RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

7, మే 2022, శనివారం

చారడేసీ కళ్ళేమి | Charadesi kallemi | Song Lyrics | Devudu Lanti Manishi (1975)

చారడేసీ కళ్ళేమి చేసుకుంటావూ



చిత్రం :  దేవుడులాంటి మనిషి (1975)

సంగీతం :  కె. వి. మహదేవన్

గీతరచయిత : సినారె

నేపధ్య గానం :  సుశీల, బాలు 



పల్లవి :



చారడేసీ కళ్ళేమి చేసుకుంటావూ.. 

ఓరబ్బీ నీ అందం చూసుకుంటానూ

చూచుకున్న అందమేమి చేసుకుంటావూ.. 

కాటుకలా రంగరించి పూసుకుంటానూ

చారడేసీ కళ్ళేమి చేసుకుంటావూ.. 

ఓరబ్బీ నీ అందం చూసుకుంటానూ


సింగారి సింగారి పిల్లా.. బంగారు బంగారు మామా

సింగారి సింగారి పిల్లా..  బంగారు బంగారు మామా




చరణం 1 :



ఏటికి ఎదురీదే గండుమీనులా..  

ఎందుకే తుళ్ళి తుళ్ళి పడుతున్నావూ

ఏటికి ఎదురీదే గండుమీనులా.. 

ఎందుకే తుళ్ళి తుళ్ళి పడుతున్నావూ


తగినోడు కాదగినోడూ..  తగినోడు కాదగినోడూ

నే జిక్కేది ఎప్పుడని చూస్తున్నానూ

చేజిక్కితే వాణేమి చేసుకుంటావూ?

నా కొప్పులో గుప్పున ముడిచేసుకుంటానూ


చారడేసీ కళ్ళేమి చేసుకుంటావూ.. 

ఓరబ్బీ నీ అందం చూసుకుంటానూ  




చరణం 2 :


పట్టు దొరకని పరువంలాగా.. 

పడవెళ్ళిపొతుందే పడుచుదానా

వీలు చూసీ వాలు చూసీ.. 

వీలు చూసీ వాలు చూసీ.. 

ఎత్తరా తెరచాప బుల్లిరాయడా

ఓ నా బుజ్జి నాయనా.. 

నేను బుజ్జోణ్ణయితే ఎమిచేసుకుంటావూ

పాల బువ్వెట్టి ఎదలో దాచేసుకుంటానూ



చరణం 3 :



పంట చేనిపై పైర గాలిలా.. 

ఎందుకో చక్కిలిగిలి పెడుతున్నావూ

పంట చేనిపై పైర గాలిలా.. 

ఎందుకో చక్కిలిగిలి పెడుతున్నావూ


మూణ్ణాళ్ళకా రెణ్ణాళ్ళకా.. మూణ్ణాళ్ళకా రెణ్ణాళ్ళకా

మూడు ముళ్ళు ఎప్పుడని అడుగుతున్నానూ

ఆ మూడు ముళ్ళు వేసి ఏమి చేసుకుంటావూ

నిన్ను ప్రతి జన్మకు నా దానిగ చేసుకుంటానూ


చారడేసీ కళ్ళేమి చేసుకుంటావూ.. 

ఓరబ్బీ నీ అందం చూసుకుంటానూ

సింగారి సింగారి పిల్ల.. బంగారు బంగారు మామా

సింగారి సింగారి పిల్ల.. బంగారు బంగారు మామా.. 


 - పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు