హల్లో.. టెంపర్.. ఓ.. విజయా సూపర్..
చిత్రం: సర్దార్ పాపారాయుడు (1980)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: దాసరి
నేపధ్య గానం: బాలు, సుశీల
పల్లవి :
వోయ్.. వోయ్.. వోయ్ వోయ్..
హల్లో.. టెంపర్.. ఓ.. విజయా సూపర్..
హల్లో.. టెంపర్.. ఓ.. విజయా సూపర్..
పైలా పచ్చీస్.. పైలాపచ్చీస్ బుల్లెట్ బండి...
అర్రే.. పదిహేడేళ్ళు నిండీ నిండని స్కూటరండీ
రాటుదేలి.. రచ్చకెక్కి.. ఢీ కొన్నాయండి
రాటుదేలి.. రచ్చకెక్కి.. ఢీ కొన్నాయండి !!
హల్లో... టెంపర్.. ఓ.. విజయా సూపర్ ..
చరణం 1 :
ఎండకు కందే.. సుకుమారుల్లా...
ఉన్నారు మీరు
ముందుకు వెనుక.. తెలియక నాపై...
దాడికి వచ్చారు
మాట మాట పెరిగితే..
మోటుతనానికి దిగితే...
అర్రె కర్రో కత్తో విసిరితే..
మీ కాలో చెయ్యో విరిగితే
మీ పెళ్ళి కాస్త గోవిందా.. గోవిందా..
మీకు మొగుడే రాడు గోవిందా..
భజగోవిందా.. గోవిందా
పెళ్ళి కాస్త గోవిందా.. గోవిందా..
మీకు మొగుడే రాడు గోవిందా..
భజగోవిందా..
అహ...హల్లో.. టెంపర్.. ఓ.. విజయా సూపర్..
హల్లో... టెంపర్.. ఓ.. విజయా సూపర్..
చరణం 2 :
ముద్దు ముచ్చట తీరుస్తా..
ముట్టుకోనీ నిన్నూ...
పగలే చుక్కలు పొడిపిస్తాలే..
ముద్దు పెట్టుకోనీ నన్ను..
కాదని విర్రవీగితే.. కయ్యానికి కాలు దువ్వితే
టక్కు నిక్కు చూపితే.. నాలో తిక్కరేగితే
నీ టాపు లేచిపోతుంది గోవిందా....
నీ షేపు మారిపోతుంది భజగోవిందా
గోవిందా..గోవిందా...
టాపు లేచిపోతుంది గోవిందా ..
నీ షేపు మారిపోతుంది
గోవిందా.. భజగోవిందా...
హల్లో... టెంపర్.. ఓ.. విజయా సూపర్ ..
హల్లో...హల్లో... టెంపర్.. ఓ.. విజయా సూపర్ ..
పైలా పచ్చీస్.. పైలాపచ్చీస్ బులెట్ బండీ..
అర్రే... పదిహేడేళ్ళు నిండీ నిండని స్కూటరండీ
రాటుదేలి.. రచ్చకెక్కి.. ఢీ కొన్నాయండి
రాటుదేలి.. రచ్చకెక్కి.. ఢీ కొన్నాయండి...
హల్లో... టెంపర్.. ఓ.. విజయా సూపర్..
హల్లో.. టెంపర్.. ఓ.. విజయా సూపర్..
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి