RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

4, మే 2022, బుధవారం

ఉయ్యాలకు వయసొచ్చింది | Uyyalaku Vayasochindi | Song Lyrics | Sardar Paparayudu (1980)

ఉయ్యాలకు వయసొచ్చింది



చిత్రం:  సర్దార్ పాపారాయుడు (1980)

సంగీతం:  చక్రవర్తి

గీతరచయిత:  దాసరి

నేపధ్య గానం:  బాలు, సుశీల


పల్లవి :


వోయ్ వోయ్ ..వోయ్ .. వోయ్ .. వోయ్ వోయ్

వోయ్ వోయ్ ..వోయ్ .. వోయ్ .. వోయ్ వోయ్


ఉయ్యాలకు వయసొచ్చింది...  

ఊపి ఊపి చంపేస్తుంది

ఉయ్యాలకు వయసొచ్చింది...  

ఊపి ఊపి చంపేస్తుంది


ఏ దేవి తంత్రమో... 

శ్రీదేవి ..మంత్రమో ..

ఏ దేవి తంత్రమో...  శ్రీదేవి ..మంత్రమో... 

తెలియాలి ఆ గుట్టు ఈ దేవికి


ఉయ్యాలకు వయసొచ్చింది... 

ఊపి ఊపి చంపేస్తుంది

ఉయ్యాలకు వయసొచ్చింది... 

ఊపి ఊపి చంపేస్తుంది


ఏ దేవుడి తంత్రమో... 

ఈ రాముని మంత్రమో ..

ఏ దేవుడి తంత్రమో...  

ఈ రాముని మంత్రమో ..

తెలియాలి ఆ గుట్టు రాముడికి...



చరణం 1:


వోయ్ వోయ్ ..వోయ్ .. వోయ్ .. వోయ్ వోయ్

వోయ్ వోయ్ ..వోయ్ .. వోయ్ .. వోయ్ వోయ్


అడుగు తీసి అడుగెయ్యనా .. 

నీ అడుగులోన అడుగెయ్యనా

అడుగు తీసి అడుగెయ్యనా .. 

నీ అడుగులోన అడుగెయ్యనా

నే అనుకున్నది అడిగెయ్యనా ...

అడగకుండా వదిలెయ్యనా

చల్లకొచ్చి.. ముంతదాచి ..

పండు తెచ్చి .. దాచిపెట్టి ..

వాటెయ్యకు .. వదిలెయ్యకు.. 

చెప్పకుండ చంపేయ్యకు ...

అనుకున్నది చెప్పకుండ చంపెయ్యకు ...


ఉయ్యాలకు వయసొచ్చింది.. 

ఊపి ఊపి చంపేస్తుంది



చరణం 2 :



వోయ్ వోయ్ ..వోయ్ .. వోయ్ .. వోయ్ వోయ్

వోయ్ వోయ్ ..వోయ్ .. వోయ్ .. వోయ్ వోయ్


గుండెలోన ఇల్లేయ్యనా ..

ఆ ఇంటిలోన నిన్నుంచనా

గుండెలోన ఇల్లేయ్యనా ..

ఆ ఇంటిలోన నిన్నుంచనా

అర్ధరాత్రి వచ్చేయ్యనా ..

మనసైనది చెప్పేయ్యనా


చెప్పకుండా.. చెయ్యకుండా.. 

రాకుండా.. ఉండకుండా ..

ఊరించకూ.. ఉడికించకూ ..

దాచేసి మాటాడకు ...

అనుకున్నది... దాచేసి మాటాడకు ...


ఉయ్యాలకు వయసొచ్చింది.. 

ఊపి ఊపి చంపేస్తుంది...

ఏ దేవి తంత్రమో... శ్రీదేవి  మంత్రమో

ఏ దేవుడి తంత్రమో... ఈ రాముని మంత్రమో ..

తెలియాలి ఆ గుట్టు ఈ దేవికి ...


ఉయ్యాలకు వయసొచ్చింది.. 

ఊపి ఊపి చంపేస్తుంది...


పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు