవ్వు నాలో... నాట్యాలు చేసే

కౌగిట్లో.. సోకమ్మ వాకిట్లో... 

తెరిచే గుప్పిళ్లలోన...


ప్రణయం శరణం గఛ్చామి.... 

హృదయం శరణం గఛ్చామి


  

చరణం 2:


చూపుతో గిచ్చక..  వయసే లేతదమ్మా...

వలపు గాలికే వాడుతున్నది.. 

విసరకు పూబాణమే 


చేసుకో మచ్చిక ... వరసే కొత్తదమ్మా

చలికి రేగిన ఒడికి చేరిన.. 

చెరిసగ మీ ప్రాణమే



నీ ఊపిరి నాలో పూలారబోసి... 

అందాలో నా ప్రేమ గంధాలో...  

ముసిరే ముంగిళ్లలోన



అందం శరణం గఛ్చామి... 

హృదయం శరణం గఛ్చామి

ఈ సాయంత్ర వేళ ... నీ ఏకాంతసేవ

సుఖ శిఖరం శుభయోగం... 

అది నా సంగీతం


- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు